
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ‍్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతరకు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు.
జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో భిక్షగాడు చేసిన ఈ తతంగం అంతా ’సాక్షి’ క్లిక్ మనిపించింది.
ఫొటోగ్రాఫర్: గుర్రం సంపత్ గౌడ్




Comments
Please login to add a commentAdd a comment