అడవిపందులు
ములుగు రూరల్ వరంగల్ : సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని ఇంచర్ల గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు.
నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూ చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ కోరగా.. పంపిణీకి ప్రభుత్వ భూమి లేదని, అమ్మేవారు ఉంటే తహసీల్దార్ దృష్టిఇ తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి చందూలాల్‌తో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీసీరోడ్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని ఎంపీడీఓ విజయ్ స్వరూప్‌ను ఆదేశించారు.
తన కూతురు కళ్యాణలక్ష్మీ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పరిశీలించి పథకం వర్తింపజేయాలని తహసీల్దార్‌ను ఆవేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవికిరణ్, ఎస్సై బండారి రాజు, జెడ్పీటీసీ సకినాల శోభన్, సర్పంచ్ ముడతనపల్లి కవితకుమార్, ఎంపీటీసీ సభ్యుడు శానబోయిన అశోక్, ఆర్‌ఐ అఫ్రీన్, యుగంధర్‌రెడ్డి, వీఆర్వో సూరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment