కారు, బైక్ ఢీ: ఇద్దరి మృతి
Published Tue, Dec 6 2016 12:20 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. సీతారాంపురం స్టేజీకి చెందిన బోడ అనిల్, తూర్పుగూడెం గ్రామానికి చెందిన వీరన్న బైక్‌పై వెళ్తుండగా బోరింగ్ తండా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారును స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement