vaikunta ekadasi celebrations
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
Vaikunta Ekadasi: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. అశేష భక్త జనం నడుమ స్వర్ణరథంపై తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్త జనసందోహం (ఫొటోలు)
-
Tirumala Vaikunta Ekadasi Pics: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి దర్శనం కోసం భక్త జనసందోహం (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ కట్టడికి టీటీడీ కొత్త ఆలోచన
-
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు పంపిణీ
-
తిరుపతికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్న భక్తులు
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
గుంటూరు: మంగళగిరి పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కలిగే అత్యద్భుతమైన ఫలితాలు
-
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
-
ఋషికొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
గర్భాలయం నుంచి మహాద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ
-
స్వామివారిని దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
-
ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
-
భద్రాచలం సీతారాముల సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు (ఫొటోలు)
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా సర్వం సిద్ధం
-
Vaikunta Ekadasi 2022 : శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో ప్రముఖులు
-
ఇల 'వైకుంఠం'
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగనుంది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ మేరకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజులతో ప్రారంభమై... శ్రీవారి ఆలయంలో 2020కి ముందు వరకు వైకుంఠ ద్వారాన్ని రెండు రోజులపాటు మాత్రమే తెరిచి ఉంచేవారు. ఆ తర్వాత నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేలా సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ పది రోజులలో ముక్కోటి దేవతలుగా భావించే వరుణుడు, వృషభుడు, నహుషుడు, ప్రత్యూషూడు, జయుడు, అనిలుడు, విష్ణుడు,ప్రభాసుడు, అజైతపాత, అహిర్భుద్నుడు, విరుపాక్షరుద్రుడు, సురేశ్వరుడు, జయంతరుద్రుడు, బహురూపరుద్రుడు, త్య్రంబకుడు, అపరాజితుడు,ౖ వెవస్వతరుద్రుడు, అర్యముడు, మిత్రుడు, ఖగుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, భాస్కరుడు, పీషుడు, పర్జన్యుడు, తృష్ణ, విష్ణువు, అజుడు, ఆదిత్యుడు, ప్రజాపతి, పావిత్రుడు, హరుడు వంటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే సమయంలో మానవులు కూడా మహావిష్ణువుని దర్శించుకుంటే అంతే మోక్షం లభిస్తుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత వేంకటాచల మహత్యంలో దేవతలకు ఉత్తరాయణంలో వచ్చే 6 నెలల కాలాన్ని పగలుగా, దక్షిణాయనంలో వచ్చే 6 నెలల కాలాన్ని రాత్రిగా పేర్కొంటారు. దక్షిణాయనంలో చివరి నెల ధనుర్మాసాన్ని దేవతల నెలగా భావిస్తారు. దేవతలకు ఈ నెల బ్రహ్మ ముహూర్తం. అదే సమయంలో ముక్కోటి దేవతలు మహవిష్ణువుని దర్శించుకుంటారు. అందుకు అనుగుణంగా ధనుర్మాసం నెలను పండుగ నెలగా భావించి భక్తులు ఆలయ సందర్శనం చేస్తుంటారు. విష్ణువుకు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతిముఖ్యమైనవి. వైకుంఠ ఏకాదశి నుంచి వైష్ణవ ఆలయాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఆ రోజున విష్ణువు ఉత్తరద్వారం వద్ద దేవతలకు దర్శన భాగ్యం కల్పిస్తారని ప్రతీతి. అదే సమయంలో వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడంతో దేవతలకు మహవిష్ణువు దర్శనమిచ్చే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మహావిష్ణువు భక్తులకు దర్శనమిస్తారని విశ్వాసం. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం 1863లో ఒక్కరోజుగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం..1949లో 2 రోజులుకు.. 2020 నుంచి వైష్ణవ ఆలయాల తరహాలో 10 రోజులకు విస్తరించింది. దీంతో వైకుంఠంలో మహావిష్ణువు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే 10 రోజుల సమయంలో ఇల వైకుంఠంలో భక్తులకు శ్రీమన్నారాయణుడు దర్శనభాగ్యం లభించడంపై ఆనందం వ్యక్తమవుతోంది. – వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకులు నేడు స్వర్ణరథంపై ఊరేగనున్న స్వామి వారు శ్రీవారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 13న అర్థరాత్రి నుంచి 22 వరకు పది రోజులపాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలగనుంది. 13న ఉదయాత్పూర్వం తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు. ఈ నెల 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరగనుంది. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి ఆలయంతోపాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు. దీంతోపాటుగా ప్రధాన కూడళ్లలో నూతన పూలమొక్కలను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. -
తిరుమల : ఘనంగా చక్రస్నాన మహోత్సవం
-
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
-
శ్రీవారి సేవలో కేసీఆర్ కుటుంబం
సాక్షి, తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, హరీష్‌రావు దంపతులు ,కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ దర్శించుకున్నారు. కాగా, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు నిండిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనంపై పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం అయ్యాయి. గరుడ వాహనంపై చినవెంకన్న ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహా విష్ణువు అవతారంలోని స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. -
వైకుంఠ ఏకాదశికి టీటీడీ సిద్ధం
సాక్షి, తిరుమల: పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు వైకుంఠవాసుని దర్శనం కల్పించేందుకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోటెత్తనున్నసామాన్య భక్తులతోపాటు వీఐపీ, ప్రముఖులకు బస, దర్శన ఏర్పాట్లు విసృతం చేసింది. గురువారం అర్థరాత్రి తర్వాత 12.01 గంటల నుండి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం తిరుమలలోని వైకుంఠ ద్వారం గురువారం అర్థరాత్రి తర్వాత 12.01 గంటలు (శుక్రవారం) తెరుచుకోనుంది. తొలుత ధనుర్మాసపూజలు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుండి భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. తొలుత ప్రొటోకాల్ నిబంధనలకు లోబడి కేంద్ర,రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఇలా వరుస క్రమంలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. ఆ తర్వాతే ఉదయం 8 గంటల సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం అభిషేకం కారణంగా సామాన్య భక్తులకు ఈసారి నాల్గు గంటలపాటు స్వామి దర్శనం ఆలస్యం కానుంది. ప్రొటోకాల్ ప్రముఖులకే బస, దర్శనం.. సిఫారసు దర్శనాల్లేవు వైకుంఠ ఏకాదశి, ద్వాదశితోపాటు కొత్త సంవత్సరం పురస్కరించుకుని తరలివచ్చే భక్తుల నేపథ్యంలో టీటీడీ అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు చేసింది. 23వ తేది నుండే ప్రొటోకాల్ మినహా వీఐపీ దర్శనాలు టికెట్ల జారీ నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రాధాన్యత దృష్ట్యా కేవలం ప్రొటోకాల్ నిబంధనల ప్రకారమే దర్శన టికెట్లు కేటాయించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వేలాది సంఖ్యలో సిఫారసు లేఖలు టీటీడీకి అందటం గమనార్హం. కాలిబాటతోపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు గురువారం నుండి జనవరి 1వ తేది వరకు ఐదురోజులపాటు వృద్దులు, దివ్యాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులు, కాలిబాట దివ్యదర్శనాలు రద్దు చేశారు. ఇందులో భాగంగా బుధవారం అర్థరాత్రి నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కాలిబాట దివ్యదర్శనం టికెట్ల జారీ నిలిపివేశారు. ఇక ఆలయంలో జరిగే అన్ని రకాల నిత్య ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేశారు. -
ప్రొటోకాల్ రగడ
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వేళ ప్రొటోకాల్ రగడ తలెత్తింది. ఆలయ దర్శనం కోసం సతీ సమేతంగా వచ్చిన మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ దేవస్థానం అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో సహనం కోల్పోయిన దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు ఉత్తర ద్వారం లోంచి మూల వరుల దర్శనం కోసం వెళ్లారు. ఆ సమయంలో తనను ఎవ్వరూ పట్టించుకోకపోవటంపై ఎంపీ సీతారాంనాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులకు దేవస్థానం అధికారులు రాచమర్యాదులు చేయటంతో అక్కడనే ఉన్న ఎంపీ దీనిని చూసి ఈవో ఎక్కడంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపానే ఉన్న ఈవో జ్వోతి అక్కడికి వెళ్లి ఎంపీతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆయినా ఎంపీ శాంతించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆంధ్ర పాలనే సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రామాలయంలో సరైన గౌరవం దక్కడం లేదంటూ ఈఓతో వాదనకు దిగారు. దీంతో తాను కూడా తెలంగాణ బిడ్డనే అని ఈఓ ఎంపీకి వివరించారు. దేవస్థానంలో ఆంధ్రపాలనే సాగుతోంది : ఎంపీ సీతారాంనాయక్ వీఐపీ అయిన నాకు ఓ దండేసి పక్కన కూర్చోబెట్టారు. భద్రాచలం దేవస్థానంలో ఆంధ్ర పాలనే సాగుతోంది. తెలంగాణ బిడ్డలకు ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదు. అందుకనే దేవస్థానం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. సమాచారం లేకనే.. : ఈఓ జ్యోతి ఉత్తర ద్వార దర్శనం సమయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇచ్చాం. కానీ ఎంపీ దర్శనం కోసం వచ్చేటప్పుడు ఆయన పీఏలైనా ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు తప్పనిసరిగా ఆయన్ను ఆహ్వానించే వాళ్లం. ఈ విషయంలో మా తప్పేమీ లేదు. -
వైకుంఠ ఏకాదశి వైభవం
-
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు వీఐపీ దర్శనం కొనసాగింది. శ్రీవారి 5 వేల మంది వీఐపీలు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామ చంద్రస్వామి దర్శనమిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమించుకుంటున్నారు. ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదాశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని భక్తులు దర్శనం ఇస్తున్నారు. ఇక శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వారం నుంచి మల్లన్న దర్శనమిస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ భక్తులు బారులు తీరారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి వేలాది భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి వేచి ఉన్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు వేలాది తరలివచ్చారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువ జామున మూడు గంటల నుంచే దేవాలయాల వద్ద భక్తులు క్యూలు కట్టారు. బంజారా హిల్స్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల భారీ సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జియా గూడలోని రంగనాథస్వామి ఆలయంలో వేలాది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
జై బల‘రామ’
శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు కల్యాణ మండపంలో భక్తుల కోలాహలం నేడు శ్రీకృష్ణావతారంలో వైకుంఠ రామయ్య భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామివారు బలరామ రూపంలో కనిపించిన వెంటనే భక్తులు నీరాజనాలు పలికారు. ఆదిశేషుని అంశతో జన్మించిన బలరాముడు తమ్ముడు శ్రీ కృష్ణునికి ధర్మస్థాపనలో సహకరించారు. అపరపరాక్రముడిగా పేరొందిన బలరామయ్య రూపంలో భద్రాద్రి రాముని ఆలయ అర్చకులు తీర్చిదిద్దారు. ఆహా..ఏమి ఈ దర్శనభాగ్యం అంటూ భక్తులు పులకించిపోయారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన సేవలు, బేడామండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆళ్వార్లతో కూడిన ఉత్సవమూర్తులకు స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితర అర్చకులు 200 దివ్య ప్రబంధాలను పఠించారు. అనంతరం స్వామివారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్ది సేపు ఉంచారు. అంతరాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన స్వామి వారికి ఆలయ ఈవో ఎం. రఘునాథ్, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపం వ ద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద భక్తుల దర్శనార్థం ఉంచారు. పల్లకిపై విచ్చేసిన స్వామివారికి దారి పొడువునా భక్తులు మొక్కులు చెల్లించారు. వేదిక వద్ద ఆలయ అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందించి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించారు. బలరాముని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఊరేగింపుగా విశ్రాంతి మండపం వరకు తీసుకొచ్చి అక్కడ స్వామివారు కొద్ది సేపుతీరిన తరువాత తాత గుడి సెంటర్లోని గోవిందరాజస్వామి గుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈఓ రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, ఆలయ ప్రధానార్చకులు పోడిచేటి జగన్నాథాచార్యులు, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా, ఆలయ అర్చకులు విజయరాఘవన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నేడు శ్రీ కృష్ణావతారం అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి బోధించి, మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు శ్రీ కృష్ణుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే శుభఫలితాలు చేకూరుతాయని వేదపండితులు చెబుతున్నారు. -
అవతార పురుషుడు శ్రీరాముడు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగల్‌పత్తు ఉత్సవాలలో స్వామివారు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినకాలం దేవతలకు బ్రహ్మముహూర్తకాలం. ఈ పరమ పవిత్రమైన కాలంలో వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి ఈ ఏకాదశి నాడే దర్శిస్తారు. కావున ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే మరోపేరు ఉంది. ఇటువంటి పవిత్రమైన ఏకాదశి పర్వదినానికి ముందు పదిరోజులు ‘పగల్‌పత్తు ఉత్సవాలు’, తర్వాతి పదిరోజులను ‘రాపత్తు ఉత్సవాలు’గా వ్యవహరిస్తారు. మొత్తం 21 రోజులపాటు వైభవోపేతంగా అధ్యయనోత్సవాలను శ్రీ పాంచరాత్ర భగవశాస్త్రమును అనుసరించి దేవస్థానంలో నిర్వహించటం ఆనవాయితీ. అధ్యయనోత్సవాలలో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 10 వరకు పగల్‌పత్తు ఉత్సవాలు, జనవరి 11 రాత్రి నుంచి జనవరి21 వరకు రాపత్తు ఉత్సవాలు, జనవరి 10న గోదావరిలో తెప్పోత్సవం, 11న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, 28వ తేదీన రామాలయంలో స్వామివారికి విశ్వరూప సేవలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పగల్‌పత్తు ఉత్సవాలలో స్వామివారు దర్శనమిచ్చే అవతారాల విశిష్టత... మత్స్యావతారం (1-1-2014, బుధవారం) శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాధలు పురాణాలలో ఉన్నాయి. ఒకటి జ్ఞాన నిధులైన బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురిని సంహరించడానికి మత్స్యావతారం ధరించి, వేదాలను ఉద్ధ రించాడు. రెండోది జలప్రళయం నుంచి నావలో ఉన్న ైవైవస్వత మనువును, సప్తరుషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను రక్షించాడు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని పూజించుట వల్ల కేతుగ్రహ బాధలు తొలగుతాయని ప్రతీతి. కూర్మావతారం (2 -1-14, గురువారం) దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోయింది. దేవతలు, రాక్షసుల కోరిక పై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పెకైత్తి సహాయపడ్డాడు. ఈ అవతరంలోని స్వామివారిని దర్శించుట వల్ల శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. వరాహావతారం (3-1-14, శుక్రవారం) ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వాయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగివున్న భూమిని బయటకి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పెకైత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యకశిపుడు అనే రాక్షసున్ని సంహరించి భూమిని రక్షించాడు. రాహుగ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని చూడటం వల్ల ఆ బాధల నుంచి విముక్తులవుతారని ప్రతీతి. నారసింహావతారం (4 -1-14, శనివారం) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించడానికి నారాయణుడు నారసింహ అవతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాలమైనా...భగవానుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ బాధలు, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించటం వల్ల విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతుంది. వామనావతారం (5-1-14, ఆదివారం) దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామనరూపంలో వెళ్లి మూడు అడుగులు దానంగా స్వీకరించారు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని, మూడో అడుగుని బలి తలపై మోపి త్రివిక్రముడవుతాడు. ఈ అవతారాన్ని దర్శించటం వల్ల గురుగ్రహ బాధలు తొలగుతాయని వేదపండితులు తెలుపుతున్నారు. పరశురామావతారం (6-1-14, సోమవారం) శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షి కొడుకుగా జన్మించారు. పరశురాముడు (భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించటం వలన శుభపలితాలను పొందుతారని ప్రతీతి. శ్రీ రామావతారం (7-1-14, మంగళవారం) లోక కంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. వ్యక్తిగత సౌక్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. శ్రీ బలరామావతారం (8-1-14, బుధవారం) శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీ కృష్ణుని అన్నగా.. ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్షణునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురుడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయి. శ్రీకృష్ణావతారం (9-1-14, గురువారం) దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి భోదించి.. మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీ కృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శుభఫలితాలను పొందుతారని ప్రతీతి.