
సాక్షి, హైదరాబాద్ : ఎవరినీ నొప్పించని మనస్తత్వం, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం గవర్నర్ నరసింహన్ సొంతం. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన... ఇక బై..బై అంటూ చెన్నైకి పయనమయ్యారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ ఉద్విగ్నానికి లోనయ్యారు. దుఃఖం ఆపుకోలేకపోయారు. మరోవైపు తమకు లభించిన ఆదరాభిమానాలకు చలించిన గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కంటతడి పెట్టారు. కాగా అంతకు ముందు గవర్నర్ దంపతులను సీఎం దంపతులతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు.
(చదవండి: నా పేరు నరసింహన్)
Comments
Please login to add a commentAdd a comment