
తిరుపతి: ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారు. గరుడ సేవ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో సిద్ధం చేసిన శ్రీపద్మావతి చైల్డ్రన్స్ హార్ట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారు. దాంతో పాటు అలిపిరి వద్ద 15 కోట్లతో నిర్మించిన గోమందిరం ప్రారంభిస్తారు’’ అని తెలిపారు.
(చదవండి: చిన్నారి గుండెకు శ్రీవారి అభయం)
‘‘మరుసటి రోజు ఉదయం సీఎం జగన్ తిరుమలలో ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానెల్స్‌ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొంటారు. తిరుమలలో నూతన బూందీ పోటు కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. అప్పలయగుంటలో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్టకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. రేపటి నుంచి అదనంగా ఇక్కడ స్టాఫ్‌ను పెంచుతున్నాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment