
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది.
బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుండి ఎనిమిదవ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో లక్ష్మీ బ్యారేజ్‌ను నిర్మించారు. 24 నెలల్లో బ్యారేజ్ నిర్మాణాన్ని ఎల్‌అండ్ టీ పూర్తి చేయగా, దీని నీటీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ పొడువు 1.6 కిలోమీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment