
సాక్షి, తిరుమల: ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరుస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతు లతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజు లపాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది.
టీటీడీకి భక్తులు కానుకగా అందించిన ఆస్తులపై శ్వేతపత్రాన్ని వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా స్వామివారికి చెందిన 1,128 ఆస్తులకు సంబంధించిన 8,088.89 ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన చెప్పారు. పేదలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సామూహిక వివాహ కార్యక్రమం కల్యాణమస్తును ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పునఃప్రారంభిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తం భం, బలిపీఠం, మహాద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment