సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment