గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం | Telangana CM KCR Meets Governor Narasimhan at Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం

Published Fri, Feb 15 2019 2:08 PM | Last Updated on Fri, Feb 15 2019 3:20 PM

Telangana CM KCR Meets Governor Narasimhan at Raj Bhavan - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్‌ దక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్‌ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. మరోవైపు సోమవారం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్‌ఎస్ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement