ముగ్గురు మావోయిస్టుల పట్టివేత
Published Tue, May 2 2017 3:14 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
రాయిపూర్: తీవ్రవాద ప్రభావిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఒడిశాకు చెందిన వారు. పుష్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు చేపట్టిన సంయుక్త కూంబింగ్‌లో వీరు పట్టుబడ్డారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బస్తర్ జిల్లా దర్భా ప్రాంతానికి చెందిన కవాసి హద్మా(32)తో పాటు, ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి చెందిన రామ్‌నాథ్ నాగ్(21), బచ్ఛా ధుర్వా(24)గా గుర్తించారు. మావోయిస్టు పార్టీలో భాగమైన జన్‌మిలీషియాకు చెందిన ఈ ముగ్గురూ మార్చి 28వ తేదీన పోలీసులపై జరిగిన దాడిలో కీలక సూత్రధారులని తెలిపారు. మంగళవారం వీరిని సుక్మా జిల్లా కోర్టులో హాజరుపరిచామన్నారు.
Advertisement
Advertisement