koil alwar thirumanjanam seva
-
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
తిరుమల ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
ఈనెల 30 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల : ఈ నెల 29న తిరుమల తిరుపతి ఆలయంలో అంకురార్పణ అనంతరం 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనం నిర్వహించనున్నారు. వాటి పూర్తి వివరాలు 30-09- 2019 పెద్దశేషవాహనం ధ్వజారోహణం(సా..5.23 నుండి 6 గం.ల మధ్య) 01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం 02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 03-10-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం 04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు) 05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం, గజవాహనం (సా.4 నుండి 6 వరకు), . 06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం 08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం. -
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ
తిరుమలలో శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను టీటీడీ నేడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆర్జీత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12.00 గంటల వరకు సర్వదర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.