
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్‌ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్‌ఏలపై నివాస్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment