తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ తర్వాతే కేబినెట్ విస్తరణ తేదీ అధికారికంగా వెల్లడి అయింది. ఈ విస్తరణలో 10మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్...మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు.