vaikunta darshanam
-
TTD: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. . నిన్న (మంగళవారం) 62,566 మంది స్వామివారిని దర్శించుకోగా 16,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.20 కోట్లు సమర్పించారు. జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు⇒ 10వ తేది నుండి 19వ తేది వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి.⇒ జనవరి 10వ తేది ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. 8 గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి.⇒ జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.⇒ అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్పస్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు.⇒ జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.సర్వ దర్శన టోకెన్లు⇒ తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లలో, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలోని 4 కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ.⇒ జనవరి 9వతేది ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు కేటాయింపు. 13వ తేది నుండి 19వ తేది వరకు ఏరోజుకారోజు టోకెన్లు జారీ. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ పదిరోజులకు గాను 4.32 లక్షల ఎస్ఎస్ డీ టోకెన్ల జారీ.⇒ తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమల వాసులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ.⇒ ఇప్పటికే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1.40 లక్షల ఉఈ టికెట్లను, 19500 శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల.⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినిహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర దర్శనాలు పది రోజుల పాటు రద్దు.⇒ తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేది, సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి.⇒ దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు.⇒జనవరి 9వ తేదిన అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ నిలిపివేత.⇒ శ్రీవారి మెట్టు మార్గంలోని టోకెన్ జారీ కౌంటర్లు జనవరి 19వ తేది వరకు మూసివేత⇒ ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ పదిరోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 7 రోజుగా కొనసాగనుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శనంలో 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు.18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.55 కోట్లు ఆదాయం వచ్చింది. ఆరు రోజుల్లో 3,95,983 మంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆరు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్నాయి. -
వైకుంఠ దర్శనం: పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు(సోమవారం) త్రయోదశి శ్రీవారి దర్శనం కోసం భక్తులు కిటకిటలడుతున్నారు. వరుసగా సెలవులు నేపధ్యంలో దర్శనానికి భక్తులు బారులు తీరారు. త్రయోదశి సందర్భంగా ప్రముఖులు శ్రీవారి దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్, సుప్రీంకోర్టు జడ్జ్ నాగరత్నం, హైకోర్టు జడ్జ్ కే సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,519. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,424. ద్వాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రొజల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 131,425. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది. తిరుపతిలో కేటాయిస్తున్న ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి అయ్యాయి. 53 గంటల్లో తిరుమల తిరుపతి దేవసస్థానం(టీటీడీ) 4,23,500 టికెట్లు జారీ చేసింది. ముగిసిన వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోటా ఈనెల 22 రాత్రి 11:30 నుంచి టోకెన్లు జారీ చేసిన టీటీడీ 4.25 లక్షల భక్తులకు వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ చేసింది. టైమ్ స్లాట్, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రోజూ 65 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార భక్తులు దర్శనం చేసుకోవచ్చు. నంద్యాల(శ్రీశైలం): శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండోవరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు వచ్చిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో క్షేత్రమంత భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. -
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం… ఉచిత టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు (ఫొటోలు)
-
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
కరీంనగర్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.09 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 39.4 కోట్ల ముండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. 2022లో 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ. 1,450 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఈనెల 28న రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. వీఐపీలకు కేటాయించే 170 గదులకు మాత్రమే ధరలు పెంపుజరిగినట్లు తెలిపారు. త్వరలో కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. 10 ఎకరాల స్థలంలో నిర్మాణం జరగున్నట్లు పేర్కొన్నారు. -
10 రోజుల పాటు వేంకటేశుడి వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది. సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. చైర్మన్ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. ఆ రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు ► జనవరి 11–14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది. ► ఈ తేదీలలో ఎంబీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ, ఏఆర్పీ కౌంటర్లలో గదులు కేటాయించబడవు. ► జనవరి 11–14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ను రద్దు చేశారు. ► సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్ల ద్వారా గదులను కేటాయిస్తారు. -
ఆ 10 రోజులు సిఫారసు లేఖలు పంపొద్దు
తిరుమల: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపవద్దని వీఐపీలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టడంతో వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు. తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్‌లలో శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళమిచ్చిన భక్తులు వసతి పొందాలని తెలిపారు. త్వరలో అన్నమయ్య మార్గానికి టెండర్లు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు సిఫారసు లేఖలు పంపద్దు: వైవీ సుబ్బారెడ్డి
-
పర్వదినాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుమల: తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందని, ఆ రోజుల్లో దర్శనాల నిమిత్తం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. చదవండి: (ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?) జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విచ్చేసే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీంతోపాటు ఆయా రోజుల్లో అమలయ్యే విధానాలపై భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. చదవండి: ('ఈ నగరానికి ఏమైంది...?. ఎవరూ నోరు మెదపరేం’) -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
-
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాద్రి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వీఐపీలకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కుటుంభ సభ్యులకు మాత్రమే ఉచిత పాస్‌లను మంజూరు చేశారు. సాధారణ భక్తులకు ఉత్తర ద్వారం దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6గంటల 3నిమిషాల వరకు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. సాధారణ భక్తులను 6:30 నుంచి దర్శనానికి అనుమతిచ్చారు. రద్దీ దృష్ట్యా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు..భక్తులందరూ భౌతిక దూరం పాటించాలని విఙ్ఞప్తి చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేకవజామున నుంచే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ జి.రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తరద్వారం గుండా హరిహరులు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు దర్శించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఆదిత్యనాధ్, జస్టిన్ సీవీ నాగార్జున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సునీల్ దియోధర్ మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు. -
‘టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావొద్దు’
సాక్షి, తిరుమల : డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తులు భౌతిక దూరం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముందస్తుగా ఆన్లైన్ ద్వారా ఇరవై వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఆఫ్‌లైన్‌లో రేపటి నుంచి స్థానిక భక్తుల కోసం పది వేల టిక్కెట్లు విడుదల చేశామన్నారు. టిక్కెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ ఈవో సూచించారు. చదవండి: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నామన్నారు. డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వీఐపీలు ఉదయం 4 గంటల నుంచి వీఐపీ భక్తులకు, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. పది రోజుల పాటు టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందుకు టీటీడీ భక్తులు సహకరించాలని కోరుతున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. -
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేంద్రాలను అడిషనల్ ఈవోతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఎల్లుండి నుంచి భక్తులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి రావొద్దని భక్తులకు జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) -
తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి, తిరుమల: ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరుస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతు లతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజు లపాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీకి భక్తులు కానుకగా అందించిన ఆస్తులపై శ్వేతపత్రాన్ని వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా స్వామివారికి చెందిన 1,128 ఆస్తులకు సంబంధించిన 8,088.89 ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన చెప్పారు. పేదలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సామూహిక వివాహ కార్యక్రమం కల్యాణమస్తును ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పునఃప్రారంభిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తం భం, బలిపీఠం, మహాద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
కోష్ఠ దేవతలు
మానవుడి దేహంలో శిరసు ఎంత ప్రాధాన్యమో గర్భగుడి అంత ముఖ్యమైనది. గర్భగుడికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలో దేవకోష్ఠములనే పేరుతో అలంకారయుతంగా గూడును ఏర్పాటు చేసి అందులో దేవతలను ప్రతిష్ఠిస్తారు. ఆ దేవతలను కోష్ఠ దేవతలంటారు. గర్భగృహం అంతర్భాగమే కాదు బహిర్భాగం కూడా దేవతా నిలయమే. శివాలయాల్లో కోష్ఠదేవతలుగా దక్షిణంలో దక్షిణామూర్తి, పశ్చిమాన లింగోద్భవమూర్తి లేక విష్ణువు, ఉత్తరంలో బ్రహ్మ ఉంటారు. విష్ణ్వాలయంలో దక్షిణభాగంలో దక్షిణామూర్తి లేదా నరసింహస్వామి, పశ్చిమంలో వైకుంఠమూర్తి, ఉత్తరాన వరాహమూర్తి ఉంటారు. అమ్మవారి ఆలయంలో బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ అనే దేవతలు ఉంటారు. ఇలా ఏ ఆలయమైనా మూడు దిక్కులలోని ముగ్గురు దేవతలు సాత్త్విక, రాజస, తామస గుణాలకు అధిదేవతలు. భక్తుడు ఒక్కో ప్రదక్షిణ చేస్తూ ఒక్కో దేవుణ్ణి దర్శిస్తూ ఒక్కో గుణాన్ని ఉపశమింప జేసుకుంటూ... త్రిగుణాతీతుడైన, గర్భగుడిలో నెలకొని ఉన్న దైవాన్ని దర్శించుకోవడానికి సన్నద్ధం అవుతాడు. అంతేగాక ఒక్కోదేవుడూ ఒక్కోరకమైన తాపాన్ని అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాలనే తాపత్రయాలను తీరుస్తారు. ఆ త్రిగుణాలను ఉపశమింపజేసి, తాపత్రయాలను దూరం చేసి అమృతమయమైన భగవద్దర్శనం కలిగేందుకు అనుగ్రహిస్తారు. కోష్ఠదేవతలు వేరైనా నిజానికి ఆ స్థానాలు త్రిమూర్తులకు చెందినవి. అందుకే ఆ సంబంధమైన దేవతావిగ్రహాలు అక్కడ కొలువుతీరి ఉంటాయి. ఆలయానికి వెళ్లే ప్రతిభక్తుడూ ఈ కోష్ఠదేవతలను దర్శించుకొని, వీలుంటే ఆరాధించుకొని వెళ్లడం ఆలయ సంప్రదాయాలలో ముఖ్యమైన విధి. గర్భగుడికి ముందున్న అంతరాలయానికి కూడా కోష్ఠాలను ఏర్పరచి దేవతలను ప్రతిష్ఠించి పూజిస్తారు. దక్షిణభాగంలో నృత్యం చేస్తున్న వినాయకుడు, ఉత్తర భాగంలో విష్ణుదుర్గా ఉంటారు. ఈ ఐదుగురు దేవతలను కలిపి పంచకోష్ఠదేవతలంటారు. ఈ కోష్ఠదేవతలను దర్శించి భక్తులు ఇష్టార్ధాలు పొందుతారు. ఆలయం అనేక సంకేతాలకు కూడలి. ఆ సంకేతాలను శోధిస్తూ భగవదనుగ్రహాన్ని సాధిస్తే ఆలయమంత పుణ్యనిధి మరొకటి లేదు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య. ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
-
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుగు ప్రయాణంలో బస్సులు చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ద్వాదశిని పురస్కరించుకుని శనివారం కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో నారాయణగిరి వనంలోని షెడ్లలోనూ వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఈరోజు అర్ధరాత్రి వరకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. శనివారంనాటి భక్తులకు రేపు దర్శనభాగ్యం ఉంటుంది. కాగా, తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కొరతతో భక్తులకు అవస్థలు తప్పడంలేదు. బస్సు రాగానే ఎవరికివారు బస్సులో చోటు కోసం పరుగులు తీస్తున్నారు. . ... -
ఆ రెండు రోజుల్లో 1.77 లక్షల మందికి దర్శనం!
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మొత్తం 1.77 లక్షల మందికి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం తెలిపారు. 8వ తేది ఏకాదశినాడు 92,624మంది, ద్వాదశినాడు 84,482 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని చెప్పారు. 2015 సంవత్సరం కంటే ఈసారి 8వేల మూడు వందల మంది అధికంగా దర్శించుకున్నారని వివరించారు. 7వ తేది నుండి 9వ తేది వరకు రోజులో మూడుసార్లు వంతున సుమారు 10 లక్షల మందికి అన్నప్రసాదాలు, వేడిపాలు, కాఫీ, టీ అందజేశామన్నారు. రూ.36 లక్షల ఖర్చుతో 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ చేశామన్నారు. భక్తులకు రిసెప్షన్, ఆలయం, కల్యాణకట్ట, విజిలెన్స్‌తోపాటు అన్ని విభాగాల సిబ్బంది విశిష్ట సేవలందించారన్నారు. శ్రీవారికి రూ.21.16 లక్షల విరాళాలు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి మంగళవారం రూ.21.16 లక్షల విరాళం అందింది. ఇందులో అన్నప్రసాదం ట్రస్టుకు రూ.9.15 లక్షలు, ప్రాణదానం కోసం రూ.లక్ష, స్విమ్స్‌కు రూ.10 లక్షలు, విద్యాదానం కింద రూ.1.01 లక్షలు అందాయి. భక్తులు డీడీల రూపంలో వీటిని విరాళాల విభాగంలో అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ రెడ్డి, ఆయన మనవరాలు ఉపాసన (నటుడు రాంచరణ్ సతీమణి), వైఎస్సార్సీపీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్లమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రకాంత్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
తిరుమలలో భక్తుల ఆందోళన
-
మోక్షానికి మార్గం.. వైకుంఠ ద్వారం..!