సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వేల పేరుతో విచ్చలవిడిగా ఓట్లు తొలగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బుగ‍్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దాదాపు 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. చాలామందికి ఊళ్లల్లో చాలామందికి ఓట్లు కనిపించడం లేదని, మరోవైపు కొందరికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయని అన్నారు. సర్వేల పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని బుగ్గన తెలిపారు. ప్రభుత్వమే దొంగ ఓట్లను ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ అంశాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ..అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారని బుగ‍్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment