ప్రతీకాత్మకచిత్రం
రాయ్‌పూర్ : మొబైల్ ఫోన్ వాడవద్దని పలుమార్లు చెప్పినా వినలేదనే కోపంతో భార్యను కత్తితో పొడిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. చత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేయడమే కాకుండా తన మాట పెడచెవిన పెడితే విడాకులు ఇస్తానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్త బెదిరింపులకు దిగాడు. మొబైల్ ఫోన్ వాడొద్దని తన భర్త తరచూ తనను వేధిస్తున్నాడని, మూడు రోజుల కిందట తనపై భౌతిక దాడికి దిగాడని బాధితురాలు వెల్లడించారు.
అదే రోజు ఆయన కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని చెప్పారు.తన మాట వినకుంటే విడాకులు ఇస్తానని తన భర్త తన తల్లితండ్రులనూ బెదిరించాడని అన్నారు. చిన్న విషయాల్లోనూ భర్తత తనతో కీచులాటకు దిగుతాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment