సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది.
సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. చైర్మన్ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు.
ఆ రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు
► జనవరి 11–14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది.
► ఈ తేదీలలో ఎంబీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ, ఏఆర్‌పీ కౌంటర్లలో గదులు కేటాయించబడవు.
► జనవరి 11–14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ను రద్దు చేశారు.
► సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్ల ద్వారా గదులను కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment