
గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు.. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని నిరసన వ్యక్తం చేశారు.
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు.. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని నిరసన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: ఢిల్లీకి చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు