భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం రాపత్తు సేవను వైభవంగా నిర్వహించారు. అంబసత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజు నుంచి స్వామి వారికి వివిధ ప్రభుత్వ కార్యాల యాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో రాపత్తు సేవలు నిర్వహించటం ఆనవాయితీ గా వస్తోంది. ఇందులో భాగంగా రాపత్తు సేవల లో రెండోరోజున స్వామివారిని ప్రత్యేకంగా అలం కరించి సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. దారిపొడువునా భక్తులు పూజలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. అంబ సత్రం చేరుకున్న స్వామి వారికి ఆలయ అర్చకులు విశ్వక్షేణ పూజ, పుణ్యవచనంలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జ గన్నాధాచార్యులు, వేదపండితులు గుదిమెళ్ల ము రళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, లింగాల రామ కృష్ణప్రసాద అవధాని, ఆలయఅర్చకులు, సిబ్బం ది, వేదపాఠశాల విద్యార్ధులు, భక్తులు పాల్గొన్నారు.
పునఃప్రారంభమైన నిత్యకల్యాణాలు: శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు పునఃప్రారంభమయ్యాయి. పగల్‌పత్తు ఉత్సవాల సందర్భంగా రద్దు చేసినవీటిని యథావిధిగా ఆదివారం ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరాలయంలో జరిగిన అభిషేకం, సువర్ణపుష్పపూజలలో కూడా భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఆదివారం రామాలయంలో తీవ్ర రద్దీ ఎక్కువగా ఉంది. ఖమ్మం మాజీ కలెక్టర్, ప్రస్తుత పశ్చిమగోదావరి కలెక్టర్ సిద్దార్ధజైన్, ఐటీడీఏ పీవో వీరపాండియన్‌లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా రాపత్తు సేవ
Published Mon, Jan 13 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement