అగ్నిప్రమాదం: దంపతులకు తీవ్రగాయాలు
Published Sat, Feb 11 2017 12:54 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
భద్రాద్రి కొత్తగూడెం: టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనిశెట్టిపల్లిలో శనివారం ఉదయం ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ ఆన్ చేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వెంకమ్మ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్తి నష్టం వాటిల్లింది.
Advertisement
Advertisement