
సాక్షి, తాడ్వాయి: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి కూలాంతర వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్నాడంటూ.. ఓ నవ వధువు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మంగ రజిత(22)ను ఇదే పంచాయతి పరిధిలోని కామారం గూడానికి చెందిన బిక్షపతి(25) ప్రేమించుకున్నారు. బిక్షపతి యాదవ కులానికి చెందిన వాడు కాగా.. రజిత దళిత యువతి.
దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినా పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. రెండు నెలలు కాపురం చేసిన అనంతరం నువ్వు తక్కువ కులం దానివి.. నాకు నీ అవసరం లేదంటూ బిక్షపతి.. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎటు పోవాలో దిక్కుతోచక స్థితిలో రజిత భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఆమెకు స్థానిక మహిళా సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment