కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం: టీటీడీ ఈవో | TTD EO Dharma Reddy Says Srivari Temple Built In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం: టీటీడీ ఈవో

Published Fri, Jan 13 2023 12:23 PM | Last Updated on Fri, Jan 13 2023 12:31 PM

TTD EO Dharma Reddy Says Srivari Temple Built In Karimnagar - Sakshi

సాక్షి, తిరుమల: 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.09 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 39.4 కోట్ల ముండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. 2022లో 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ. 1,450 కోట్ల ఆదాయం లభించిందన్నారు.

ఈనెల 28న రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. వీఐపీలకు కేటాయించే 170 గదులకు మాత్రమే ధరలు పెంపుజరిగినట్లు తెలిపారు. త్వరలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. 10 ఎకరాల స్థలంలో  నిర్మాణం జరగున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement