లిప్‌లాక్‌ సీనా..? హీరోయిన్‌ ఎవరైనా సరే ఓకే చెప్తా: హీరో | Actor Kavin Comments On Liplock With Actress | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌ సీనా..? హీరోయిన్‌ ఎవరైనా సరే ఓకే చెప్తా: హీరో

Published Tue, Nov 5 2024 1:52 PM | Last Updated on Tue, Nov 5 2024 3:02 PM

Actor Kavin Comments On Liplock With Actress

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన చాలామంది నటీనటులు ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో నటుడు కవిన్‌ ఒకరు. లిఫ్ట్‌ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత డాడా చిత్రంతో మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా స్టార్‌ చిత్రం ఈయనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తాజాగా కవిన్‌ కథానాయకుడిగా నటించిన బ్లడీ బెగ్గర్‌ చిత్రం దీపావళి సందర్భంగా గత నెల 31వ తేదీన విడుదలై ప్రదర్శింపబడుతోంది. నవంబర్‌  7న తెలుగులో కూడా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఒక భేటీలో ఏ హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు అలాంటి కోరిక ఏమీ లేదని బదులిచ్చారు. అయితే కథకు అవసరమైతే ఏ నటితోనైనా లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడానికి సిద్ధమే అని పేర్కొన్నారు. ఇలా ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కారణం కవిన్‌ ప్రస్తుతం మాస్క్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

దీని తర్వాత నయనతార జంటగా ఒక చిత్రం చేయనున్నారు. దీనికి కిస్‌ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కనున్న వైవిధ్య భరిత కథా చిత్రం అని సమాచారం. దీంతో ఈ చిత్రంలో నయనతార, కవిన్‌ల మధ్య లిప్‌లాక్‌ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement