కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On KCR Speech At Medigadda Project | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా?: సీఎం రేవంత్‌

Published Tue, Feb 13 2024 8:28 PM | Last Updated on Tue, Feb 13 2024 8:56 PM

CM Revanth Reddy Fires On KCR Speech At Medigadda Project - Sakshi

సాక్షి,  జయశంకర్‌ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం  సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్‌ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు.

...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు.

కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్కు ఫ్లోరైడ్‌ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్‌పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది.

...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్‌ అండ్‌ టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది.

...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement