ఇండియన్ స్టార్స్‌గా వెలుగొందుతున్న తారలు నటుడు ధనుష్,నటి నయనతార. వీరిద్దరూ సంచలన తారలుగా ముద్ర పడిన వారే. అదేవిధంగా ఇటీవల ఈ ఇద్దరి మధ్య పెద్ద వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. సమీప కాలంలో నటి నయనతార నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ మీడియాకు బహిరంగ ప్రకటనను చేసి ప్రకంపనలు సృష్టించారు. అందుకు కారణం ఆమె జీవిత ఘటనలతో రూపొందిన నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ చిత్రం కోసం నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సీన్స్, పాటల సన్నివేశాలను ఉపయోగించడానికి అనుమతి కోరగా అందుకు ఆ చిత్ర నిర్మాత ధనుష్ నిరాకరించడమే. అయినా ఆ చిత్రంలోని మూడు నిమిషాల నిడివి గల సన్నివేశాలను నయనతార తన డాక్యుమెంటరీ చిత్రంలో వాడారు.
దీంతో ధనుష్ నటి నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న విషయం విధితమే. ఇలాంటి పరిస్థితుల్లో నటి నయనతార ఓ భేటీలో ధనుష్ గురించి ప్రస్తావిస్తూ తాను, ధనుష్ బద్ధ శత్రువులు కాదన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతకాలం క్రితం వరకూ మంచి మిత్రులుగా ఉన్నామని పేర్కొన్నారు. అలాంటిది 10 ఏళ్లలో అంతా మారిపోయిందన్నారు. అందుకు పలు కారణాలు ఉండవచ్చనని, వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించలేనన్నారు. తనకు సరి అనిపిస్తే దాన్ని చేయడానికి తాను భయపడనన్నారు. తాను తప్పు చేస్తే కదా భయపడటానికి అన్నారు. అదే విధంగా పబ్లిసిటీ కోసమో, మరే విషయం కోసమో తాను ఎవరినీ అణగదొక్కాలని భావించనన్నారు.
తన జీవితంలో ముఖ్యమైన చిత్రంలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకోవడానికి ధనుష్ అనుమతి కోసం ఆయన మేనేజర్‌కు పలు సార్లు ఫోన్ చేశానని, ఆయన్ని ఫోన్ మాట్లాడమని కోరానని, అదీ జరగలేదన్నారు. ధనుష్ పాపులర్ నటుడిని ఆయనకు అశేష అభిమానులు ఉన్నారని, అందులో తాము ఉన్నామన్నారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండడం వల్లే వాటిని వాడుకోవడానికి అనుమతి కోరినట్లు నయనతార పేర్కొన్నారు. కాగా ఈమైపె నటుడు ధనుష్ వేసిన పిటిషన్ గురువారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు వివరణ కోరుతూ.. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు, నెట్ ఫ్లిక్స్ సంస్థకు నోటీసులిచ్చారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment