పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి
Published Fri, Nov 25 2016 12:44 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
కొండాగావ్: మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొండాగావ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలను గుర్తించిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement