Wife Protest
-
రంగారెడ్డి జిల్లా హైదర్ గూడలో ఇల్లాలి పోరాటం
-
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్‌బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్‌బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్‌బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
Vikarabad: ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను.. నువ్వు అవసరం లేదు’
సాక్షి, వికారాబాద్: న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తొండుపల్లికి చెందిన కుర్వ శ్రీశైలం హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మిట్టకోడూరు గ్రామానికి చెందిన అనితతో నవంబర్ 2021న వివాహం జరిగింది. శ్రీశైలం విధులు నిర్వహించే కార్యాలయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను పట్టించుకోవడంలేదని భార్య అనిత ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా తీరులో మార్పురావడం లేదని అన్నారు. సోమవారం కూడా మరోసారి పంచాయితీ పెట్టి మాట్లాడగా ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను. . నువ్వు అవసరం లేదు’అని చెప్పడంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు అనిత తెలిపారు. తనకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేదిలేని భీష్మించి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అని, ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చదవండి: నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన వైద్య సేవలు -
కాపురానికి తీసుకెళ్లడం లేదని.. భర్త ఇంటి ఎదుట భార్య నిరసన
మిర్యాలగూడ టౌన్ (నల్గొండ జిల్లా): భర్త ఇంటి ఎదుట భార్య నిరసన వ్యక్తం చేసిన సంఘటన మంగళవారం పట్టణంలోని నందిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన మారోజు రామాచారి, కలమ్మ దంపతుల కుమార్తె మాధవిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు గ్రామానికి చెందిన బసవోజు రామ్మూర్తి, తిరుపతమ్మల కుమారుడు సురేష్‌కి ఇచ్చి 2015లో వివాహం చేశారు. వీరి కాపురం కొంతకాలం సాఫీగానే సాగింది. కాగా మాధవి మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా ప్లేట్లేట్స్ తగ్గడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని తన తల్లిగారింటికి వెళ్లిన మాధవిని అప్పటి నుంచి భర్త తీసుకెళ్లలేదు. ఈ విషయంపై అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, చివరికి మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాకపోవడంతో తన ఏడేళ్ల కుమార్తె డింపుల్రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. కాగా సురేష్ తల్లి తిరుపతమ్మ దీనిపై స్పందిస్తూ.. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మాధవి తన తల్లిగారింటికి వెళ్లి తిరిగి రాలేదని, అనేక సార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగిందని అననారు. విడాకుల కోసం ఐదేళ్ల క్రితమే కోర్టులో కేసు వేశామని, ఈ విషయం కోర్టుపరిధిలో ఉన్నందున కోర్టులోనే తెల్చుకుంటామని పేర్కొంది. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
భర్త కోసం భార్య మౌన పోరాటం
మండపేట(కోనసీమ జిల్లా): తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ వివాహిత పదిరోజులుగా అత్తవారి ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తోంది. అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఆరుబయట గుమ్మం వద్ద దీక్ష నిర్వహిస్తోంది. మండలంలోని ద్వారపూడికి చెందిన ఉలిసి లక్ష్మీశైలజకు అదే గ్రామానికి చెందిన నామాల రంగారావు తనయుడు మోహన్ శ్యాం శరణ్‌తో 2020 డిసెంబర్లో వివాహమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శరణ్‌కు వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, ఆడపడుచు కట్నంగా రూ.ఐదు లక్షలు, వివాహ ఖర్చుల నిమిత్తం రూ. ఐదు లక్షలు, 20 కాసుల బంగారం అందజేసినట్టు శైలజ తండ్రి రామకృష్ణ తెలిపారు. చదవండి: నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం? వివాహం అనంతరం శరణ్ జీతం రెట్టింపు కావడంతో తమ కుమార్తెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తుండగా నెల రోజులు కూడా తమ కుమార్తెను అత్తింటి వారి వద్ద ఉంచుకోలేదని, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త వద్దకు పంపకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పెద్దల ద్వారా వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో మాట్లాడకుండా తన వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నారని శైలజ విలపించింది. తన మానసిక స్థితి సరిగా లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ అత్తవారి ఇంటి వద్ద దీక్ష చేపట్టినట్టు బాధితురాలు వివరించింది. తాను రావడంతో అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని లక్ష్మీశైలజ తెలిపింది. ఈ విషయమై శైలజ మామ నామాల రంగారావును ఫోన్లో వివరణ కోరగా శైలజ తల్లిదండ్రులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శైలజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని పలుమార్లు బెదిరించిందని, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాద్యత వహిస్తారన్నారు. రూరల్ ఎస్ఐ బి. శివకృష్ణను సంప్రదించగా అత్తింటి వారిపై ఫిర్యాదు చేసేందుకు శైలజ నిరాకరించిందన్నారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. -
పెళ్లైన విషయాన్ని దాచి.. మరో యువతితో రెండో వివాహం.. విషయం తెలిసి..
సాక్షి, ఖమ్మం: ఓ యువకుడు మొదటి పెళ్లి విషయాన్ని దాచి మరో యువతిని రెండో పెళ్లి చేసుకొని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త తనను మోసం చేశాడని తెలుసుకున్న రెండో భార్య.. తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన దీక్ష చేపట్టింది. వివరాలు.. ఖమ్మం పట్టణం రోటర్ నగరకు చెందిన నవజీవన్ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకొని ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా డిసెంబర్ ఒకటో తేదీన ఖమ్మం పట్టణం ఎన్ఎస్టీ ప్రాంతానికి చెందిన కాసం సౌగంధికను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యతో సఖ్యతగా ఉండకుండా ఆమెను వేధింపులు గురి చేసేవాడు. ఈ క్రమంలో యువతి బంధువులు పలుమార్లు నవజీవన్‌ను హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాక అతనికి తన కంటే ముందే వేరే యువతితో పెళ్ళి జరిగిన విషయం సౌగంధికకు తెలిసింది. దీంతో భర్త నవజీవన్‌పై మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే అక్కడ తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో భర్త నవజీవన్ ఇంటిముందు శనివారం న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్యకు చెబితే..
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురంలోని సాహెబ్‌నగర్‌లో ఓ భార్య భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఫరూక్ అలీ అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఏడాదిన్నర క్రితం తనను మతాంతర వివాహం చేసుకున్నాడని బాధితురాలు దుర్గ ఆరోపిస్తోంది. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ప్రేమ పేరుతో మోసం చేసి బంగారం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ విషయమై మొదటి భార్యకు చెబితే ఫరూక్‌ను ఇంట్లో బంధించి.. తనను తీవ్రంగా కొట్టినట్లు చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగానని బాధితురాలు తెలిపింది. అయితే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని తన భర్త ఫరూక్ అలీతో ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. -
పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..
శ్రీకాకుళం: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. ఎక్కడో హైదరాబాద్‌లో కొత్త కాపురం.. ఏడాది తిరిగే సరికి వివాదం.. చివరకు ఆ మహిళ భర్తను వెతుక్కుంటూ అత్తవారింటి ముందు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ రెల్లివీధిలో ఓ యువతి ఆదివారం అత్తవారి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గ పాతజాతీయ రహదారిలో రెల్లివీధికి చెందిన భాను నాయక్‌కు రోటరీనగర్‌కు చెందిన సనపల మురళీకృష్ణతో ఏడాది కిందట వి వాహమైంది. దంపతులు హైదరాబాద్‌లో కా పురం ఉంటున్నారు. అయితే హఠాత్తుగా మురళీకృష్ణ ఆమెను విడిచిపెట్టి వచ్చేయడంతో భా ను న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించారు. పన్నెండేళ్ల కిందటి నుంచి తా ను మురళీకృష్ణ ప్రేమించుకున్నామని, 2021 లో పెళ్లి చేసుకోవాలని కోరితే ఆయన ఒప్పు కోకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని, డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సీఐ శంకరరావు సమక్షంలో గత ఏడాది జనవరి 5న దండలు మార్చుకుని వివాహం చేసుకున్నామని తెలిపారు. పోలీసులు కౌన్సిలింగ్ మేరకు హైదరాబాద్‌లో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నా మని చెప్పారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి చెప్పా పెట్టకుండా మురళీకృష్ణ కాశీబుగ్గ వచ్చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరా రు. ఇన్నాళ్లుగా తనకు మాయ మాటలు చెప్పి మభ్య పెడుతూనే ఉన్నారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తెలిపారు. భర్త ఇంటి ముందు బైఠాయించడంతో కాశీబుగ్గ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు రక్షణ కల్పించారు. -
సాఫ్ట్వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో..
మంగళగిరి (గుంటూరు జిల్లా): ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించానంటూ మూడు ఏళ్లు వెంట పడి కులాలు వేరైనా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం తనను వదిలించుకోవాలని తల్లి, పిన్ని మాటలు వింటూ తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ వివాహిత నగరంలోని యర్రబాలెంలో భర్త నివాసం ముందు కూర్చుని ఆందోళన చేసింది. బాధితురాలు అనూష తెలిపిన వివరాల మేరకు అనూషది విశాఖపట్నం కాగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో చేస్తున్న యర్రబాలెంకు చెందిన శ్రీమాన్ అనూషతో పరిచయం పెంచుకుని ప్రేమించానంటూ వెంటబడ్డాడు. చదవండి👉: ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే? సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రేమిస్తున్నానని వెంటపడ్డ శ్రీమాన్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుంటానని చెప్పి అనూషను వివాహం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అనంతరం అనూష ఉద్యోగం గ్యారంటీగా చూపి సుమారు రూ.50 లక్షల రుణం తీసుకున్నాడు. శ్రీమాన్‌కు మరో మహిళ పరిచయం కావడం, శ్రీమాన్ తల్లి, బంధువులు సైతం అనూషను వదిలేయాలని చెప్పడంతో అనూషతో ప్రతి రోజు గొడవలు పెట్టుకుని పిల్లలు తనకు పుట్టలేదని అనుమానంతో అనూషను వేధించసాగాడు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు దీంతో అనూష హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీమాన్ యర్రబాలెం తిరిగి వచ్చి తల్లివద్ద ఉంటున్నాడు. హైదరాబాద్ పోలీసులు శనివారం స్థానిక పోలీసుల సహాయంతో నోటీసులు ఇచ్చేందుకు శ్రీమాన్ ఇంటికి వెళ్లగా శ్రీమాన్‌తో పాటు అతని కుటుంబసభ్యులు నోటీసులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. నోటీసులు తీసుకోకపోవడంతో కోర్టు సమన్లతో శ్రీమాన్‌ను అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తనకు న్యాయం చేసి తన భర్తను తనకు అప్పగించేవరకు తాను ఆందోళన కొనసాగిస్తానని అనూష తెలిపారు. -
పెళ్లైన మూడు రోజులకే..
చిత్తూరు (మదనపల్లె టౌన్) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని భార్య మహ్మద్‌సనా(23) బుధవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆమె గురువారం మదనపల్లె రూరల్ మండలం, దిగువ వాండ్లపల్లెలోని భర్త రమేష్‌కుమార్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఆమె మాట్లాడుతూ తనది నల్గొండ జిల్లా, చింతలపల్లె మండలం, కుడిమేకు గ్రామమని.. 2019లో అక్కడ ఈసెట్‌లో శిక్షణ తీసుకుంటుండగా రమేష్‌కుమార్‌తో పరిచమైందని వెల్లడించింది. జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. రమేష్‌కుమార్, మహ్మద్‌సనా పెళ్లినాటి ఫొటో(ఫైల్) మరుసటి రోజు నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. ఇటీవల మదనపల్లెలోని ఎస్టేట్‌లో అద్దె ఇంటికి వెళ్లామని వెల్లడించింది. మూడు రోజుల క్రితం రమేష్ బయటకు వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. అత్తింటి వారే తన భర్తను దాచిపెట్టారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటివారు, ఒక పార్టీ నాయకుడు కలిసి తన భర్తను వదిలి వెళ్లిపోవాలని బెదిరించారని వెల్లడించింది. కాగా రమేష్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనా కుటుంబీకులే రమేష్‌ను అదృశ్యం చేశారని ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తారింటి వద్ద నిరసన తెలుపుతున్న మహ్మద్ సనా -
45 రోజులు కాపురం చేశాక వద్దంటున్నాడు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా 2 లో బాదావత్ అనిల్ కుమార్ ఇంటి ముందు అతని భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతితో ఈ ఏడాది జనవరిలో అతనితో ప్రేమ వివాహం చేసుకుంది. అనిల్ కుమార్ ఇంటి ముందు నిరసన చేస్తున్న అతని భార్య స్రవంతి అయితే నెల 15 రోజులు కాపురం చేసిన అనిల్ కుమార్.. ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక గురువారం స్రవంతి తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తే కావాలంటూ తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులు వేడుకుంది. -
భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి
సాక్షి, నిజామాబాద్: స్టెరాయిడ్స్ ఇచ్చి చంపే ప్రయత్నం చేసిన తన భర్త గంగాసాగర్‌ను శిక్షించి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆర్మూర్‌కు చెందిన బాధితురాలు స్రవంతి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. 2018లో ఆర్మూర్‌కు చెందిన గంగాసాగర్‌తో వివాహాం జరిగిందని, మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెట్టారని తెలిపింది. భర్త బాసరలో ఆర్ఎంపీగా పని చేస్తున్నాడని, అయితే ఇటీవల తనకు స్కిన్ ఎలర్జీ రావడంతో తగ్గిస్తానని చెప్పి ఇంజక్షన్లు ఇచ్చాడని తెలిపింది. అయితే శరీరంలో మార్పులు రావడంతో వేరే ఆస్పత్రికి వెళ్లగా, అవి స్టెరాయిడ్స్ అని డాక్టర్లు చెప్పారని, తనను చంపే ప్రయత్నం చేశాడని వాపో యింది. భర్తను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కొడుకును కూడా చంపేస్తానని ఇంటికి కత్తితో వచ్చాడని తెలిపింది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ సఖి కేంద్రం అధికారులను ఆదేశించారు. చదవండి: మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు! -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..
మానకొండూర్(కరీంనగర జిల్లా): న్యాయం చేయాలని ఓ భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కవిత, మానకొండూర్‌కు చెందిన శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప సంతానం. కరీంనగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చదవండి: నిజామాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. 11 మంది అరెస్ట్ కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఇంటికి వెళ్లడం లేదు. దీంతో కవిత మానకొండూర్‌లోని శ్రీనివాస్ ఇంటి ఎదుట శనివారం బైఠాయించింది. తనకు, కూతురుకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి సదరు భార్యాభర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలుపించుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. కలిసి ఉండాలని చెప్పి స్టేషన్ నుంచి పంపించారు. -
పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో..
సాక్షి, చౌటుప్పల్ రూరల్(నల్గొండ) : జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన ఓ వ్యక్తి ఆరు మాసాలకే భార్యను వదిలేసి ప్రియురాలితో ఉడాయించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఆనంగళ్ల మహేష్(30)కు ఖైతాపురం గ్రామానికి చెందిన 26ఏళ్ల యువతితో గత ఏడాది జూన్ 4న వివాహం జరిగింది. అప్పటి నుంచి మహేష్ సదరు యువతితో బాగానే కాపురం చేశాడు. గత ఏడాది డిసెంబరు 31న భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన యువతితో కలిసి బైకుపై పారిపోతూ, దేశ్ముఖి వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. చదవండి: ఒకే కూర.. ఒకే స్వీటు..వేములవాడ ముస్లింల కీలక నిర్ణయం ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి మహేష్‌ను అతని కుటుంబ సభ్యులు, ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మహేష్ ఈ నెల 10న చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు. భీమనపల్లిలో ఆ యువతి కూడా లేదు. దీంతో అతడి భార్య ఈ నెల 13న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంత వరకు మహేష్ జాడను కనుగొనలేకపోయారు. దీంతో మహేష్ భార్య మల్కాపురంలోని అతని ఇంట్లోంచి కుటుంబ సభ్యులను బయటకు పంపింది. ఇంటికి తాళం వేసి ఇంటి ఎదుట బంధువులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఆందోళనకు దిగింది.రోజంతా ఇంటి ఎదుటే బైటాయించింది. సాయంత్రం ఎస్ఐ మానస వచ్చి చర్చించారు. మహేష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తాళం తీసి ఇంట్లోకి వెళ్లాలని, న్యాయం చేస్తానని చెప్పారు. అందుకు ఒప్పుకోని యువతి ఇన్ని రోజులుగా ఎందుకు పట్టుకోలేదని, మహేష్ ఎక్కడుండో కుటుంబ సభ్యులకు తెలుసని పేర్కొంది. నా భర్త నాక్కావాలని, ఎక్కడికి వెళ్లేది లేదని చెప్పింది. గ్రామస్తులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. చదవండి: తలనొప్పి, గొంతులో గరగరా? అయితే వెంటనే.. -
గర్భవతిని చేసి పరార్.. నా భర్త నాకు కావాలి.. ఓ భార్య పోరాటం..
రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... నిజమేనని నమ్మి దగ్గరైన ఆమెను గర్భం చేసిన తరువాత కులపరమైన సమస్యలతో తప్పించుకోవాలని చూశాడు. విషయం పెద్దల వరకూ వెళ్లడంతో చీవాట్లు పెట్టి ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహం జరిగిన పది రోజుల తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో ఆ బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. నాలుగు నెలలుగా ఎదురు చూసిన తన అత్త, మామలు ఇంటి వద్ద ‘భర్త కావాలని, న్యాయం చేయాలంటూ ఆదివారం బైఠాయించారు. (చదవండి: బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్) చీపురుపల్లి(విజయనగరం జిల్లా): గర్భం చేసి తప్పించుకోబోయిన యువకుడిచే పెద్దల సమక్షంలో తాళి కట్టించుకొని పరారైన భర్త కోసం ఓ వివాహిత చేస్తున్న పోరాటమిదీ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె మాటల్లోనే... డైలీ మార్కెట్‌కు చెందిన నా పేరు నర్రు వందన. తన ఇంటి ఎదురుగా ఉన్న నర్రు చినబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. ఆయన మాటలు నమ్మి గర్భవతినయ్యాను. వివాహం చేసుకోవాలని నిలదీస్తే ‘ఎస్సీ కులం కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదంటూ మాటమార్చాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఏడాది జూన్ 20న అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అత్త,మామలు తమను ఇంటిలోకి రానివ్వకపోవడంతో చీపురుపల్లిలోని కొత్తగౌడవీధిలో తన అన్నయ్య నివాసం వద్ద ఉన్నాం. సరిగ్గా పది రోజుల తరువాత జూన్ 30న తన ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి ఇంతవరకూ రాలేదని, తన అత్తమామలే ఎక్కడో దాచారని, తనకు న్యాయం చేయాలని ఆదివారం అత్తమామల ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ తనకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తమకేమీ సంబంధం లేదని నిందితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు మాట్లాడుతూ అందిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నామన్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
నా భర్త నాకు కావాలి.. భార్య నిరసన...
గోపాలపట్నం: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరశన చేపట్టిన ఘటన గురువారం కోటనరవలో సంచలనం రేపింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం మల్కాపురానికి చెందిన లావణ్యకు కోటనరవకు చెందిన దొడ్డి త్రినాథ్‌తో 2017లో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. ఆ తర్వాత ఆడపడుచులు, అత్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పెద్దల సమక్షంలో గొడవలు సద్దుమనిగేలా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం లావణ్యకు త్రినాథ్ విడాకుల నోటీసు పంపించాడు. మరో పెళ్లి చేసుకునేందుకే విడాకుల నోటీసులు పంపించారని, తనకు భర్త కావాలని ఆమె వేడుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని, తన భర్త తనకు కావాలని వేడుకొంటోంది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఆందోళన చేపట్టిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
టెక్కీ భర్త.. కాపురానికి పనికిరాడనే విషయం దాచి
సాక్షి, మన్సూరాబాద్ : వివాహం చేసుకున్న వారం రోజులకే భార్యను వదిలించుకోవాలని వేధింపులకు పాల్పడుతున్న అత్తింటి ఎదుట కోడలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని రాక్‌టౌన్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్, పద్మలకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ముంబాయిలో ఉంటున్నాడు. ఈ ఏడాది జనవరి 8న వారి పెద్ద కుమార్తె తేజస్వీనితో రాక్‌టౌన్‌కాలనీకి చెందిన బత్తులు ఏడుకొండలు–సుశీల పెద్ద కుమారుడు వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేశ్వర్లు (30)తో వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు నగరంలో క్లేవ్‌టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజస్వీని బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. వివాహ సమయంలో సుమారు రూ.20లక్షల వరకు బంగారం, కట్న కానుకలుగా అందజేశారు. వివాహ సమయంలో తన భర్త నానమ్మ అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి వివాహ తంతుని త్వరగా ముగించారు. వివాహమైన వారం రోజుల తరువాత నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితురాలు తెలిపింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాగైన వదిలించుకోవాలని పథకం ప్రకారం కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్దనే బాధితురాలిని ఉంచుతున్నారు. అంతేకాకుండా తన భర్త వెంకటేశ్వర్రావు కాపురానికి పనికిరాడనే విషయం కుటుంబసభ్యులకు తెలిసినా వివాహం జరిపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 24న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేయగా అక్కడ వారికి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తన భర్త కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారన్నారు. ఇప్పటి వరకు స్పందన లేకపోవటంతో మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట న్యాయం చేయాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది. చదవండి: బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై ఆమెతో బిక్షాటన వివాహేతర సంబంధం: బంధువులు వదిలిపెట్టరని.. -
రెండో పెళ్లికి సిద్ధమైన భర్త: భార్య నిరసన
సాక్షి, శ్రీరంగరాజపురం: భార్య, పిల్లలుండగానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. సమాచారమందుకున్న భార్య, పిల్లలు కలిసి భర్త ఇంటి వద్ద నిరసనకు దిగారు. భర్త, అత్త మామలు పరారైన సంఘటన శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు సంధ్య తమగోడును మీడియాకు వినిపించింది. చిత్తూరులోని కొండమిట్టకు చెందిన లలిత, మురళి దంపతుల కుమార్తె సంధ్యను శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలోని నిర్మల, నాగరాజ్‌పిళ్లై దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్‌కు 2006లో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లయిన ఏడాదికే వీరు ఉపాధి కోసం గుంటూరుకెళ్లి 2010 వరకు అక్కడే ఉన్నారు. అప్పుడే వీరికి శాలిని(15), రోహిత్(10) జన్మించారు. తరువాత స్వగ్రామం కొత్తపల్లిమిట్టకు చేరుకుని అత్త, మామలతో కలిసి ఉన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. క్రమంగా అత్త, మామ, భర్త సంధ్యను వేధించడం మొదలుపెట్టారు. అయినా పిల్లల కోసం వేధింపులను ఐదేళ్లు భరించింది. తరువాత భరించలేని స్థితిలో 2015లో తన ఇద్దరు పిల్లలతో చిత్తూరుకు వెళ్లి అద్దె ఇంట్లో కాపురం పెట్టింది. కుటుంబం కోసం ప్రైవేట్ కళాశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ ఉదయ్‌కుమార్ కోర్టుకెక్కాడు. దీంతో సంధ్య కోర్టులో భర్తతో విడిపోవాలన్న ఆలో చన తనకు లేదని జడ్జి ముందు వాపోయింది. కోర్టులో తీర్పు వెలువడక ముందే ఉదయ్‌కుమార్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న సంధ్య భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి నిరసనకు దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించారు. -
కామారెడ్డి: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
సాక్షి, మాచారెడ్డి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతు భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని బండరామేశ్వర్‌పల్లిలో జరిగింది. కోడలి రాకను గమనించిన అత్త లక్ష్మీ, మామ నారాయణ ఇంటికి తాళం వేసి పరారైనట్లు ఆమె తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బండ రామేశ్వర్పల్లికి చెందిన ఉట్ల శ్రీనివాస్‌కు కామారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి శరణ్యను రెండేళ్ల కింద ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా కట్న కానుకలతో పాటు నగదు, బంగారాన్ని అందజేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గాయత్రి శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవాలని తనపై ఎన్నో నిందలు వేస్తున్నారని ఆరోపించింది. తనను వేధిస్తున్న భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు! -
నా భర్తకు మరో పెళ్లట... నాకు న్యాయం చేయండి!!
సాక్షి, కామారెడ్డి: ఓ మహిళ తన భర్త కోసం 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష నేటికి 41వ రోజుకు చేరుకుంది. భర్త నవీన్ ఇంటి ముందే ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు అశోక్ నగర్ కాలనీలో భర్త కోసం భార్య పైడి అరుణ భర్త ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాలో మాట్లాడుతూ.. పైడి నవీన్‌తో తనకు 2017 సంవత్సరంలో పెళ్లి జరిగిందని, పెళ్లి సమయంలో 14 లక్షల నగదు , 23 తులాల బంగారం కట్నంగా ఇచ్చామని తెలిపారు. పెళ్లి తర్వాత ఆరు నెలల వరకు తాము బాగానే ఉన్నామని, ఆ తర్వాత అదనంగా రూ. 15 లక్షల కట్నం తీసుకురావాలని తన అత్తమామలు వేధింపులకు గురిచేశారని చెప్పారు. తన మామ సురేందర్ అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆరోపించారు. తనకు పిల్లలు పుట్టరని వదంతులు సృష్టించి తన భర్తకు మరో పెళ్లి చేయాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ విషయం తెలిసిన వెంటనే కుల పెద్దల సమక్షంలో మాట్లాడిన్నట్టు తెలిపారు. కానీ, తాజాగా మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేయాలని తన అత్తమామలు చూస్తున్నారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజైనా తనకు న్యాయం చేయలని అరుణ కోరుతున్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. చదవండి: వృద్ధుడిని నమ్మించి..కోటి రూపాయలతో ఉడాయించి -
చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు
కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన ఓ అమ్మాయి ఆశలు ఆవిరయ్యాయి. ప్రేమగా చూసుకుంటాడనుకున్న భర్త మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుండటంతో లబోదిబోమంటోంది. అత్తామామలు తనకు అండగా నిలబడతారనుకుంటే ఆమెను వదిలించుకునేందుకే మొగ్గు చూపుతుండటంతో తనకు దిక్కెవరంటూ బోరుమని ఏడుస్తోంది. సాక్షి, కామారెడ్డి: కట్టుకున్న వాడు మరో పెళ్లికి రెడీ అవుతుండటంతో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన పైడి నవీన్ కుమార్‌తో వేములవాడకు చెందిన అరుణకు 2017 అక్టోబర్ 6న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబ సభ్యులు పెళ్లికొడుక్కు రూ.14 లక్షల నగదు, 23 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. దీనికి తోడు ఆడపడుచు కట్నం కింద మరో రూ. 50 వేలు సమర్పించుకున్నారు. (చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై) కానీ పెళ్ళైన పదిరోజుల నుంచే అరుణ పట్ల ఆమె మామ సురేందర్ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఆరు నెలలు ఈ ఇబ్బందులను ఎలాగోలా నెట్టుకొచ్చిన అరుణ ఆరోగ్యం బాగోలేక ఇంటికి వెళ్లింది. కానీ తిరిగి వచ్చేసరికి భర్తకు వేరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరడంతో గతేడాది భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. అయినా ఆమె సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో నేడు మరోసారి ఇంటిముందు బైఠాయించింది. ప్రాణం పోయినా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఘంటాపథంగా చెప్తోంది. (చదవండి: నా భర్త నాకు కావాలి..) -
నా భర్త నాకు కావాలి..
సాక్షి, హన్మకొండ చౌరస్తా(వరంగల్): ‘నా భర్త నాకు కావాలి’అంటూ ఓ ఇల్లాలు అత్తింటి ఎదుట దీక్షకు దిగింది. వరంగల్ నగరంలోని పెరుకవాడకు చెందిన అనూషకు హన్మకొండ యాదవనగర్ కు చెందిన హేమంత్‌తో 2015 మార్చి 31న వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి అనూష తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, 50 తులాల బంగారాన్ని కట్నకానుకలుగా ఇచ్చారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన హేమంత్‌తో పెళ్లి అయిన తర్వాత బెంగళూరుకు వెళ్లారు. అక్కడ వారికి కొడుకు సాత్విక్ జన్మించాడు. అన్న, వదినల చెప్పుడు మాటలతో అనుమానం పెంచుకున్న హేమంత్.. కొడుకు సాత్విక్ తనకు పుట్టలేదంటూ అనూషను బెంగళూరు నుంచి వరంగల్‌కు పంపించాడు. అప్పటి నుంచి ఆమె కోర్టు ద్వారా పోరాటం చేస్తోంది. కోర్టు అనుమతితో బాబుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. హేమంత్ వారసుడే అని నివేదిక వచ్చింది. అయినా కోర్టు తీర్పును సైతం లెక్క చేయడం లేదని అనూష విలపిస్తోంది. తోటి కోడళ్లు, అత్తమామ, ఆడపడుచుల చెప్పుడు మాటలు విని తన భర్త దూరం పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటం చేస్తున్న అనూషకు పలు మహిళా సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు మంచాల జ్యోత్స్న, తరాలపల్లి రాజమణి, కళ, ఆశ, జ్యోతి మద్దతుగా నిలిచారు. -
చంటిబిడ్డతో రాత్రంతా జాగారం
-
చంటిబిడ్డతో రాత్రంతా జాగారం
వాల్మీకిపురం : ఓ యువతిని అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. ఫలితంగా ఆమె రాత్రంతా చంటిబిడ్డతో కలిసి గుడిలో జాగారం చేసింది. తెల్లారాక మరోమారు వేడుకున్నా అత్తింటివారు కరుణించలేదు. అయినా “నా భర్త కావాలి.. నాకు న్యాయం చేయండి’ అంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది. వాల్మీకిపురం మండలంలో ఆదివారం జరిగిన హృదయ విదారక సంఘటన ఇదీ. చౌడేపల్లె మండలం చిట్టిరెడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె తేజస్విని(25)కి వాల్మీకిపురం మండలం ఓబుళంపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాలాజీ(30)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య చిన్నచిన్న తగాదాలు ప్రారంభయ్యాయి. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. కొంత కాలంగా అమ్మగారింట్లో ఉన్న తేజస్విని ఐదు నెలల చంటిబిడ్డతో శనివారం సాయంత్రం అత్తవారింటికి వెళ్లింది. అత్తింటివారు ఇంట్లోకి అనుమతించలేదు. ఇంటి ముందే ఎంతసేపు నిరీక్షించినా ఎవరూ కనికరించలేదు. చివరకు బిడ్డను ఒడిలో ఉంచుకుని ఇంటికి ఎదురుగా ఉన్న ఆలయంలోనే రాత్రంతా తలదాచుకుంది. ఆదివారం ఉదయం కూడా ఎంత బతిమాలినా అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. చివరకు వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తన భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఐ శివభాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరులు తెలిపారు. -
భర్త ఇంటి ఎదుట మొదటి భార్య వంటావార్పూ
హుజూరాబాద్‌రూరల్: కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ మండలంలోని కందుగుల గ్రామంలో ఓ భార్య, భర్త ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినోద్‌తో కమలాపూర్ గ్రామానికి చెందిన పుల్ల సుధకు ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో సుమారు రూ.8 లక్షల కట్నం ఇచ్చారు. ఈక్రమంలోనే కొన్నినెలలుగా వినోద్ అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. కట్నం తేవాలని భార్య సుధను పుట్టింట్లో వదిలివెళ్లగా, పలుమార్లు పంచాయితీ నిర్వహించినా మార్పులేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఏడాదిక్రితం హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సుమలతను వినోద్ వివాహం చేసుకొని హైదరాబాద్ వెళ్లాడు. కందుగుల గ్రామానికి భర్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య సుధ భర్త ఇంటి ఎదుట మూడురోజుల నుంచి మౌన దీక్ష చేపట్టింది. భర్త ఇంటి ఎదుట వంటావార్పూ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది. -
9 నెలలుగా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో...
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ సాయి కృష్ణ నగర్ లో విహహిత మౌనిక తన భర్త ఇంటి ముందు గురువారం ధర్నా చేపట్టింది. అత్తింటి వారు తనని వేధిస్తున్నారని, భర్త తనని కాపురానికి తీసుకువెళ్లడం లేదని ఆందోళన చేపట్టింది. తనని వదిలించుకోవాలనే ఉద్దేశంతో తన మానసిక పరిస్థితి బాగోలేదని ఆరోపణలు చేస్తున్నారని మౌనిక తెలిపింది. భర్త తనని వదిలేసిన అనంతరం, మౌనికను ఆమె తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్‌కు చూపించారు. మౌనిక మానసికంగా ఫిట్‌గా ఉందని సైక్రియాటిస్ట్ నిర్థారించారు. (భర్త ఇంటి వద్ద భార్య పడిగాపులు) నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మౌనికను సరూర్ నగర్ కు చెందిన సంతోష్ కుమార్ కు ఇచ్చి 2017 లో పెద్దలు విహాహం జరిపించారు. కట్నకానుకలు కింద 30తులాల బంగారం,కిలో వెండి,రూ. 3.50 లక్షల నగదును మౌనిక తల్లిదండ్రులు ఇచ్చారు. వీరిద్దరికి కార్తికేయ అనే రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. 9 నెలల క్రితం మౌనికను పుట్టింటికి పంపి విడాకులు కావాలంటూ భర్త సంతోష్ కుమార్ ఆమెకు కోర్టు ద్వారా నోటీసులు పంపిచారు. దీంతో నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీసు స్టేషన్ లో సంతోష్ కుమార్ పై మౌనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన సంతోష్ కుమార్ తన తీరు మార్చుకోలేదు. 9నెలలు అయిన భర్త ఇంటికి తీసుకెళ్లక పోవడంతో గురువారం మౌనిక తన భర్త సంతోష్ కుమార్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంటిలో లేడు. మౌనికను ఇంట్లోకి రానీయకుండా అత్త, మామ, మరిది అడ్డుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తన కొడుకుతో కలిసి మౌనిక రోడ్డుపై బైఠాయించింది. (ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి దీక్ష) -
భర్త ఇంటి వద్ద భార్య పడిగాపులు
రఘునాథపాలెం: భర్త తనను పుట్టింట్లో వదిలేసి 6 నెలలవుతుందని, తనను, తన ఏడాది కుమారుడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని కోరుతూ ఓ వివాహిత గత మూడు రోజులుగా భర్త ఇంటి వద్ద పడిగాపులు కాస్తోంది. దీనికి సంబంధించి బాధితురాలు ప్రియాంక తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని జింకలతండాకు చెందిన ఓ యువకుడు జైళ్లశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా డు. ఆ యువకుడికి గత రెండు సంవత్సరాల క్రితం కారేపల్లి మండలం పాటివారి గుంపునకు చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. కట్నంగా రూ.10 లక్షల విలు వ చేసే బంగారం, రూ.20 లక్షల నగదు ఇచ్చారు. వారికి ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు. ఆరు నెలలు క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తనను పుట్టింటి వద్ద వదిలి వెళ్లాడు. తర్వాత తీసుకుపోవడానికి రాకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో పాటు కారేపల్లి పోలీసు స్టేషన్లో సైతం కౌన్సెలింగ్ నిర్వహించారని ప్రియాంక తెలిపింది. అప్పుడు 10 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పిన భర్త ఎంతకూ తీసుకెళ్లకపోవడంతో భర్త స్వగ్రామమైన జింకల తండాకు గత మూడు రోజులు క్రితం తన తల్లిదండ్రులతో వచ్చింది. తాము రాగానే అత్తామామలు ఇంటికి తాళం వేసి వెళ్లారని, నాటి నుంచి తాము ఇంటిముందు వరండాలోనే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపింది. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. ఈ విషయమై రఘునాథపాలెం ఎస్సై సంతోష్‌ను వివరణ కోరగా తమకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
న్యాయం చేయాలంటూ..
కర్నూలు, డోన్ టౌన్: కట్టుకున్న భర్త నుంచి తనకు, కుమారునికి న్యాయం చేయడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట లక్ష్మిదేవి అనే మహిళ బుధవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. వివరాలు.. పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన లక్ష్మిదేవి రంగన్న కుమార్తె అయిన అక్ష్మిదేవిని ఆనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు ఇచ్చి 12ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడున్నాడు. అయితే కొంత కాలంగా అదనపు కట్నం తేవాలంటూ వేధించడమే గాకుండా భార్య వదిలి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వెతికి తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పంచాయితీలో రాజీ చేసుకొని భార్య లక్ష్మిదేవికి రూ.3లక్షలు చెల్లించేలా ఒప్పందం చేశారు. అయితే కుంటుంబంతో ఉండకుండా, ఒప్పందం చేసుకున్న మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే పోలీసులు స్పందించకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ విషయంపై పట్టణ పోలీసులను వివరణ కోరగా ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచా రం తమ వద్ద లేదని చెప్పారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పకుందం చేసుకున్నదానికి తమకు సంబంధం లేదన్నారు. -
భర్త ఇంటిముందు భార్య ధర్నా!
సాక్షి, హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందని ఓ ప్రబుద్ధుడు భార్య ఇంటి నుంచి గెంటేశాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తానంటూ షరతులు పెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం వంతపాడారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు తన చిన్నారితో కలిసి ఓ మహిళ మౌనపోరాటానికి దిగింది. పసిపాపతో కలిసి ధర్నా చేపట్టింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్‌లో జరిగింది. సహారా ఎస్టేట్‌లో ఉంటున్న మౌనిక, ఉదయ్‌కుమార్ దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది నుంచి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అత్తమామలే కాదు మరిది కూడా తనను కొట్టేవారని బాధితురాలు మౌనిక తెలిపారు. ఈ క్రమంలో ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి భర్త ఉదయ్ బయటకు పంపించాడని పేర్కొంటూ మౌనిక తన చిన్నారి కూతురితో కలిసి ధర్నా చేపట్టారు. అంతేకాకుండా సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా చేస్తున్న మౌనికను, ఆమె బిడ్డను భర్త, అత్తమామ ఇంట్లోకి తీసుకెళ్లారు. -
పాప పుట్టిందని కాదంటున్నాడు
సంతబొమ్మాళి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పెద్దలకు తెలియకుండా కాపురం కూడా పెట్టాడు.. పాపపుట్టిందని ముఖం చాటేశాడొక ఘనుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని నర్సాపురం పంచాయతీ పరిధి యర్నాగులపేట గ్రామానికి చెందిన యర్నాగుల అరవింద్, విశాఖపట్నానికి చెందిన వానపల్లి శ్రావణికి రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. విశాఖపట్నంలో కాపురం కూడా పెట్టాడు. రెండు వారాల క్రితం వీరికి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని తన ఇంట్లో అంగీకరించని చెప్పి అరవింద్ భార్య శ్రావణితో గొడవపడి వెళ్లిపోయాడు. ఎప్పటికీ రాకపోవటంతో అరవింద్ ఇంటి వద్దకు చేరుకున్న శ్రావణికి అక్కడ కూడా చుక్కెదురైంది. నీవెవరో తెలిదని, తమకు సంబంధం లేదని అరవింద్ తల్లి తేల్చిచెప్పింది. దీంతో చేసేదిలేక అక్కడే దీక్షకు దిగింది బాధితురాలు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్ఐ కామేశ్వరరావు శ్రావణిని స్టేషన్‌కు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామపెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని అరవింద్ కుటుంబ సభ్యుల హామీతో ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష
సాక్షి, కర్నూలు : న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్షకు దిగిన ఘటన మండల పరిధిలోని ఉల్చాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు ఉమాదేవి మాట్లాడుతూ ఉల్చాల గ్రామానికి చెందిన బోయ రాజ్‌కుమార్ తనను గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నాడన్నారు. కర్నూలు బళ్లారి చౌరస్తాలో కాపురం పెట్టి, కొద్ది రోజులు మోజు తీర్చుకొని, తనకు చెప్పకుండా ఉల్చాల గ్రామానికి వెళ్లాడన్నారు. ఇప్పుడు తక్కువ కులందానికి కావడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ తనను మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని, పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉమాదేవికి సర్ధిచెప్పి దీక్ష విరమింపజేశారు. -
ఫేస్బుక్ పరిచయంతో ప్రేమ పెళ్లి
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని పోసానీపేట గ్రామంలో భర్త ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఓ భార్య ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు సంజన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంజన ఐదేళ్ల కిత్రం రామారెడ్డి మండలం పోసానీపేట గ్రామానికి చెందిన గాండ్ల ప్రవీణ్‌కు ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం అనంతరం ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. వివాహం జరిగి రెండేళ్లు అయింది. తన భర్త ప్రవీణ్ అక్రమ సంబధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సంజన ఆరోపించింది. అలాగే తను గతంలో అనేక సార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం భర్త ప్రవీణ్ ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది. -
కాపురానికి తీసుకెళ్లడం లేదని ..
కొండమల్లేపల్లి (దేవరకొండ) : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను.. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన మాచర్ల విజయ అదే గ్రామానికి చెందిన పిరాటి శంకర్లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ 27న నల్లగొండలోని ఛాయాసోమేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజల పాటు హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో స్వగ్రామానికి శంకర్ తిరిగొచ్చాడు. అప్పటి నుంచి తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఇదేంటని ప్రశ్నిస్తే తమ కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని శంకర్ విజయకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన విజయ దేవరకొండ పోలీసులను ఆశ్రయించగా శంకర్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ శంకర్ కాపురానికి తీసుకెళ్లేందుకు ససేమిరా అనడంతో విజయ సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్తను తనను కలపి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజయ కోరుతుంది. -
మెట్టినింటి ముందు భార్య మౌనదీక్ష..
అనంతపురం, ఉరవకొండ: అడిగినంత కట్న కానుకలు.. అంగరంగ వైభవంగా పెళ్లి.. ఏడాది తర్వాత భార్యపై భర్తకు అనుమానం.. ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూపుతూ వేధింపులు.. రెండేళ్లుగా అదనపు కట్నం కోసం ఒత్తిళ్లు.. భర్తను కలవనీయని అత్తమామలు.. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ ఇల్లాలు మెట్టినింటి ఎదుట మౌనదీక్షకు కూర్చుంది. న్యాయం జరగకపోతే ఈ ఇంటి వద్దే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమున్నీరవుతూ ప్రకటించింది. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జి.నాగరంగయ్య, కాంతమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఝాన్సీరాణికి ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మొక్కిన శ్రీరాములు, సువర్ణమ్మ దంపతుల కుమారుడు మొక్కిన నరేష్‌కు 2015 మార్చి 8న వివాహమైంది. కట్న కానుకలకింద నరేష్‌కు రూ.10 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారం ఇచ్చారు. దీంతో పాటు రూ.5లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. నరేష్ ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుడంతో అక్కడే కాపురం పెట్టారు. అనుమానంతో చిత్రహింసలు ఏడాది పాటు సంసారం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి భర్త ప్రతి చిన్న విషయానికీ అనుమానంతో ఝాన్సీరాణిని ఇబ్బంది పెట్టేవాడు. దీనికి తోడు నరేష్ తన తల్లిందండ్రుల మాట విని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. మీ పుట్టింటికి వెళ్లి రూ.20లక్షలు తీసుకురా (అదనపు కట్నం) అంటూ ముంబైలో నిత్యం వేధింపులకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేక ఝాన్సీరాణి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కుమార్తెను అల్లుడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో 2017జూన్‌లో తాడిపత్రికి తీసుకొచ్చారు. దీనిపై ఎన్నోసార్లు నరేష్‌తో, వారి తల్లిదండ్రులతో మాట్లాడించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఝాన్సీరాణి న్యాయం కోసం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉరవకొండ స్టేషన్లో కుడా ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నరేష్ తండ్రి శ్రీరాములుకు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. భర్త ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా: తనకు తనభర్తతో కలిసి జీవించేలా చేయకపోతే, వారి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఝాన్సీరాణి స్పష్టం చేసింది. భర్త ఇంటి ముందే మౌనదీక్ష కొనసాగిస్తోంది. -
హేమలత న్యాయపోరాటం
అనంతపురం, తాడిమర్రి: ప్రేమించి..పెళ్లిచేసుకున్నోడే...నేను పోషించలేను...నిన్ను ఏలుకోలేనని నిర్దయగా చెప్పగా...అతన్ని నమ్మివెళ్లిన ఆ అమ్మాయి జీవితం సందిగ్ధంలో పడింది. కేవలం ‘కులం’ వేరు కావడంతోనే తన అత్తామామలు చేరదీయక అన్యాయమై పోయిన హేమలత దిక్కుతోచని స్థితిలో మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పరిచయం..ప్రేమ...పెళ్లి తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి గ్రామానికి చెందిన ఎరికల సామాజిక వర్గానికి చెందిన సాకే ఈరప్ప, సాకే లింగమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారికి వాణి, హేతలత ఇద్దరు అమ్మాయిలు సంతానం. కూలికెళితే గానీ పూట గడవని కుటుంబం..అయినా పిల్లలిద్దరినీ కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తె వాణి డిగ్రీ (బీఎస్సీ) చదవగా.. చిన్న కుమార్తె హేమలత ధర్మవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీకాం) చదివింది. అక్కాచెల్లెలు ఇద్దరు రోజు కళాశాలకు ధర్మవరం వెళ్లి, వస్తుండేవారు. ఈ క్రమంలో హేమలతకు తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లి గ్రామానికి చెందిన పాళ్యం శివయ్యతో పరిచయం ఏర్పడి... అది ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. పెద్దలు ఒప్పుకోరని.... ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరని భావించిన హేమలత, శివయ్య ఏప్రిల్ 21న ధర్మవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి పరీక్ష రాసి తిరుపతికి వెళ్లారు. అక్కడే ఓ ఆలయంలో ఆదే రోజున వివాహం చేసుకున్నారు. సాయంత్రానికి రావాల్సిన కూతురు ఇంటికి రాకపోవడంతో హేమలత తల్లిదండ్రులు కళాశాల, బంధువుల గ్రామాల్లో విచారించారు. చివరకు కూతురు కనిపించలేదని తాడిమర్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంతలో వధూవరులిద్దరూ పూలఓబయ్యపల్లిలోని వరుని ఇంటికి వెళ్లారు. ‘‘ఎరికల కులం అమ్మాయివి నీవు మా ఇంటిలోకి రాకూడదు’’ అని అత్తామామలు హేమలతను గెంటేశారు. కుమారునికి మాయమాటలు చెప్పి హేమలతపై మనసు లేకుండా చేశారు. పోలీసులు ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం పెట్టిస్తే నెల తిరక్కనే ‘‘నిన్ను పోషించలేను’’ అని వరుడు అడ్డం తిరిగాడు. దీంతో హేమలత తనకుటుంబీకులతో కలిసి న్యాయం పోరాటం చేస్తోంది. ఈక్రమంలోనే ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలవగా...ఆయన ధర్మవరం డీఎస్పీ వెంకటరమణకు ఫోన్‌చేసి న్యాయం చేయాలని ఆదేశించారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ప్రేమ, పెళ్లి అంటే ఏమిటో తెలియక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎరికల దానివి ఇంటిలోకి రాకూడదని మా అత్తామామలు అంటున్నారు. నా భర్త శివయ్య నిన్ను పోషించలేను, విడపోదామంటున్నాడు. ఒకసారి ఒకరితో తాళి కట్టించుకుని, జీవితం పంచుకుని విడిపోయి ఎలా జీవించను. న్యాయం జరిగే వరకూ పోరాడతా.–హేమలత, వధువు,నార్శింపల్లి, తాడిమర్రి తప్పకుండాన్యాయం చేస్తాం హేమలతకు తప్పకుండా న్యాయం చేస్తాం. అమ్మాయి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మంగళవారం నన్ను కలిసింది. వారి సమస్య విన్నాను. వెంటనే ధర్మవరం డీఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశా. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
ఇదరు పిల్లలతో కలిసి అత్తింటి ఎదుట మహిళ ధర్నా..
సనత్‌నగర్: తనను ఇంటి నుంచి పంపించి తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తింటి ముందు ధర్నాకు దిగింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. కోఠికి చెందిన లక్షితకు సనత్‌నగర్‌కు చెందిన శివకుమార్‌కు 2011 నవంబర్ 13న వివాహం జరిగింది. వీరికి లిఖిత, లోహిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో శివకుమార్ పని చేస్తుంటాడు. వివాహం కొంతకాలానికి భర్త, అత్తింటివారు వేధిస్తుండడంతో లక్షిత పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తలు రాజీ పడడంతో కోర్టు ఆదేశాల మేరకు మూడు నెలలుగా కలసి ఉంటున్నారు. అయితే మూడు రోజుల క్రితం వారి మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తడంతో లక్షిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయితే ఇంట్లో ఉంటే మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందనే కారణంతో భర్త లక్షితను ఇంట్లోకి రానివ్వక పోవడంతో ఆమె అత్తింటి ముందు మంగళవారం ధర్నాకు దిగింది. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు ఎక్కువయ్యాయని తనను ఇంట్లో నుంచి పంపించివేసి తన భర్తకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని లక్షిత ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. లక్షితకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లక్షిత, ఆమె భర్త శివకుమార్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదరు. దీంతో లక్షిత ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
పెళ్లి చేసుకున్నాడు.. పారిపోయాడు
అనంతపురం, తాడిమర్రి: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజులకే అమ్మాయిని వద్దన్నాడు. దీంతో ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్డీఓ కోర్టులో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రేమికునికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాలని ఆర్డీఓ తిప్పేనాయక్ ఆబ్బాయి తల్లిదండ్రులకు సూచించారు. దగ్గరుండి అబ్బాయి ఇంటిలో వారిద్దరినీ వదిలి రావాలని పోలీసులను ఆదేశించారు. కానీ పోలీసులు ఆ దంపతులను ధర్మవరంలోని ఓ ఇంట్లో వదిలారు. అయితే నెల రోజులు తిరక్కుండానే ప్రేమికుడు పారిపోయాడు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నార్శింపల్లి గ్రామం ఎరికల సామాజిక వర్గానికి చెందిన సాకే ఈరప్ప, లింగమ్మ దంపతుల కుమార్తె సాకే హేమలత ధర్మవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లి గ్రామం కురబ సామాజిక వర్గానికి చెందిన పాళ్యం ముత్యాలప్ప, పార్వతమ్మల కుమారుడు పాళ్యం శివయ్య కూడా ఆదే కళాశాలలోనే డిగ్రీ చదువుతున్నారు. ఒకే మండలానికి చెందిన వారు కావడంతో ఇద్దరూ స్నేహితులయ్యారు. వారి స్నేహం చివరకు ప్రేమగా మారడంతో డిగ్రీ మూడవ సంవత్సరం చివరి పరీక్ష రోజున (20–03–2019) ఇద్దరూ తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 22న పోలీసులు వారిని పిలిపించారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్ ముందు బైఠాయించిన హేమలత ఇంతలో ఏమైందో కానీ.. అమ్మాయి అంటే తమకు ఇష్టం లేదని ప్రేమికుడు, అతని బంధువులు పట్టు పట్టారు. దీంతో పోలీసులు వారిని ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లగా... ఆయన అబ్బాయికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అమ్మాయిని కోడలుగా అంగీకరించాలని పంపారు. ఇద్దరూ ధర్మవరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ పట్టణంలోనే కాపురం పెట్టారు. గత «శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న శివయ్యను అతని సమీప బంధువులు వెంకటరమణ, పూజారి నరసింహులు బయటకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి శివయ్య ఆచూకీ లేదు. దీంతో హేమలత శనివారం తాడిమర్రి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఐ శరత్చంద్ర శివయ్యను పిలిపించారు. ఇంతలో దాడితోటలో అరటితోట దగ్ధం కావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో శివయ్యను కొందరు టీడీపీ నాయకులు తప్పించారు. దీంతో హేమలత తన బంధువులతో కలసి ఆదివారం పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగింది. సోమవారం సీఐ దగ్గరకు తీసుకెళ్లి న్యాయం చేయిస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు ధర్నా విరమించి ఇంటికి వెళ్లారు. -
అత్తింటి ముందు బిడ్డతో కోడలు ఆందోళన
మదనపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. అయితే అతని తల్లిదండ్రులు దళితురాలనే నెపంతో కోడల్ని ఇంట అడుగు పెట్టనీయలేదు. దీంతో అతడు ఆమెను వదిలించుకునేందుకు వేధింపులకు పూనుకున్నాడు. గుట్టుగా రెండో పెళ్లి ప్రయత్నాల్లో పడ్డాడు. ఇది తెలుసుకున్న అతడి భార్య బిడ్డతో సహా వచ్చి తనకు అన్యాయం చేయవద్దని అత్తమామల్ని, భర్తను ప్రాధేయపడింది. అయితే వారు ఆమెను తూలనాడుతూ గెంటేయడంతో న్యాయం కోసం ఆమె రోడ్డెక్కింది. తన బిడ్డతో సహా అత్తగారింటి ముందు ఆందోళన చేసింది. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని రెడ్డిగారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం..కొత్తిండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన దీపాకుమారి స్థానికంగా ఒక నర్సింగ్ హోమ్‌లో డయాలసిస్ టెక్నీషియన్‌గా పనిచేసేది. రెడ్డిగానిపల్లెకు చెందిన శేషాద్రి బాబాయి ఆస్పత్రిలో పనిచేస్తుండేవాడు. దీపాకుమారితో అతడి పరిచయం ప్రేమగా మారింది. వేర్వేరు కులాలకు చెందిన వారు పెద్దలకు తెలియకుండా తవళం నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో 2016 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. బసినికొండలో కాపురం పెట్టారు. మూడు నెలలు సజావుగా వారు కాపురం సాగింది. తర్వాత శేషాద్రి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఎస్సీ అనే నెపంతో వారు దీపాకుమారిని కోడలిగా అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకునేందుకు శేషాద్రి విడాకులివ్వాలని వేధించేవాడు. అప్పటికే గర్భంతో ఉన్న ఆమె తన భర్త వేధింపుల విషయమై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. పోలీసులు శేషాద్రి, కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయిననూ వారి తీరు మారలేదు. గొడవలు..మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే దీపాకుమారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యవధిలో కేరళలో ట్రైనింగ్ పేరిట వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడం, తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు యత్నిస్తున్నారని, భర్త గ్రామంలోనే ఉంటున్నాడని తెలియడంతో ఏడాదిన్నర వయసున్న బిడ్డతో రెడ్డిగానిపల్లెలోని అత్తగారింటికి వెళ్లింది. అయితే ఆమెను తూలనాడి, బయటకు గెంటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. బిడ్డతో సహా అత్తారింటి ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేసింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేస్తామని తెలిపారు. -
చేతిలో చిల్లిగవ్వ లేదు తిండి లేదు.. న్యాయం కోసం ధర్నా
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్‌లోని సీ 83బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడని ఆమె ఎస్సార్‌నగర్‌లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాలని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు... చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. - బాధితురాలు లక్ష్మి -
భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష
కర్నూలు, ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య దీక్షకు కూర్చున్న సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు రాములమ్మ మాట్లాడుతూ మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దళిత రాములమ్మ ఎమ్మిగనూరులో డిగ్రీ చదివే సమయంలో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ పద్మశాలి వీరేష్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే రాములమ్మకు తెలియకుండా కోసిగికి చెందిన లక్ష్మిని వీరేష్ వివాహం చేసుకున్నాడు. ఎలాగైనా తనను వదలించుకోవాలని వీరేష్ వేధించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఇంట్లో నుంచి బయటకు పంపాడు. దీంతో రాములమ్మ గతేడాది డిసెంబర్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో బాగా చూసుకుంటానని ఇంట్లోకి పిలుచుకున్నాడు. మూడు రోజుల క్రితం దివ్యాంగ పింఛన్ తీసుకొచ్చాక డబ్బులు తీసుకొని ఇంటి నుంచి గెంటివేశాడని రాములమ్మ వాపోయింది. ఆరు నెలల పసిబిడ్డ ఉందని వేడుకున్నా వెళ్లగొట్టాడని, రెండు రోజుల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని కన్నీరు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వస్తే తాళం వేసి ఉందని, తనను ఇంట్లోకి పిలుచుకునే వరకు ఇక్కడే కూర్చుంటానని భీష్మించుకుంది. -
పసికందుతో మహిళ ధర్నా
తిరువొత్తియూరు: కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలతో ఇంట్లోకి అనుమతించని భర్త ఇంటి ముందు ఓ ఇల్లాలు సోమవారం చంటి బిడ్డ సహా మౌన పోరాటం చేసింది. వివరాలు.. వెస్టు ముగపేర్ కార్పెంటర్ వీధికి చెందిన దినేష్ (35) ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. అతని భార్య ప్రణీత (32). వీరికి రోహిత్ (9 నెలల) మగ బిడ్డ ఉన్నాడు. ప్రణీత వారం రోజుల ముందు అంబత్తూర్లో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఉదయం తన బిడ్డతో భర్త ఇంటికి వచ్చింది. ఆమెను వదిలి పెట్టడానికి తండ్రి బాలకన్నన్ వెంట వచ్చినట్టు తెలిసింది. భర్త దినేష్, అతని బంధువులు ప్రణీతను ఇంట్లోకి అనుమతించలేదు. బాలకన్నన్ వారికి సర్ది చెప్పినప్పటికీ వారు ససేమిరా అన్నారు. దీంతో ప్రణీత తన చంటి బిడ్డలో దినేష్ ఇంటి ముందు కూర్చుని మౌన పోరాటం చేశారు. ఆమె తండ్రి అక్కడే ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భార్య, భర్తకు సర్దిచెప్పారు. -
టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం..
వైఎస్ఆర్ జిల్లా, రైల్వేకోడూరు : పట్టణంలోని లూథరన్ చర్చి ప్రాంగణంలో నివాసం ఉంటున్న తెలుగుదేశం నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూని చంద్రయ్య కుమారుడు సునీల్ మొదట వెంకటరెడ్డిపల్లె అరుంధతీవాడకు చెందిన సుజాతను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి హాసిని, దీక్షిత్ అనే పిల్లలు కలిగారు. అనంతరం సునీల్ మరో అమ్మాయి రెడ్డమ్మను మొదటి భార్యను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు బిడ్డలు పుట్టాక.. మొదటి భార్యను నిర్లక్ష్యం చేశాడు. అంతేకాక తండ్రి టీడీపీ నాయకుడు కావడంతో పైరవీలు చేసి మొదటి భార్యను మరో ఇంట్లో పెట్టి ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి మొదటి భార్య సుజాత భర్త ఇంటి ముందు బిడ్డలతో సహా నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఆరు నెలలుగా తన భర్త సునీల్ తనను తొలగించుకోవాలని వేధిస్తున్నాడని ఆధారాలు కూడా లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెండో భార్యతో కలిసి తనను చూసుకోవాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయింది. పెద్ద మనుషులతో చెప్పినా మామ, భర్త పట్టించుకోకుండా తనను గెంటి వేస్తున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలలుగా కూలి చేసుకుంటూ బిడ్డలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విలపించింది. బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
వివాహితను పెళ్లి చేసుకుని.. మరో పెళ్లికి సిద్ధం..!!
పరకాల: భర్త నుంచి విడాకులు తీసుకున్న తనకు తోడుంటానని వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకొని..కూతురు పుట్టాక మరోపెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ ఓ మహిళ తనను మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన పరకాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని బాధితురాలిని పరకాల పోలీసుస్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం... పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లె కాలనీకి చెందిన రాయబారపు నితీష్ సికింద్రాబాద్‌లో ప్రైవేటు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ గొడవలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన హసీనాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనకు తన వెంటపడుతుండగా మొదట నిరాకరించిన హసీనా నాలుగేళ్ల క్రితం ఒప్పుకుంది. పిల్లలు వద్దంటూ పుట్టిన కూతురును విక్రయించే ప్రయత్నం నితీష్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2018 నవంబర్ 23న హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత కోపం పెంచుకున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో మరోపెళ్లికి సిద్ధపడుతూ తనకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ శనివారం మధ్యాహ్నం నితీష్ ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి ఆందోళనపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా వెళితే న్యాయం జరుగుతుంది తప్పా ఆందోళనతో సమస్య పరిష్కారం కాదంటూ నచ్చజెప్పి పంపారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బాధితురాలు హసీనా తెలిపింది. యువకుడి తల్లిదండ్రులు రూ.2లక్షల ఇస్తాం తమ కొడుకు నుంచి దూరంగానే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కోంది. పెళ్లి చేసుకున్న ఆధారాలను మాయం చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని..నితీష్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించింది. -
ఒకరితో పెళ్లి.. మరొకరితో జీవితం
సాక్షి, మంచిర్యాలక్రైం: జీవితాంతం నీ తోడు వీడనం టూ వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్త ఆమె ను మోసం చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకొని మొదటిì భార్యను ఇంట్లోంచి వెళ్లగొట్టిన ఓ ప్రబుద్ధుడి నిర్వాకం జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. భర్త మోసాన్ని భరించలేని సదరు మహిళ పెద్దలను ఆశ్రయించింది. అయినా న్యాయం జరగలేదు. మొక్కవోని దైర్యంతో కోర్టు మెట్లెక్కిది. ఏడాది పాటు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూనే ఉంది. కోర్టులో జాప్యం అవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో భర్త ఇంటి ఎదుట తల్లిదండ్రులు, కూతురుతో కలిసి న్యాయపోరాటానికి దిగింది. బాధితురాలు లాస్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంటకు చెందిన కట్కోజుల రాజమౌళి కూతురు లాస్యకు మంచిర్యాలకు చెందిన గజ్జెల శివశంకర్‌తో 2014 డిసెంబర్12న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4లక్షల కట్నం ముట్టజెప్పారు. ఏడాదిన్నరపాటు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కూతు రు పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు అదనంగా రూ.2లక్షల కట్నం తేవాలంటూ ఆమెను వేదింపులకు గురి చే శారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూ డా నిర్వహించారు. అయినా ఆమెకు న్యాయం జరుగలేదు. ఈ క్రమంలో అతడు మరో యువతిని రెండో పెళ్లి చేసుకోవడంతో తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ లాస్య జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో 2017 జూన్ 6న ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో భర్తతో పాటు అత్తామామ, ఆడబిడ్డలతో కలిపి 9మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాదిన్నరగా లాస్య కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. నేటికి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఎట్టకేలకు శుక్రవారం శివశంకర్ ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు న్యాయపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రమౌళి, ఎస్సై ఓంకార్‌యాదవ్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండోపెళ్లి చేసుకున్న శివశంకర్.. భార్యను, కన్న కూతురిని కాదని శివశంకర్ 2016లో హన్మకొండకు చెందిన బెజ్జాల నాగలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, లాస్యతో వివాహానికి ముందు నుంచే నాగలక్ష్మితో అక్రమ సంబంధం ఉన్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో విడాకులకైనా సిద్ధమే కాని నాగలక్ష్మిని మాత్రం వదిలి పెట్టనని శివశంకర్ చెప్పడంతో, దిక్కుతోచక న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు బాధితురాలు రోదిస్తూ చెప్పింది. -
భర్త కోసం అత్తారింటి వద్ద ఆందోళన
అనంతపురం, గార్లదిన్నె: భర్త కోసం భార్య అత్తారింటి ముందర న్యాయ పోరాటానికి దిగిన సంఘటన మండల పరిధిలోని కోటంక గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు, మహిళా సంఘం సభ్యుల కథనం మేరకు... ధర్మవరం మండలానికి చెందిన చంద్రకుమార్, కృష్ణవేణి దంపతుల కుమార్తె జోత్స్నను గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన మహేష్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. తర్వాత మనస్పర్థలు వచ్చాయి. పెద్ద మనుషులు పలుమార్లు నచ్చజెప్పి వారిని కలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో ఓసారి భార్యాభర్తలు గొడవపడటంతో ఆమె పుట్టింకి వెళ్లిపోయింది. తీసుకెళ్లడానికి భర్త రాకపోవడంతో ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. మహేష్ కూడా తనకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేసి జోత్స్నకు నోటీసులు పంపించారు. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి పద్మావతితో కలిసి అత్తారింటి ముందర ఆందోళనకు దిగింది. ఈ సమయంలో ఇంటివద్ద భర్త అత్తామామలు ఎవ్వరూ లేరు. ఈ సందర్భంగా జోత్స్న మాట్లాడుతూ ‘నా భర్త నాకు కావాలి. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడి సంరక్షణ భారమవుతుంది. పెళ్లి సందర్భంలో తల్లిదండ్రులు రూ.10లక్షలు కట్నం, 20 తులాలు బంగారం ఇచ్చారు. నా భర్త నన్ను ఎందుకు వద్దనుకుంటున్నాడో సమాధానం కావాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీ భర్త వచ్చాక చూద్దామని, స్టేషన్ వద్దకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కానీ ఆమె తన భర్త వచ్చే వరకు ఇక్కడే ఉంటానని బీష్మించుకుని కూర్చుంది. పోలీసులు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. ఆమెతోపాటు తల్లిదండ్రులు చంద్రకుమార్, కృష్ణవేణి, బంధువులు, మహిళా సంఘం సభ్యులు లక్ష్మిదేవి, పార్వతీ, నూర్జహాన్ తదితరులు ఉన్నారు. -
భర్త ఇంటిముందు భార్య ఆందోళన
తూర్పుగోదావరి, చింతూరు: మరో పెళ్లి చేసుకుని తనను మోసగించిన భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భార్య అతడి ఇంటిముందు బైఠాయించింది. బాధితురాలు గిరిజన యువతి పల్లెల శాంతి కథనం ప్రకారం.. మండలంలోని తులసిపాకకు చెందిన శాంతికి చింతూరులో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న సర్వేశ్వరరావుతో 2012లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అదే ఏడాది తెలంగాణలోని మేడారం జాతరలో సర్వేశ్వరరావు తల్లి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని ఆమె తెలిపింది. కొన్ని నెలలు సజావుగానే తమ కాపురం సాగిందని, తాను గర్భవతైన నాటి నుంచి భర్త వేధింపులు అధికమయ్యాయని వాపోయింది. తనను వేరేచోట పెట్టి ఇంటికి యువతులను తీసుకు వచ్చేవాడని, ఈ విషయం తెలిసి తాను ప్రశ్నిస్తే సిగరెట్లతో కాల్చడంతో పాటు ఉరేసి చంపేందుకు యత్నించాడని ఆమె ఆరోపించింది. మూడు నెలల క్రితం తనను తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేయడంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉంటున్నానని, రెండు నెలల క్రితం తెలంగాణాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయాడని ఆమె వాపోయింది. భర్త జాడ గురించి తన అత్తను అడిగితే తనకేమీ తెలియదని చెబుతోందని, దీనిపై చింతూరు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపింది. భర్త మరో పెళ్లి చేసుకుని తనను మోసగించాడంటూ శాంతి శుక్రవారం తన కుటుంబసభ్యులతో పాటు ఏడాది కొడుకు రోహిత్‌తో కలసి భర్త ఇంటిముందు బైఠాయించింది. తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తన ఆందోళన కొనసాగిస్తానని ఆమె తెలిపింది. -
నా భర్త నాకు కావాలి
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి ఆంజనేయపురం గ్రామంలో పెద్దింటి శ్రావణి అనే వివాహిత తన భర్త తనకు కావాలని భర్త ఇంటి ముందు శుక్రవారం బైఠాయించింది. ఇరువర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం... ఆంజనేయపురం గ్రామానికి చెందిన పెద్దింటి శేఖర్‌కు, దీపావళిపేటకు చెందిన శ్రావణిలకు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు యుగంధర్ ఉన్నాడు. అయితే అత్తమామలు, తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తు తనపై వివాహేతర సంబంధం, దొంగతనం అంటకట్టి తనను ఇంటిలోంచి వెళ్లగొట్టారని, తన కుమారుడిని కూడా తన దగ్గరకు రానివ్వడం లేదని బాధితురాలు శ్రావణి తెలిపింది. అయితే గతంలో పోలీసులను ఆశ్రయించామని వారు ఇరువర్గాలకు సర్ధిచెప్పి నా భర్త వద్దకు చేర్చారని అయితే కట్నం తెమ్మని నన్ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. లేకపోతే ఇంటినుంచి వెల్లగొట్టారని చెప్పింది. తనను అత్త ఆదమ్మ, మామ వెంకట్రావు, భర్త శేఖర్ కట్నం కింద ఆవు, ఫ్రిజ్‌లు తెమ్మంటున్నారని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ విషయమై భర్త శేఖర్‌ను అడుగగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, దానికి తోడు తమ గ్రామంలో బంగారం దొంగతనం చేసిందని తెలిపారు. అందుకే తనను ఇంటినుంచి పంపించేశామని భర్త, మామ తెలిపారు. దీంతో ఇరుగ్రామాల పెద్దమనుషుల మధ్య గొడవను పెట్టి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గొడవ తేలకపోవడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని భర్త ఇంటిముందు బైఠాయించి ఉన్న శ్రావణి నుంచి, భర్త నుంచి వివరాలు సేకరించారు. -
భార్యపై భర్త వేధింపులు
వరంగల్ : ఆస్తి కోసం కట్టుకున్న వాడితో పాటు.. కన్న పిల్లలు ఏడాదిగా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నారు.. చివరకు వారి వేధింపులు భరించలేక న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఇంటి ఎదుట నిరసన తెలిపిన సంఘటన నగరంలోని కాశిబుగ్గలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మార్కెట్లో అడ్తి వ్యాపారం చేస్తున్న భూతం లక్ష్మీనారాయణ, రమాదేవిలు ఓ సిటీలో కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. గత ఏడాది కాలంగా రమాదేవిని ఆస్తికోసం భర్త లక్ష్మినారాయణ, కొడుకు అనిల్, చిన్న కూతురు మధులత ముగ్గురు కలసి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆరునెలల క్రితం భర్త కర్రతో చితకబాదడంతో చేతి వేళ్లు పూర్తిగా వంకరయ్యాయి. కాశిబుగ్గ 13వ డివిజన్లోని బాపూజీ కాలనీలో తన సొంత ఇంటిలో అద్దెకు ఉంటున్న పెద్ద కూతురుకు సమాచారం అందించారు. ఆమె వెంటనే వచ్చి తల్లిని తీసుకుపోవడంతో పాటు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెకు ఎవరు బాసటగా లేకపోవడం వల్ల అక్కడ సైతం న్యాయం జరగలేదు. ఇంతలోనే భర్త తనకు విడాకుల నోటీసు పంపించినట్లు తెలిపింది. రెండుసార్లు కోర్టుకు తాను హాజరైనప్పటికీ భర్త లక్ష్మినారాయణ రాలేదని చెప్పింది. పెద్ద కూతురు దగ్గర ఉంటున్నప్పటికీ తరచుగా వస్తూ భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో భరించలేక ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంటి ఎదుట నిరసన.. కాశిబుగ్గలోని బాపూజీకాలనీలో ఉన్న ఇంటి ఎదుట రమాదేవి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు తన పేరు పైనే ఉందని చెప్పారు. కిరాయికి ఇచ్చినా.. అద్దెకు ఇల్లు ఇచ్చినా తీసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని ఇంతేజార్గంజ్ ఎస్సై శ్రీని వాస్ని కలిస్తే ఎందుకమ్మ వేరే ఇంట్లో కిరాయికి ఉండమని సలహా ఇచ్చార తెలిపారు. రెడ్డిపాలెంలోని ఐదెకరాల భూ మి అమ్మితే వచ్చిన రూ.2కోట్ల నగదు వారి వద్దనే ఉందని తెలిపారు. తన కొడుకు 15 ఏళ్లుగా అమ్మా అని పిలవడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. తాను పెద్దబిడ్డ వద్ద ఉంటున్నందున తన పేర ఉన్న ఆస్తిని వారి పేరు మీదకు మార్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆస్తి విషయంలో తనను వారు హత్య చేసేందుకు సైతం వెనుకంజ వేయరని రమాదేవి తెలిపారు. తనకు, తన పెద్ద కూతురుకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. -
అత్త ఇంటి ఎదుట భార్య నిరసన
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): బిడ్డను కన్న తర్వాత భర్త తనను పట్టించుకోవడం లేదని ఓ భార్య తన అత్తింటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన మధురానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ నేతాజీకాలనీకి చెందిన దొడ్ల తరుణ్‌కుమార్‌కు నందిగామకు చెందిన నాగమణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. తరుణ్‌కుమార్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమైన తర్వాత అదే వీధిలో మరో ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. రెండోసారి గర్భవతి కావడంతో మూడునెలల క్రితం నందిగామలోని పుట్టింటికి ఆమె వెళ్లింది. నాగమణి పుట్టింటికి వెళ్లడంతో భర్త తన దగ్గరకు చూసేందుకు రావడం తగ్గిపోయిందని, ఇంటిదగ్గర కూడా ఉండటం లేదని తెలుసుకున్న ఆమె భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని గురువారం అత్తింటికి వెళ్లి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం ఎస్సై రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె భర్త తరుణ్‌కుమార్ బందరురోడ్డులోని ఒక హాస్టల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చికాకులను భరించలేక హాస్టల్లో ఉండాల్సి వచ్చిందని తరుణ్‌కుమార్ చెబుతున్నాడు. దీంతో ఎస్సై ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో వివాదం సద్దుమణిగింది. -
నాలుగో పెళ్లికి రెడీ..
ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఓప్రభుద్ధుడు నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఏవేవో కారణాలు చెప్పి ఇద్దరు భార్యలకు విడాకులిచ్చాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇతగాడి బాగోతం తెలుసుకున్న మూడో భార్య.. ఆదివారంనగరంలోని భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు దిగింది. హైదరాబాద్, లింగోజిగూడ: ముగ్గురిని పెళ్లి చేసుకుని 4వ పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న మూడో భార్య.. భర్త ఇంటి ముందు ఆదివారం నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాలు,కాలనీ వాసులు తెలిపిన మేరకు.. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌కాలనీ రోడ్ నెం–7లో నివాసముండే శ్రీనివాస్ యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతనికి ఇద్దరు మహిళలతో పెళ్లి జరుగగా విడాకులు తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణం శ్రీరమణకాలనీకి చెందిన అనూష అనే మహిళను పెద్దల సమక్షంలో మే 23, 2014న పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అనూష కుటుంబీకులు శ్రీనివాస్‌కు రూ. 5 లక్షలతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలను కట్న కానుకల కింద ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపించారు. రెండు సంవత్సరాల పాటు కాపురం సాపీగా సాగగా ఆ తరువాత అనూషకు వేధింపులు మొదలయ్యాయి. అత్తగారింటి వేధింపులకు తట్టుకోలేక కొంత కాలం నుంచి అనూష పుట్టింటి వద్దే ఉంటోంది. 4వ పెళ్లికి సిద్ధపడ్డాడని తెలిసి... గతంలో జరిగిన పెళ్లిళ్లను దాచి అనూషను పెళ్లి చేసుకుని ఈమెను కూడా వదిలించుకోవడానికి విడాకుల నోటీసులు పంపించాడు. అంతేగాకుండా ఈ నెల 25న మరో మహిళతో 4వ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుని అనూష ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం భాగ్యనగర్ కాలనీలో అత్తగారింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన అనూష అక్కడే నిరసన దీక్ష చేపట్టింది. అత్త, భర్త, ఆడపడుచు, ఆమె భర్త చిత్ర హింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఏడడుగులు వేసి ఏలుకోనంటున్నాడు
ప్రేమిస్తున్నా అన్నాడు. జీవితాంతం తోడుంటా అని నమ్మించాడు. అతడే సర్వస్వం అనుకున్న యువతి అయినవారందరినీ విడిచి ఏడడుగులు నడిచింది. ఏడాదిలోగా పరిస్థితి తారుమారైంది. జీవితాంతం తోడుంటానని చెప్పిన భర్త.. గర్భిణి అన్న కనికరం లేకుండా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. అండగా నిలవాల్సిన అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ పట్టెడన్నం పెట్టేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించి సాయం చేస్తున్న వారిని కూడా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విర్రవీగిపోతున్న వీరి ఆగడాలను ఇన్నాళ్లూ మౌనంగా భరిస్తూ వస్తున్న ఆమె.. న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టింది. వేడుకుంటోంది. అండగా నిలిచిన మహిళల సాయంతో కార్యాలయాలను ముట్టడించింది. బూర్జ : తనకు న్యాయం చేయాలని మండలంలోని అల్లెన గ్రామానికి చెందిన గంటా ధనలక్ష్మి బూర్జ జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని బూర్జ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన తెలిపింది. వెలుగు కార్యాలయం వద్ద విప్ కూన రవికుమార్ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిసి.. అక్కడకు వెళ్లి ఆయన వాహనాన్ని అడ్డుకుంది. మహిళలు, ప్రజా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా నిలవడంతో వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగు కార్యాలయంలోకి విప్ వెళ్లిపోయారు. విప్ బయటకు రావాలని అంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన బయటకు రాకపోవడంతో.. భర్త ఆగడాలను వివరించింది. ‘మీ మద్దతే ఉందని నా భర్త హెచ్చరిస్తున్నాడు’ అంటూ నిలదీసింది. తనకేమీ సంబంధం లేదని, భర్త ఇంట్లో ఉండేలా చేస్తానని విప్ హామీ ఇచ్చారు. తర్వాత సమస్య సీఎం ఆదాంకు తెలపాలని సూచించారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా.. ఫలితం లేకపోయిందని విలపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వివక్ష.. వేధింపులు గంటా ధనలక్ష్మిది బూర్జ మండలంలోని జీబీపురం. తండ్రి చిన్నారావు రోజువారీ కూలీ. అమ్మ లీలావతితో కలసి ఆమె పలు ఇళ్లలో పనిచేస్తుండేది. జీబీపురం పక్కనే ఉన్న అల్లెన గ్రామానికి చెందిన బొత్స రాంబాబుతో ఆమెకు 2015లో పరిచయమైంది. రాంబాబు తండ్రి సింహాద్రి గ్రామంలో వీఆర్ఏగా ఉండేవారు, తల్లి చిన్నమ్మడు టీడీపీ మాజీ ఎంపీటీసీ. పరిచయం స్నేహంగా మారి ప్రేమ చిగురించింది. 2017 ఏప్రిల్ 21న ధనలక్ష్మికి నిశ్చితార్థం చేసేందుకు నిర్ణయించగా.. 20వ తేదీ రాంబాబుతో కలసి ఇంటినుంచి వెళ్లిపోయింది. ఏప్రిల్ 22న ఆమదాలవలస వెంకటేశ్వర ఆలయంలో కొంతమంది పెద్దల సాయంతో వీరు పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి రసీదును పెద్దలకు అందజేశారు. అనంతరం భర్తతో కలసి గుంటూరు వెళ్లిపోయింది. తర్వాత సంతకవిటి మండలం ఎస్.రంగారాయపురంలోని అక్క ఇంటికి ధనలక్ష్మి, అల్లెనలోని ఇంటికి రాంబాబు వెళ్లిపోయారు. కొద్ది కాలం తర్వాత ఆమెను కూడా అల్లెనకు తీసుకెళ్లాడు. ఇప్పుడు నాలుగు నెలల నుంచి తనను ఇంట్లోకి రానివ్వకుండా బయట శాలలో పెట్టి, వేరే పళ్లెంలో భోజనం పెడుతూ.. వివక్ష చూపుతున్నారని ధనలక్ష్మి వాపోయింది. ఈ నెల 4వ తేదీన ఆమదాలవలస సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో సీఐ ఆదాం రాంబాబుపై కేసు నమోదుచేశారని వివరించింది. అప్పటికీ న్యాయం జరగలేదని, కేసు పెట్టిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని కన్నీరుమున్నీరయింది. అత్తమామలతో పాటు వారి బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. ఇరుగు పొరుగువారు భోజనాలు పెడుతుంటే వారిని దుర్భాషలాడుతున్నారని, చివరికి రామమందిరం వద్ద తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విలపించింది. తనకు విప్ కూన రవికుమార్ మద్దతు ఉందని రాంబాబు బెదిరిస్తున్నాడని వాపోయింది. దీంతో న్యాయం పోరాటం చేస్తున్నానని తెలిపింది ఆరు నెలల గర్భిణి అయిన ధనలక్ష్మి న్యాయం కోసం పోరాడుతున్న విషయం తెలుసుకున్న అల్లెన, గంగా భగీరథపురం, ఇతర గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో బూర్జ చేరుకుని మద్దతుగా నిలిచారు. ధనలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇందులో సిటు మహిళా నాయకులు ఈశ్వరమ్మతోపాటు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. దీంతో రాంబాబుపై గతంలో నమోదైన కేసులో రాంబాబును బుధవారం అరెస్టు చేస్తున్నట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు. -
ప్రేమించానని.. పెళ్లాడి..మోసగించాడు
ఖమ్మంఅర్బన్ : ప్రేమించానంటూ వెంటబడ్డాడు. మాయమాటలు చెప్పాడు. చివరికి పెళ్లాడాడు. మూడు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడు వెళ్లిపొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, న్యాయం కోసం అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె తెలిపిన వివరాలు... నగరంలోని పాండురంగాపురం ప్రాంతానికి చెందిన బాలాజీ, హైదరాబాద్‌లోని నాచారం విద్యుత్ శాఖలో ప్రయివేటు ఉద్యోగిగా (మీటర్ రీడింగ్ ఆపరేటర్‌గా) పనిచేస్తున్నాడు. నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(22)తో అతడికి పరిచయమేర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కొన్ని రోజులపాటు స్వాతి నిరాకరించింది. ఆ తరువాత అతడి మాయమాటలు నమ్మింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో, గత ఏడాది అక్టోబర్ 2న జడ్చర్లలోని ఆర్య సమాజ్‌లో బాలాజీ–స్వాతి పెళ్లి చేసుకున్నారు పాండురంగాపురంలోని తన ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాడు. మూడు నెలల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి భర్త, అత్త, మామ, మరిది వేధింపులు మొదలయ్యాయి. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పైసా కట్నం రాలేదని, పైగా కులాంతర వివాహమని ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఐదు నెలలపాటు ఇవన్నీ భరించింది. ‘‘బాలాజీకి మరో పెళ్లి చేస్తాం. నువ్వు ఒప్పుకోవాలి’’ అంటూ వేధించసాగారు. ఆమె భరించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వాతిని, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు ఆమె తల్లి తీసుకెళ్లింది. అక్కడ ఆమె ప్రస్తుతం కోలుకుంది. ఆదివారం పాండురంగాపురం వచ్చింది. ఆమెను అత్త, మామ కలిసి బలవంతంగా ఇంటి బయటకు గెంటేశారు. ఇంటికి, గేటుకు తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. స్వాతి, సోమవారం ఉదయం నుంచి తన భర్త ఇంటి గేటు ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, తన భర్తతో కాపురం సజావుగా సాగేలా చూడాలని కోరుకుంటోంది. ఆమెకు మహిళాసంఘాలు బాసటగా నిలిచాయి. స్వాతి భర్త బాలాజీని, అతడి కుటుంబీకులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఐ నాగేంద్రాచారి తెలిపారు. -
భార్యను వదిలి విదేశాలకు చెక్కేశాడు
-
వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి..
సాక్షి, హన్మకొండ : జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు భార్యను వదిలి విదేశాలకు వెళ్లాడు. నాలుగేళ్లుగా పట్టించుకోకపోవడంతో బాధితురాలు అత్తింటి ఎదుట కొద్ది రోజులుగా ఆందోళనకు దిగింది. బాధితురాల కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన సొంటి కళావతి, మధుసూదన్‌రెడ్డి దంపతుల కూతురు తనుశ్రీని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లికి చెందిన చాడ శోభ, రాఘవేందర్‌రెడ్డి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. తనుశ్రీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో తల్లే అన్నీ తానై కూతురు వివాహం చేసింది. వివాహ సమయంలో రూ.20లక్షల కట్నం, 50తులాల బంగారం, మరో రూ.10లక్షలు వివాహ ఖర్చు ఇచ్చారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వివాహమై నెల రోజుల తర్వాత శ్రావణ్‌కుమార్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లిపోయాడు. వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి నాలుగేళ్లుగా పట్టించుకోవడంలేదు. ఆ తర్వాత భర్తతో ఫోన్లో మాట్లాడినా ఏడాది కాలంగా ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ఆమె పేర్కొంది. అత్తా, మామలు శోభ, రాఘవేందర్‌రెడ్డి హన్మకొండ నక్కలగుట్ట వివేక్‌నగర్‌లో నివసిస్తున్నారు. తనను భర్త వదిలేయడంతో తరుచూ అత్తింటి ఎదుట తరుచూ బైఠాయించి న్యాయం చేయాలని కోరుతోంది. నాలుగు రోజులుగా బైఠాయించి ఆందోళన చేస్తున్నా ఎవరూ రావడంలేదని తెలిపింది. కొద్ది రోజుల క్రితం తనను అత్తమామ, బావ జీవన్‌రెడ్డి (భర్త సోదరుడు) కొట్టి, రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి పంపించారని పేర్కొంది. ఇప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని రోదించింది. తాను హైదరాబాద్ సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని వివరించింది. తనకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని కోరుతోంది. -
భర్త ఇంటి ముందు బైఠాయింపు
దాచేపల్లి(గురజాల): కాపురానికి తీసుకువెళ్లాలంటూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన దాచేపల్లి మండలం కేసానుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుదె వెంకటేశ్వర్లు ఇంటి ముందు ఆయన భార్య ఈశ్వరమ్మ ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బైఠాయించారు. ఇరవై ఏళ్ల కిందట కేసానుపల్లికి చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల నుంచి ఈశ్వరమ్మ తండ్రి వద్ద ఉంటోంది. పలుమార్లు భార్యాభర్తల మధ్య రాజీ కోసం పంచాయితీలు కూడా జరిగాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకు భర్త, పిల్లలు కావాలంటూ ఈశ్వరమ్మ భర్త ఇంటి వద్దకు వచ్చింది. లోపలకు వచ్చేందుకు భర్తతో పాటు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నాయకురాలు లంకె శాంతితో పాటు పలువురు ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు. ఈశ్వరమ్మను కాపురానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనను ఇంట్లోకి వెళ్లేందుకు భర్తతో పాటు అత్తమామలు అడ్డుకుంటున్నారని, పిల్లల నుంచి తనను వేరు చేయాలని చూస్తున్నారని ఈశ్వరమ్మ ఆరోపించింది. దీనిపై భర్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై ఈశ్వరమ్మ పెట్టిన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోందని, తేలిన తరువాత దీనిపై మాట్లాడతానని చెప్పారు. -
పాప పుట్టింది.. అంతే జాడ లేకుండా పోయాడు
తూర్పుగోదావరి ,తోకాడ (రాజానగరం): ప్రేమించాడు .. పెళ్లి చేసుకున్నాడు .. కాపురం పెట్టాడు.. ఒక పాప పుట్టింది.. అంతే జాడ లేకుండా పోయాడు. అలా ఓ మగాడి మాయలోపడి మోసపోయిన వివాహిత తన బిడ్డకు తండ్రి కావాలని, తన భర్తను అప్పగించాలని కోరుతూ అత్తింటి ఎదుట చంటి బిడ్డతో నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన పలు మహిళా సంఘాల సభ్యులు మద్దతుగా నిలిచారు. బాధితురాలు సూరిశెట్టి సుమలత తెలిపిన వివరాల ప్రకారం సీతానగరం మండలం, పురుషోత్తపట్నానికి చెందిన సుమలత రాజమహేంద్రవరంలో నర్సింగ్ చదువుతుండగా గైట్ కళాశాలలో డిప్లమా చేస్తున్న తోకాడకు చెందిన గండి çసత్యశివకుమార్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా వర్థిల్లింది. వారిద్దరూ రెండేళ్లు అలా ప్రేమించుకుంటూ ఎన్నో బాసలు చేసుకున్నారు. సుమలత బీసీ (వాడబలిజ), శివకుమార్ ఓసీ (కాపు) సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు అంగీకరించరని 2016 జూన్ 25న తంటికొండలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ రహస్యాన్ని కొనసాగిస్తూ రాజమహేంద్రవరంలో ఐఎల్టీడీ వద్ద అంబికానగర్‌లో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. వారికి ఒక పాప పుట్టింది. అంతే.. ఆ తర్వాత శివకుమార్ ఇంటికి రావడం మానేశాడు. భర్త కోసం రెండు నెలలు నిరీక్షించిన సుమలత పాప పుట్టిన విషయాన్ని తోకాడలోని అతని తల్లిదండ్రులైన గండి వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిలకు ఫోన్ చేసి చెప్పింది. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో తన తల్లిదండ్రులతో తోకాడ వచ్చి గ్రామ సర్పంచ్‌ను కలుసుకుని జరిగిన విషయాన్ని తెలియజేసింది. అక్కడ నుండి అత్తింటికి వెళ్లింది. అయితే వారు ఆమెను ఇంటిలోకి రానీయకపోగా నీవెవరు? నీ కులం ఏమిటి? అంటూ దుర్భాషలాడారు. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు శివకుమార్‌ను తీసుకుని అతని తల్లిదండ్రులు సీతానగరం వచ్చి, పెద్దల్లో పెట్టారు. అప్పుడు శివకుమార్ వింతగా ప్రవర్తిస్తూ ‘ఈ పాప నాకు పుట్టింది కాదు. నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు. నీవెవరో నాకు తెలియదు. నీతో ఉంటే చచ్చిపోతా’నంటూ పరుగు తీశాడు. అతని వెనుకనే వెంట వచ్చిన వారు కూడా వెళ్లిపోయారని సుమలత తెలిపింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని జాడ లేదు. ఆ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని మహిళా మండలి సభ్యులను సుమలత సంప్రదించింది. వారి సాయంతో గురువారం తోకాడలోని అత్తింటికి వచ్చింది. ఉదయం 10 గంటలకు వస్తే లోపలకు కూడా రానీయకుండా, నానా దుర్భాషలాడుతూ ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్నారని సుమలత తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె పేర్కొంది. ‘నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు భయం లేదు. నీవు ఏమీ చేయలేవు’ అని అత్తింటివారు బెదిరిస్తున్నారని సుమలత వాపోయింది. తన భర్త ఎక్కడికీ పోలేదని, కాకినాడలో వాళ్ల బంధువుల ఇంట ఉన్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. మా పరువు తీశాడు.. అందుకే వెదకడం లేదు ‘మా పరువు పోయేవిధంగా వ్యవహరించాడు కాబట్టే మా అబ్బాయి ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోయినా పట్టించుకోలేదు’ అని శివకుమార్ తల్లి వెంకటలక్ష్మి వివరణ ఇచ్చారు. వాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఆ రోజు సీతానగరంలో పెద్దల్లో పెట్టాం రండి అంటే వెళ్లాం. అక్కడ నుంచి వెళ్లిపోయిన మా అబ్బాయి ఇప్పటికీ తిరిగి రాలేదు. పోలీసు ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ అమ్మాయి, మా వాడు పెళ్లి చేసుకున్నట్టు కూడా మాకు తెలియదు. ఈ అమ్మాయే కొన్ని ఫొటోలు ఫేస్ బుక్‌లో పెట్టడంతో వాళ్లు వీళ్లు వచ్చి అడగడంతో తెలిసింది. అప్పటికే మా అబ్బాయి మా నుంచి వెళ్లిపోయాడు.’ అని ఆమె తెలిపారు. ‘ ఈ అమ్మాయికి అప్పటికే ఒకసారి పెళ్లి అయింది. పెళ్లి కానట్టు నటించి మా అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చేసింది’ అని శివకుమార్ తల్లి ఆరోపించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు సుమలతకు న్యాయం జరిగేవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ఆమెకు మద్దతుగా వెంట వచ్చిన మహిళా సంఘాల సభ్యులు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ పోరాట సంఘాల ప్రతినిధులు డోనుపాటి అనంతలక్ష్మి, టి. దుర్గ, ఎస్. రామలక్ష్మి, ఎం. జయలక్ష్మి, విజయశాంతి, తాటి లక్ష్మి, యండమూరి మేరి, తదితరులు సమలత పోరాటానికి మద్దతుగా నిలిచారు. -
భర్త ఇంటి ఎదుట భార్య మౌనపోరాటం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : తన ఇద్దరు కూతుళ్లతో ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇంట్లోకి రాకుండా తాళం వేసి ఎటో వెళ్లిపోయాడంటూ బాధితురాలు రెండు రోజులుగా ఇంటి ఎదుట మౌనపోరాటం కొనసాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా దాసారం గ్రామానికి చెందిన జయకిషన్(63) విశ్రాంత ప్రొఫెసర్. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బొబ్బరలంక వాసి లక్ష్మీచైతన్య(37)తో రెండో వివాహం చేసుకున్నాడు. లక్ష్మీచైతన్య మొదటి భర్త మృతి చెందగా.. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి దేవాలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకుని చిన్నగోల్కొండలో కాపురముంటున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల నుంచి జయకిషన్ చిన్న చిన్న కారణాలతో లక్ష్మీని వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కూతుళ్లు తనకు పుట్టలేదని, వారి పోషణ బాధ్యత నాది కాదంటూ గొడవలకు దిగేవాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల కిందట తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బొబ్బరలంక వెళ్లిన లక్ష్మీ శనివారం తిరిగి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో ఇంటి పరసరాలను పరిశీలిస్తుండగా.. దొడ్డి దారి నుంచి తన భర్త ఇంటి బయటకు వచ్చి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఇంటి బయట ఇద్దరు కూతుళ్లతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, ఇద్దరు కూతుళ్లు భవిష్యతు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తుంది. తనకు రూ.10 లక్షలు ఇచ్చి వదిలించుకోవడానికి చూస్తున్నాడని, లాయర్ల ద్వారా ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు సాయంత్రం ఆమె శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తకు కౌన్సిలింగ్ కోసం ఫ్యామిలీ కోర్టుకు సిఫార్సు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
చంపేస్తానని బెదిరింపులు
ప్రకాశం, బుచ్చిరెడ్డిపాళెం: ఇంటి ముందు బైఠాయిస్తే చంపేస్తానని, వెళ్లిపోవాలని తన భర్త ప్రసాద్‌రెడ్డి, అత్తమామలు బెదిరిస్తున్నారని భార్య రాధ వాపోయింది. మూడో రోజు బుధవారం నిరసనలో ఆమె మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది. తన జీవితాన్ని ప్రసాద్‌రెడ్డి నాశనం చేశాడని, ఎలా బతకాలని కన్నీరుమున్నీరుగా విలపించింది. మూడు రోజులుగా నిరసన చేపడుతున్నానని, తనకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది. రాధకు మద్దతుగా సంగం మండలం జెండాదిబ్బ నేతలు నిరసనలో కూర్చున్నారు. రాధకు న్యాయం చేయాలని వారు కోరారు. -
పిల్లలు పుట్టలేదని తలాక్
నంద్యాల: పిల్లలు పుట్టలేదని వేధించడమే కాకుండా తలాక్ చెప్పి అన్యాయం చేసిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాయిబాబానగర్‌కు చెందిన సయ్యద్‌హుసేన్, బిజాన్బీ కుమారుడు అలీ మిర్జాన్తో ఇదే కాలనీకి చెందిన షేక్జలీల్, తస్మీన్ల కూతురు షేక్ సల్మాతో 2014లో వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా రూ.5లక్షలు నగదు, 20తులాల బంగారు, 4లక్షల ఇంటి సామగ్రి, కట్నం కింద ఇచ్చారు. పెళ్లి అయిన 4సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని అత్తామామ, భర్త, ఆడపడుచులు వేధిస్తూ వచ్చారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆరునెలల క్రితం సల్మా పుట్టింటికి వెళ్లింది. ఈ విషయంపై ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఫిర్యాదు చేసినా భర్త బంధువులు ఎవరూ హాజరు కాలేదు. అంతేగాకుండా ఆలీమిర్జాను భార్య షేక్సల్మాకు లాయర్ ద్వారా తలాక్ చెబుతూ నోటీసు పంపారు. తన అనుమతి లేకుండా తలాక్ ఎలా ఇస్తారని భార్య వాపోయినా భర్త పట్టించుకోలేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, బాధితురాలు ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా షేక్‌సల్మా విలేకరులతో మాట్లాడుతూ తన భర్త, ఆడపడుచు అనునిత్యం వేధిస్తూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. అధికారులుస్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సల్మాపై అత్త, అడపడచుల దాడి... సోమవారం ఉదయం నుంచి భర్త ఇంటి వద్ద ధర్నా చేస్తున్న షేక్సల్మాపై అత్త, ఆడపడచు దాడి చేశారు. ఈ దాడిలో సల్మాకు తీవ్రగాయాలయ్యా లు కాగా స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్త బీజాన్బీ, ఆడపడచు యాస్మిన్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ హరినాథరెడ్డి తెలిపారు. -
నేను సచ్చినంక ఇస్తరా..
కరీంనగర్‌సిటీ : సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రధానంగా డబుల్బెడ్రూంల మంజూరు, భూ సమస్యలు, ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా అర్జీలు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా గత సోమవారం కంటే వంద అర్జీలు తగ్గాయి. 121 మంది బాధితులు దరఖాస్తులను అధికారులకు విన్నవించారు. ఎండల తీవ్రతతో జనం బయటికి రాలేకపోతున్నారు. బాధితుల నుంచి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ బద్రి శ్రీనివాస్, డీఆర్వో అయేషా మస్రత్‌ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్‌లు అర్జీలు స్వీకరించారు. ఎండ.. అధికారుల ఎఫెక్ట్ ప్రజావాణికి ఎండతోపాటు జిల్లా అధికారులు కానరాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏసీల ఎఫెక్టో.. ఏమోనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం ప్రజావాణికి జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. తమ శాఖల్లోని కిందిస్థాయి అధికారులను ప్రజావాణికి పంపించి ప్రజాసమస్యలపై తమ శ్రద్ధ ఏంటో స్పష్టం చేశారు. కొంత మంది టూర్లు అని ప్రజావాణికి ఎగనామం పెట్టారు. కొంతమంది జిల్లా అధికారులు మాత్రమే తమ చిత్తశుద్ధిని కనబరిచారు. అందులో ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారు. ఇక ఖాళీ కుర్చీల స్థానంలో అక్కడికి వచ్చిన బాధితులతో సీట్లు నిండుగా దర్శనమిచ్చాయి. కలెక్టర్ పదేపదే చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా భర్త మనసు మార్చండి.. నాకు రెండేళ్ల క్రితం శంకరపట్నం మండలం ఆముదాలపల్లి వాసి అయిన రాజేశ్‌తో కట్నకానుకల లాంచనలాలతో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం స్వగ్రామంలో కాకుండా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నాం. వివాహం జరిగిన 8 నెలలే కలిసి ఉన్నాం. నాకు ఒక బాబు పుట్టాడు. భర్త మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషులకు విన్నవించినా వారి మాటవినకుండా టార్చర్ చేశాడు. 3 నెలల నుంచి బాబును, నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను పుట్టింటి నుంచి తీసుకెళ్లడం లేదు. నా భర్త, ఆడపడుచు, అత్తగార్లను పోలీసుల ద్వారా పిలిపించి కౌన్సెలింగ్ చేయించి నా కాపురాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని వేడుకుంటున్నా. - ఎర్ర రిషిత, కాపువాడ కరీంనగర్ నేను సచ్చినంక ఇస్తరా.. నాకు ఎనబై ఏళ్లు దాటినయి. శాతనైతలేదు. నా తల్లి పేరు మీద నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. రెండేళ్లుగా ప్రజావాణిని ఆశ్రయిస్తున్నా. ఇప్పటివరకు 103 దరఖాస్తులు సమర్పించుకున్నా. గ్రామంలో 32 గుంటల నా భూమిని కబ్జా చేశారని, కబ్జాదారులు భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు దాడి కూడా చేశారంటూ అధికారులకు విన్నవించాను. ప్రస్తుతం నగరంలో ఓ అద్దె నివాసంలో ఉంటూ ప్రతినెలా వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవి స్తున్నాను. ఈ అధికారుల తీరుతోటి కలెక్టరేట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాను. వెయ్యి రూపాయల పెన్షన్‌తో అద్దె ఇంట్లో బతుకుతున్న. ఇల్లు కిరాయి కూడా ఎళ్తలేదు. పనిచేయడానికి కూడా చాతనైతలేదు. కోర్టుల చుట్టూ తిరిగి పోరాడే శక్తి లేదు. కలెక్టరేట్‌కు వస్తే తొందరపడకు వస్త ది అంటుండ్రు. ఇంకెప్పుడస్తది.. నేను సచ్చినంక వస్తదా!! హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో 714 సర్వే నంబర్లోని 32 గుంటల భూమిని ఇప్పించి న్యాయం చేయాలి. - కన్నం వెంకటయ్య, రాంపూర్, హుజూరాబాద్ -
భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష
నల్లబెల్లి(నర్సంపేట): నవమాసాలు మోసి కన్న కొడుకులను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట బంధువులు, మహిళలతో కలిసి మండుటెండలో బైఠాయించి భార్య ఆందోళన కొనసాగిస్తున్న సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకొంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని నందిగామ గ్రామానికి గోరంటాల వెంకటేశ్వర్లుకు ఆత్మకూర్ మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన కందకట్ల లక్ష్మణమూర్తి దంపతులకు చెందిన కుమార్తె లలితను ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరి దాంపత్య జీవితంలో రుషీ, రుకేష్ అనే కవల పిల్లలు జన్మించారు. ఇన్నాళ్లు వారి దాం పత్య జీవితం సజావుగానే సాగిన రెండేళ్ల క్రితం కుటుం బంలో గొడవలు తలెత్తాయి. దీంతో లలితను భర్త వెంకటేశ్వర్లు పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా పిల్లల కోసం భర్త ఇంటికి వచ్చిన లలితను ఇంట్లోకి రానివ్వకుండా తాళాలు వేసుకొని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో ఆమెతో పాటు బంధువులు, మహిళా సం ఘాల సభ్యులు, గ్రామస్తులు వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట బైఠాయించి రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పిల్ల లను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తా్తమని ఆమె తె లిపింది. కాగా ఎస్సై హరికృష్ణ పిల్లలను అప్పగించే బాధ్య తమాదని చెప్పిన అలాగే దీక్ష కొనసాగిస్తామంది. -
‘నా భర్త మనసు మారాలి.. కాపురానికి తీసుకువెళ్లాలి’
అమలాపురం టౌన్ : ‘‘నా భర్త యన్నం వెంకటేశ్వర్లు (అమలాపురం సీటీవో) మనసు మారాలి.. నన్ను కాపురానికి తీసుకు వెళ్లాలి’’ అనే నినాదాలతోపాటు.. ఆయన తన మెడలో తాళి కడుతున్న ఫొటో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ భార్య అంకమ్మ నిరసనకు దిగింది. అమలాపురంలో తన భర్త పని చేస్తున్న కార్యాలయం ముందే.. తన తండ్రి నూకకోటి మాచర్లయ్య, తల్లి రమణమ్మ, అన్నయ్య బాలకృష్ణతో కలసి సోమవారం మండుటెండలో నడి రోడ్డుపై ధర్నా చేసింది. సీటీవో వెంకటేశ్వర్లు తనను గత ఏడాది మార్చి 5న ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని లక్ష్మీనరసింహ ఆలయంలో వివాహం చేసుకున్నారని అంకమ్మ నాటి పెళ్లి ఫొటోలు చూపించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చౌటుపాలేనికి చెందిన అంకమ్మకు, అదే జిల్లా బద్వీడు చర్లోపల్లికి చెందిన సీటీవో వెంకటేశ్వర్లుకు వివాహమైంది. ప్రభుత్వాధికారినైనా గౌరవంగా ఉండే సాధారణ కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి, తన కుమార్తెను ఆదర్శ భావాలతో పెళ్లి చేసుకున్నారని అంకమ్మ తండ్రి మాచర్లయ్య విలేకర్లకు తెలిపారు. నెల రోజుల కాపురం తరువాత తనను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా పలుమార్లు తమకు కౌన్సెలింగ్ కూడా చేశారని చెప్పారు. రాజకీయ, అధికార పలుకుబడితో కేసులు లేకుండా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారని బాధితురాలి తల్లి రమణమ్మ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీటీవో కార్యాలయంలోకి వెళ్లి ఆయన ఫోన్ నంబరు తీసుకున్నారు. అంకమ్మ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించి అక్కడ విచారణ జరిపారు. అనంతరం తాము జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి నేరుగా ఫిర్యాదు చేస్తామని బాధితురాలి అన్నయ్య బాలకృష్ణ చెప్పారు. అక్కడి నుంచి ఆ కుటుంబం ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాకినాడ వెళ్లింది. దీనిపై సీటీవో వెంకటేశ్వర్లును వివరణ కోరేందుకు విలేకర్లు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోనుకు కూడా స్పందించలేదు. విడిపోయేందుకు నా భార్యే నోటీసు ఇచ్చింది : సీటీవోతనతో సంసారం చేయడానికి ఇష్టం లేదని.. తాను వేరేగా ఉండడానికి మెయింటెనెన్స్(భరణం) ఇవ్వాల్సిందిగా తనకు తన భార్య ఈనెల మూడో తేదీన లీగల్ నోటీసు ఇచ్చిందని అమలాపురం సీటీవో వై.వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు దాకా వెళుతున్న క్రమంలో పరిష్కారాన్ని అలా కోరుకుంటూ మరో పక్క తనను ఇబ్బంది పెట్టేలా.. తన హోదాకు భంగం కలిగేలా తన కార్యాలయం ముందు ధర్నా చేయడం ఎంత వరకు సమంజసమని సీటీవో ప్రశ్నించారు. ఉదయం నుంచి అందుబాటులో లేని సీటీవో జరిగిన ఘటనపై సాయంత్రం లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. -
ఏడో భార్యని వదిలించుకునేందుకు యత్నం
యలమంచిలి: న్యాయం కోసం మరోసారి ఆ ఇల్లాలు రోడ్డెక్కింది. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువులో గురువారం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రామానికి చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఇప్పటివరకూ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గ్రామస్తులకు తెలిసి రెండు, తెలియకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడో భార్య దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన లక్ష్మిని గతేడాది గర్భిణిగా ఉన్నప్పుడు వదిలించుకోవడానికి యత్నించాడు. దీంతో ఆమె సంఘ పెద్దల సాయంతో భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో అప్పట్లో సంచలనమైంది. దీంతో సంఘ పెద్దల చొరవతో పుట్టే బిడ్డకు అరెకరం పొలం, రూ.లక్ష నగదు, ఇంటిలో వాటా ఇచ్చేందుకు ఆంజనేయులు అంగీకరించాడు. అయితే పొలం రాశాడు కానీ నగదు, ఇల్లు ఇవ్వలేదు. ఈ ఏడాది కాలంలో భార్యను వదిలించుకోవడానికి అనేకసార్లు యత్నించినా ఆమె సంఘ పెద్దల సాయంతో నెట్టుకొచ్చింది. దీంతో అతను రెండు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో లక్ష్మి తల్లిని తోడుగా తెచ్చుకుని భర్త మొదటి భార్య కుమారుల పేరిట ఉన్న ఐదెకరాల భూమిని అప్పు చేసి సాగు చేసుకుంది. ఇటీవలే కోత కూడా కోయించింది. ఇప్పుడు మరో నాటకం పంట చేతికి వచ్చిందని తెలుసుకున్న ఆంజనేయులు బుధవారం తన చెల్లి చంద్రావతి, మేనల్లుళ్లు జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు), గుబ్బల కోటేశ్వరరావును పొలం పంపి కట్టేత కట్టించడానికి పూనుకున్నాడు. ఉదయం పొలం వెళ్లిన లక్ష్మి వారిని చూసి నిలదీయగా.. మా మావయ్య పొలం నువ్వెవరు అడగడానికి అని ఎదురుతిరగడంతో బిత్తరపోయిన లక్ష్మి వారిని వారించే యత్నం చేయడంతో వారు ముగ్గురూ కలసి లక్ష్మిని చితకబాది వెళ్లిపోయారు. గాయాలతో గ్రామంలోకి వచ్చిన లక్ష్మి సంఘ పెద్దలకు జరిగిన విషయం తెలిపింది. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. కొంచెం తేరుకోవడంతో గురువారం ఇంటికి వచ్చి ఆందోళన చేపట్టింది. సంఘ పెద్దల సహకారంతో విలేకరులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా పొలం విషయంలో సంఘ పెద్దలు అడ్డు వస్తారని ముందుగానే ఊహించిన ఆంజనేయులు తొమ్మిది మంది పెద్దలు మామిడిశెట్టి పెద్దిరాజు, గుబ్బల జయరాజు, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి ఏసుబాబు, బండి చంద్రవాసు, దొంగ వెంకటరమణ, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి వెంకట రామలక్ష్మి, పిల్లి పద్మావతిలకు కోర్టు నుంచి నోటీసులు ఇచ్చాడు. దీనిపై సంఘ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భర్త ఇంటి ముందు భార్య దీక్ష
సోన్(నిర్మల్): భర్త కుటుంభ సభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు ఐద్వా సంఘం ఆధ్వర్యంలో మంళవారం భార్య బైటాయించింది. ఈ ఘటన మండలంలోని కడ్తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్మ శరణ్య, కొండ్ర రామకృష్ణ గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసం సోన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు ప్రేమ జంటను అప్పగించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడారు. శరణ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకురాలు మేఘన, సుజాత ఉన్నారు. -
‘నా భర్త నాకు కావాలి’
రేగిడి: నా భర్త నాకు కావాలి.. నా జీవితం నా భర్తతోనే కొనసాగేటట్టు మీరంతా సహకరించాలి.. అలాకాకుంటే నాకు దిక్కులేదంటూ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు ధనలక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఎదుట వాపోయింది. కెంబూరు ధనలక్ష్మిది ఇదే మండలం కొర్లవలస గ్రామం. 2016 ఏప్రిల్‌లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు వాసుదేవనాయుడుతో వివాహం జరిగింది. ఏడాదిపాటు సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఈమెకు భర్తతో పాటు అత్తమామలు, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని ఈ నెల 22న రేగిడి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేసిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేశారు. ధనలక్ష్మి ఇంతటితో ఆగకుండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేసింది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ కొయ్యాన శ్రీవాణితో పాటు జిల్లా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వై.హిమబిందు, డీవీసీ కౌన్సిలర్ కె.నిర్మలతో పాటు రాజాం సీడీపీఓ కె.వసుందరాదేవి లక్ష్మీపురం గ్రామం గురువారం వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలు ధనలక్ష్మి కమిషన్ సభ్యులు ఎదుట తమ గోడును వెల్లబుచ్చారు. వివాహం చేసుకున్న తర్వాత తాను చాలా కష్టాలు అనుభవిస్తున్నానని, తనకు భర్త నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సంతోషం లేకుండా పోతుందని, తనను భర్త చక్కగా చూసుకుంటే జీవితాంతం హాయిగా ఉంటానని కన్నీటి పర్యంతమైంది. తర్వాత రాష్ట్ర కమిషన్ మెంబర్ శ్రీవాణి ధనలక్ష్మి అత్తమామల వాదన విన్నారు. ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడును పిలిపించాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో అందుబాటులో లేడని చెప్పారు. దీంతో ఈ విషయంపై శ్రీవాణి మాట్లాడుతూ అమ్మాయికి అవగాహన తక్కువ కావడంతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సరిపెట్టుకోవాలి. అమ్మాయిని వదిలించుకోవడానికే తప్ప భార్యాభర్తలను ఒక్కటి చేసేందుకు కుటుంబ సభ్యులు సహకరించడంలేదన్నది స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి భార్యాభర్తలను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని, ఇద్దరికీ నచ్చజెప్పి జీవితం సాఫీగా నడిచేలా చూస్తామన్నారు. వీరితో పాటు అంగన్వాడీ సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ తదితరులు ఉన్నారు. -
న్యాయం కోసం.. భార్య ఆందోళన
ముషీరాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట బైటాయించిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు, ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన శంకర్, యమున దంపతుల కుమార్తె స్వప్న (హాస్య)కు రాంనగర్ ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన వెంకటేష్, అనసూయల కుమారుడు విజయ్‌కుమార్‌తో 2015 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 5లక్షలు కట్నం ఇచ్చారు. రెండు నెలల్లోనే విజయకుమార్ తరచూ భార్యను వేధించేవాడు. అయినా ఏడాది పాటు అక్కడే ఉన్నట్లు స్వప్న తెలిపింది. పద్మారావునగర్‌లో వేరు కాపురం పెట్టించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని చెప్పి తనను పుట్టింటికి పంపించాడన్నారు. అయితే ఉద్యోగం చేయకపోగా తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లలేదని, దీంతో ఝాన్సీ బజార్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. అయితే తనకు తెలియకుండానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో లీగల్ అథారిటీ వాలంటీర్ పద్మ, గీతలతో కలిసి సోమవారం రాత్రి అత్తగారింటికి రాగా, ఆమె రాకను గమనించి అత్తామామ, బావ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటిముందే బైటాయించింది. ముషీరాబాద్ ఎస్ఐ సాయికుమార్ బాధితురాలితో పాటు, ఆమె భర్తను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చర్చించారు. తనకు భర్తే కావాలని స్వప్న కోరుతుండగా, తనకు వద్దని విజయ్‌కుమార్ చెప్పినట్లు సమాచారం. -
నమ్మించి.. మోసం చేశాడు
కడప రూరల్ : నమ్మించి వివాహం చేసుకున్న తరువాత తన భర్త తనను మోసగించాడని కడప నగరానికి చెందిన ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్ల బోసుకున్నారు. స్థానిక ఒక హాస్పిటల్లో చెన్నూరుకు చెందిన యు. రవికుమార్ కాంపౌండర్‌గా, తాను స్వీపర్‌గా పని చేస్తుండే వారిమని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నామని చెప్పారు. తరువాత అతను తనను వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు 18 నెలల కుమారుడు ఉన్నాడని తెలిపారు. ఈ విషయమై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. అనంతరం ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాసులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డెన్న మాట్లాడుతూ గిరిజన మహిళకు అన్యాయం జరగడం దారుణమన్నారు. న్యాయం కోసం కలెక్టర్ బాబూరావునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించామని వివరించారు. ఈశ్వరమ్మకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత దీక్ష విజయవంతం
ధర్మవరంటౌన్:భర్త కోసం మెట్టినింటి ఎదుట భార్య చేపట్టిన దీక్ష విజయవంతమైంది. ప్రజాసంఘాలు, పోలీసుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో అత్తింటి వారు మెట్టుదిగి వచ్చారు. కోడలిని ఇంట్లోకి ఆహ్వానించారు. వివరాల్లోకెళితే.. ధర్మవరంలోని చంద్రబాబునగర్‌లో నివాసం ఉంటున్న పోలా వెంకటరంగనాయకులు, పోలా పుష్పావతి దంపతుల కాపురంలో కలతలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అయితే తన భర్త తనకు కావాలంటూ పుష్పావతి అత్తింటి ఎదుట మూడు రోజుల కిందట మౌనదీక్ష చేపట్టింది. తొలి రెండు రోజులు అత్తింటి వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మహిళా సంఘాలు, ఐసీడీఎస్ అధికారులు నచ్చజెప్పినా వినలేదు. మూడో రోజు ఆదివారం సీపీఐ నాయకులు, మహిళా సంఘం సభ్యులు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం సభ్యులు పుష్పావతి అత్తమామలతో చర్చించారు. చివరకు పోలీసులు కూడా తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అత్తమామలు, భర్త మనసు కరిగి.. పుష్పావతిని ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరించా రు. ఇక నుంచి భార్యను చక్కగా చూసుకుంటానని భర్త మీడియా సమక్షంలో తెలిపారు. తన పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పుష్పావతి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జింకా చలపతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, పట్టణ ప్రధాన కార్యదర్శికాంతమ్మ, గంగాదేవి, మహేశ్వరి, సీపీఐ అనుబంధ మహిళా విభాగం సభ్యులు పద్మావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నా భర్తను తెచ్చివ్వండి
కోలారు: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త అత్తమామలు వారి పాలిట విలన్లుగా మారి చిచ్చుపెట్టారు. తన భర్తను వెదికి ఇవ్వాలని కోరుతూ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం సాయంత్రం నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు ప్రతిఘటన నిర్వహించింది. తాలూకాలోని వక్కలేరి గ్రామానికి చెందిన అంబిక ఇలా నిరసన చేపట్టింది. తన మామ తన భర్తకు వేరే పెళ్లి చేసి తనకు దూరంగా ఉంచారని, తనకు, పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని బాధితురాలు విలపించింది. న్యాయం కోసం గత 8 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించింది. వక్కలేరి గ్రామానికి చెందిన మనోహర్, తాను గత 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని అత్తమామలు వ్యతిరేకించడంతో తాము వేరే కాపురం పెట్టామని చెప్పింది. తన భర్తకు తాగుడు మాన్పిస్తామని తెలిపి తననుంచి నెలల తరబడి దూరం చేశారని ప్రస్తుతం తన మామ తన భర్తకు వేరే వివాహం చేసి తన నుంచి దూరం చేశారని ఆరోపించింది. గత 8 రోజుల క్రితమే రూరల్ స్టేషన్లో తన భర్తను వెతికి ఇవ్వాలని ప్రతిఘటన నిర్వహించినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నానని తెలిపింది. తన భర్తకు తనపై లేనిపోని చాడీలు చెప్పి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలు కలిగిన తాను భర్తను వీడి ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించింది. తనకు భర్తను తెచ్చివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తన మామ రిటైర్డు ఏఎస్సై కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
ఆస్థి కోసం..కొడుకు మృతదేహాన్ని
లక్ష్మీపురం(గుంటూరు) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 13న ఆత్మహత్య చేసుకుని కొడుకు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోకి ససేమిరా రానీయమంటూ తలుపులు వేసుకున్నారు. దీంతో రెండు రోజులుగా భర్త మృతదేహంతో భార్య అత్తింటి ముందు బైఠాయించింది. వివరాల్లోకి వెళితే... స్థానిక కోబాల్డ్‌పేట 4వలైనుకు చెందిన షేక్ అల్లాబక్షు (41) ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా అల్లాబక్షు ఆస్థిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలంటూ తల్లి హుస్సేన్‌బీని అడుగుతున్నాడు. ఈక్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లాబక్షు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 12న తల్లితో వాగ్వివాదానికి దిగడంతో ఆస్తులు పంచేందుకు నిరాకరించింది. మనస్థాపానికి గురైన అల్లాబక్షు ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం అనంతరం భార్య హసీనా ఈనెల 14న భర్త మృతదేహాన్ని అత్త ఇంటికి ఖననం చేసేందుకు తీసుకెళ్లింది. మాతో ఘర్షణలకు పాల్పడి తనువు చాలించాడనడం సరికాదని, అందుకు నీవే బాధ్యురాలివంటూ కోడలు హుస్సేన్‌బీని మృతుడి తల్లి దుర్బాషలాడింది. కొడుకే మృతి చెందాక ఇక తనకు ఎవరూ అవసరం లేదంటూ తల్లి, ఇతర కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా తలుపులు వేసుకున్నారు. గత్యంతరం లేని స్థితిలో హసీనా రెండు రోజులుగా భర్త మృతదేహంతో అత్త ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించింది. దిక్కుతోచని హసీనా మృతదేహంతో నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. దీన్ని గమనించిన స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని అల్లాబక్షు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులను పట్టాభిపురం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం స్థానికుల సహాయంతో మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. -
కోడలు అని చూడకుండా పచ్చి బూతులు..
-
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేసిన ఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బి.పుష్పంకుమార్ తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా జీవనం సాగించటంతో పాటు విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు వెళ్లారు. కేసు కోర్టులో ఉండగా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యాభర్తల బంధువుల మధ్య వాగ్వాదం జరగటంతో విజయలక్ష్మీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
భర్త ఇంటిముందు భార్య నిరసన
శ్రీకాకుళం , కాశీబుగ్గ: భార్యా భర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నా.. పోలీసులు, కుల పెద్దలు, కుటుంబసభ్యులు వీటిని పరిష్కరించకపోవడంతో భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపారు. పలాస పట్టణంలో కొత్తకోట జ్యోత్స్న తన పిల్లలతో భర్త జగన్ ఇంటి ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇది వరకు అత్తమామలు ఇంటి ముందు నిరసన తెలిపినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు బాధితురాలి ఇంటికి చేరుకుని సమస్య పరిష్కరించారు. -
భర్తే కావాలి
శ్రీకాకుళం, కాశీబుగ్గ: భర్త ఇంటి ముందు ఓ భార్య నిరసన తెలిపింది. తనకు భర్త కావాలంటూ ఆందోళన చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధం కారణంగా, తనను వరకట్నం వేధింపులకు గురిచేస్తూ ఇంటినుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. పోలీసులు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సంఘటన పలాసలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కాశీబుగ్గకు చెందిన జ్యోత్స్ననకు పలాసకు చెందిన కొత్తకోట జగన్‌తో నాలుగున్నరేళ్ల క్రితం వివాహామైంది. పెళ్లి సమయంలో జ్యోత్స్న తల్లిదండ్రులు 10 తులాల బంగారంతో పాటు సారెతో అత్తవారింటికి సాగనంపారు. తర్వాత పండగలకు పబ్బాలకు తమ కుమార్తెకు సుమారు ఐదు తులాల బంగారం అందించారు. అయితే పెళ్లైన ఆరు మాసాలు వరకు భర్త జగన్, అత్తమామలు కొత్తకోట విశ్వేశ్వరరావు, సుజాతలు, ఆడపడుచు మంగ తనను బాగా చూసుకున్నారని బాధితురాలు జోత్స్న తెలిపారు. తర్వాత తన భర్త జగన్‌కు పూండిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం ఉండడంతో తనను వేధించడం మొదలు పెట్టాడని ఆరోపించారు. అప్పుడప్పుడు రాత్రివేళ ఇంటికి వచ్చేవాడు కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వరకట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని ఆవేదన చెందారు. తన వద్ద ఉన్న బంగారం అంతా వారు తీసుకొని తనను ఇంటినుంచి బయటకు గెంటివేశారని పేర్కొన్నారు. వారి వేధింపులు భరించలేక చిన్న పిల్లలతో కలిసి సుమారు 9 నెలల కిందట తన పుట్టింటికి వెళ్లిపోయినట్టు చెప్పారు. అయితే తన భర్త తనకు కావాలని కాశీబుగ్గ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశానని తెలిపారు. అటు నుంచి అటే నేరుగా భర్త ఇంటికి వెళ్లానన్నారు. ఇంటికి చేరుకోగానే అత్తమామలు, ఆడపడుచు తలుపులు వేసి పొమ్మన్నారని తెలిపారు. దీంతో ఇంటి ముందు పిల్లలతో కలిసి బైటాయించి నిరసన తెలిపినట్టు చెప్పారు. ఆకలితో చిన్నారులు ఏడ్చుతున్నా తలుపులు తీయలేదని ఆవేదన చెందారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారని, వారు తన అత్తమామలు, ఆడపడుచుకు నచ్చచెప్పినా తలుపులు తీయడంలేదన్నారు. అదనపు కట్నం కావాలో! లేక నన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారో! అర్ధంకావడం లేదని, తనకు మాత్రం భర్తేకావాలి పట్టుబట్టి భర్త ఇంటిముందు నిరసన తెలిపింది. తన పాప భాష్యకు మూడున్నరేళ్లు ఉంటాయని కాశీబుగ్గ లిటిల్కిడ్స్లో ఎల్కేజీ చదువుతోందని, బాబు ఠాగూర్‌కు ఒకటిన్నర ఏళ్లు నిండాయని జోత్స్న తెలిపారు. తన తల్లిదండ్రులు పేదవారని, తండ్రికి గుండె సమస్యతో అనారోగ్యం పాలయ్యారని, ఆయన ఆరోగ్య రీత్యా ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్లి యున్నారని ఆవేదన చెందింది. -
బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు
-
బిర్యానీ వండటం రాదన్న సాకుతో...
సాక్షి, వరంగల్: బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత. వివరాలు... వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి ఖాజిపేట దర్గాకు చెందిన మానస అనే యువతితో 2016 నవంబరులో వివాహం జరిగింది. సుమారు రూ. 7 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్ళైన రెండు నెలలకే బిర్యానీ వండట్లేదని గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్లగొట్టాడని బాధితురాలు మానస తెలిపింది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రాజేంద్రప్రసాద్ రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడని, అత్త, ఆడపడుచు సైతం తిట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 10 నెలలు గడిచినా భర్త తీసుకెళ్లడానికి రాకపోవడంతో ఆవేదనకు గురైన మానస తన తల్లి తండ్రులతో కలిసి భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేవరకు తన భర్త ఇంటి ముందు నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. మానస ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విషయం ఆరా తీశారు. -
భర్త ఇంటి ముందు భార్య నిరసన
కాశీబుగ్గ: తనకు న్యాయం చేయాలని భర్త ఇంటిముందు ఓ భార్య దీక్ష చేసింది. పెళ్లైన పదేళ్ల తర్వాత తనను దూరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టింది. బాబు పుట్టి చనిపోయిన తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. దళితురాలివని, అదనపు కట్నం తేవాలని ఇంటి నుంచి నెట్టేయడంతో పెద్దమనుషులతో కలిసి పోరు బాట సాగిస్తోంది. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ పట్టణంలో సంచలనమయింది. దీనికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. కాశీబుగ్గలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక భాగంలో ఉంటున్న కింతలి యోగేశ్వరరావు(శ్రీను)కు రాధమ్మకు వివాహం(రిజిష్టర్ మ్యారేజ్) జరిగింది. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్లు కాపురం అనంతరం యోగేశ్వరరావు తనను పట్టించుకోవడంలేదని భార్య కింతల రాధమ్మ భర్త ఇంటి ముందు దీక్ష చేసింది. తల్లిదండ్రులు, బంధువులు, పెద్దమనుషులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిసింది. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ కులాలకు అతీతంగా ప్రేమించానని, రిజిష్టర్ మ్యారేజ్ ద్వారా ఒక్కటైయ్యామన్నారు. తల్లి, అన్నయ్య మాటలు విని భర్త యోగేశ్వరరావు నన్ను ఇంటినుంచి బయటకు గెంటివేశాడని వాపోయింది. అద్దె ఇల్లు తీయించి, అద్దెలు కాని భత్యం కాని వేయడంలేదని కంటతడి పెట్టింది. మా ఇద్దరి కాపురంలో బాబు పుట్టి చనిపోయాడని, అప్పటినుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని ఇంటినుంచి నెట్టేశారని వాపోయింది. నన్ను విడిచి వేరే మహిళతో యోగేశ్వరరావు ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు, పెద్ద మనుషులతో కలిసి ఇంటికి వస్తే, దళితురాలివని పేరు పెట్టి నన్ను వెళ్లగొట్టారని, దీంతో చేసేది లేక తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్నట్టు వాపోయింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు సంఘటన స్థలానికి వచ్చి బాధితురాలిని సముదాయించి, న్యాయం చేస్తామని తెలిపారు. రాధమ్మకు సంఘీభావంగా ఎంఆర్పీఎస్ జిల్లా, రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్‌మాదిగ, దాసరి తిరుమల మాదిగ, సంబాన రామారావు, పొట్నూరు భాస్కరరావు మాదిగ, మీల జోగారావు మాదిగ, ఉర్నాన అప్పలరాజు, కుమరాన భారతి మాదిగ, చెరుకుపల్లి నరసింహాలు తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. -
భర్త ఇంటి ముందు నవ వధువు ఆందోళన
సాక్షి, తాడ్వాయి: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి కూలాంతర వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్నాడంటూ.. ఓ నవ వధువు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మంగ రజిత(22)ను ఇదే పంచాయతి పరిధిలోని కామారం గూడానికి చెందిన బిక్షపతి(25) ప్రేమించుకున్నారు. బిక్షపతి యాదవ కులానికి చెందిన వాడు కాగా.. రజిత దళిత యువతి. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినా పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. రెండు నెలలు కాపురం చేసిన అనంతరం నువ్వు తక్కువ కులం దానివి.. నాకు నీ అవసరం లేదంటూ బిక్షపతి.. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎటు పోవాలో దిక్కుతోచక స్థితిలో రజిత భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఆమెకు స్థానిక మహిళా సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు. -
చెప్పాపెట్టకుండా అమెరికా చెక్కేశాడు
భద్రాద్రి కొత్తగూడెం: ఆడపిల్ల పుట్టిందని ఆలిని వదిలేసి విదేశాలకు వెళ్లిన భర్త ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది. తన కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు దీక్ష చేస్తోంది. బూర్గంపాడు మండలం సారపాక తాళ్ల గొమ్మూరు గ్రామానికి చెందిన కర్రి ఫణికుమార్‌కు మనివితతో వివాహమైంది. ఏడాది పాటు హాయిగా సాగిన వారి కాపురంలో కూతురు పుట్టడంతో కలహాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు పెరిగాయి. ఫణికుమార్ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నుంచి కూడా గెంటేశారు. తనను వదిలేసి ఫణికుమార్ అమెరికా వెళ్లినట్లు తెలుసుకున్న బాధితురాలు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తల్లిదండ్రులు, కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు నిరసన చేస్తోంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలనని.. తన భర్తను ఎలాగైన తిరిగి ఇండియాకు రప్పించాలని ఉన్నతాధికారులను కోరుతోంది.