
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం.
చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం
Comments
Please login to add a commentAdd a comment