E.S.L Narasimhan
-
దుఃఖం ఆపుకోలేకపోయారు...
సాక్షి, హైదరాబాద్ : ఎవరినీ నొప్పించని మనస్తత్వం, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం గవర్నర్ నరసింహన్ సొంతం. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన... ఇక బై..బై అంటూ చెన్నైకి పయనమయ్యారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ ఉద్విగ్నానికి లోనయ్యారు. దుఃఖం ఆపుకోలేకపోయారు. మరోవైపు తమకు లభించిన ఆదరాభిమానాలకు చలించిన గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కంటతడి పెట్టారు. కాగా అంతకు ముందు గవర్నర్ దంపతులను సీఎం దంపతులతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. (చదవండి: నా పేరు నరసింహన్) -
చంద్రబాబు సీఈఓను బెదిరించడం దారుణం
-
మా మీదే దాడి చేసి మా పైనే దొంగ కేసులు పెట్టారు
-
నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
-
రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
-
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
-
తెలంగాణ కేబినెట్ రేసులో ఆ 10మంది?
-
తెలంగాణ కేబినెట్ రేసులో ఆ 10మంది?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ఇప్పుడు... కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణలో పదిమందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. కాగా గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. ఊహించని విధంగా ఒకరిద్దరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19ద తేదీ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మంత్రివర్గ కూర్పులో సాధారణంగా మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని పరిపాలన సమర్థత, సామాజిక సమీకరణాలు, ప్రభుత్వం–పార్టీని అనుసంధానించే నేతలతో కేబినెట్ ఏర్పాటు కానుంది. అంతేకాకుండా గత టీఆర్ఎస్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కలేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి ఒకరికి అవకాశం లభించనుంది. మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో గత ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్, సాగునీటి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డికి కేబినెట్లో అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. -
19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
-
19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ తర్వాతే కేబినెట్ విస్తరణ తేదీ అధికారికంగా వెల్లడి అయింది. ఈ విస్తరణలో 10మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్...మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఇంకా తెలియరాలేదు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. మరోవైపు సోమవారం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
అక్రమంగా ఓట్ల తొలగింపు: బుగ్గన
-
విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వేల పేరుతో విచ్చలవిడిగా ఓట్లు తొలగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దాదాపు 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. చాలామందికి ఊళ్లల్లో చాలామందికి ఓట్లు కనిపించడం లేదని, మరోవైపు కొందరికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయని అన్నారు. సర్వేల పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని బుగ్గన తెలిపారు. ప్రభుత్వమే దొంగ ఓట్లను ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ అంశాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారని బుగ్గన పేర్కొన్నారు. -
విభజన సమస్యలు పరిష్కారం కాలేదు: గవర్నర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. బుధవారం ఉదయం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందని, నాలుగన్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న గవర్నర్.. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన కొనసాగుతోందన్నారు. -
సోదరుడిగా సూచనలు చేస్తా!
తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్ సీనియర్ బ్రదర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తా కొత్త ఏడాది రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ‘2015 మనందరికీ మంచి ఏడాది కావాలి... తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుతున్నా. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారనే నమ్మకం ఉంది’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సీనియర్ బ్రదర్‌గా, గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తానని, సూచనలు చేస్తానని ఆయన చెప్పారు. నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రముఖులతో పాటు వందలాది మంది సామాన్య ప్రజలు గవర్నర్‌ను కలసి నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల సీఎంలతో తరచూ సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని, వివాద రహిత తెలుగు రాష్ట్రాలే తన కల అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులిద్దరూ మంచి విజన్‌తో పనిచేస్తున్నారని, కొత్త ఏడాదిలో వారి ప్రణాళికలకు ఫలి తాలు అందుతాయని ఆశిస్తున్నానన్నారు. ఎంసెట్ పరీక్ష విషయంలో రెండు రాష్ట్రాల విద్యా మంత్రులతో సమావేశమైనప్పుడు కొన్ని మార్గాలు సూచించానని, వాటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తామని వారి వురూ అంగీకరించారని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా తనకు ఎలాంటి నివేదిక అందలేదని, దాని కోసమే వేచిచూస్తున్నానని చెప్పారు. వర్సిటీల వీసీల నియామకాలపై వివాదాలు త్వరలోనే సద్దుమణిగేలా చొరవ తీసుకుంటానన్నారు. పోలవరం ముంపు మండలాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. సమాజంపై మీడియా అమిత ప్రభావం చూపుతుందని, పాత్రికేయులు వక్రీకరణలు మాని నిర్మాణాత్మక సూచనలు చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. గవర్నర్‌ను కలసిన వారిలో ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపీ రాముడు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులున్నారు. రెండు రాష్ట్రాల వేడుకల్లో పాల్గొంటా.. జనవరి 26న రెండు రాష్ట్రాల గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొంటానని గవర్నర్ వెల్లడించారు. 26న ఉదయం విజయవాడలో జరిగే ఏపీ ఉత్సవాలకు హాజరవుతానన్నారు. అనంతరం నేరుగా వాయు మార్గంలో హైదరాబాద్ చేరుకుని తెలంగాణ గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నట్టు వివరించారు. 26న సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలకు విందు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. -
ఇద్దరు సీఎంలూ పక్కపక్కనే: నరసింహన్
* రెండు రాష్ట్రాల పాలనా సచివాలయం నుంచే * ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్ ఆదేశాలు * తెలంగాణ ముఖ్యమంత్రికి సీ బ్లాక్ * ఆంధ్రప్రదేశ్ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్ * రెండు ప్రభుత్వాల ఉద్యోగులకు బ్లాకుల విభజన * అమృత క్యాజిల్ గేటు నుంచి తెలంగాణ సీఎం * లుంబిని పార్కు కొత్త గేటు నుంచి ఏపీ సీఎం.. * సీఎం క్యాంపు కార్యాలయం తెలంగాణ సీఎంకు * ఏపీ సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్ * అసెంబ్లీలోనే రెండు శాసనసభల సమావేశాలు * హైదర్‌గూడ క్వార్టర్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు * ఆదర్శనగర్ క్వార్టర్లు తెలంగాణ ఎమ్మెల్యేలకు * నెలాఖరుకల్లా పూర్తి ప్రతిపాదనలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రస్తుత సచివాలయం నుంచే పాలనా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై గవర్నర్ తొలిసారిగా దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచే పరిపాలన సాగించటానికి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులనే సమకూర్చాలని, ఎటువంటి కొత్త నిర్మాణాలను చేపట్టరాదని నిర్ణయించారు. ఎక్కడైనా అత్యవసరమైన పక్షంలో ఉన్న భవనాల్లోనే అదనపు వసతులను కల్పించాలని స్పష్టంచేశారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన చర్యలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ నిర్దేశించారు. ప్రాథమికంగా జరిగిన కసరత్తు, అధికారుల ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. * రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రస్తుతం ఉన్న సచివాలయం నుంచే తమ తమ రాష్ట్రాల పరిపాలన కొనసాగిస్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్‌లోని సీఎం కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తారు. మొన్నటి వరకు డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ హెచ్ బ్లాక్‌లోని మూడో అంతస్థుతో పాటు ఆ మ్తొతం బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయ అధికారులకు కేటాయిస్తారు. సౌత్ హెచ్ బ్లాక్‌లోనే సీఎస్ కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరాన్ని నిర్మిస్తారు. * ప్రస్తుతం సచివాలయానికి రాకపోకలకు రెండు వైపులా రెండేసి గేట్లు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు అమృత క్యాజల్ హోటల్ ఎదురుగా గల పాత గేటును ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు లుంబినీ పార్కు ఎదురుగా గల కొత్త గేటును ఉపయోగిస్తారు. * సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లను లేదా ఏ, బీ, సీ, ఎల్ బ్లాక్‌లను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జే, కే, ఎల్, హెచ్ బ్లాకులు రెండు కేటాయిస్తారు. ఎల్ బ్లాక్ కోసం తెలంగాణ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ బ్లాకును తెలంగాణకు కేటాయిస్తే డీ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయిస్తారు. * ప్రస్తుత అసెంబ్లీ ఆవరణలోనే ఇరు రాష్ట్రాల శాసనసభ సమావేశాలను నిర్వహిస్తారు. బహుశా పాత అసెంబ్లీ భవనంలో తెలంగాణ ప్రభుత్వ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా అదనపు సౌకర్యాలను కల్పిస్తారు. కొత్త అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత శాసన మండలిని తెలంగాణ శాసనమండలి సమావేశాలకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలకు అక్కడే అవసరమైతే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలా లేదా అనే విషయాన్ని ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. * ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంగా కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికార నివాసంగా గ్రీన్‌ల్యాండ్స్ అతిథి గృహాన్ని సిద్ధం చేస్తారు. అవసరమైన అదనపు వసతులను అక్కడ కల్పిస్తారు. * ప్రస్తుతం ఉన్న మంత్రుల క్వార్టర్లనే ఇరు రాష్ట్రాల మంత్రులకు కేటాయిస్తారు. ఇష్టం వచ్చినట్లు మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం లేనందున ప్రస్తుతానికి ఉన్న క్వార్టర్లే మంత్రులకు సరిపోతాయి. * ప్రస్తుతం హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయిస్తారు. * విద్యుత్ సౌధ, జలసౌధ, సంక్షేమ భవన్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌తో పాటు ఇతర అన్ని శాఖలు, డెరైక్టరేట్ కార్యాలయాలను జనాభా ప్రాతిపదికన లేదంటే వెసులుబాటు ప్రకారం రెండు రాష్ట్రాల ఉద్యోగులకు కేటాయిస్తారు. విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు ఆరు నెలలు సమయం ఉన్నందున తరువాత నిర్ణయం తీసుకుంటారు. -
ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి
రాష్ట్రపతి పాలన పెట్టండి.. గవర్నర్‌కు టీఆర్ఎస్ వినతిపత్రం సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ నరసింహన్‌ను టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కె.హరీశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, కె.తారక రామారావు, సోమారపు సత్యనారాయణ, ఎం.బిక్షపతి, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎంపై కేబినెట్ మంత్రులకు విశ్వాసం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం తెలంగాణకు చెందిన కేబినెట్ మంత్రులంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోగా మరింతగా దిగజారే పరిస్థితులను కల్పిస్తున్నాడని గవర్నరుకు వారు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలు క్షీణించడానికి సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తూ ఏపీఎన్జీవోల సమ్మెను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సర్వీసుకు సంబంధంలేని అంశాలపై ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్‌కు వివరించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా నివేదికలను, ప్రకటనలను ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి చేసిన ప్రకటనను గవర్నరుకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలిజం పెరుగుతుందంటూ నివేదికలను ఇవ్వాలని దినేశ్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు సీఎం ఆదేశించడం.. భూకబ్జాలకు, అవినీతికి, అక్రమాలకు మద్దతును ఇవ్వాలని కోరడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేవిధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు సంక్షోభం తీవ్రమైనా ప్రభుత్వ పరంగా చర్యలేమీ తీసుకోకుండా గ్రిడ్లను దెబ్బతీసే విధంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంక్షోభానికి కారణమైన ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలననను విధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.