వివాహితను పెళ్లి చేసుకుని.. మరో పెళ్లికి సిద్ధం..!! | Wife Protest At Husband House Against Divorce Proposal In Parkal District | Sakshi
Sakshi News home page

వివాహితను పెళ్లి చేసుకుని.. మరో పెళ్లికి సిద్ధం..!!

Published Sun, Jan 27 2019 10:09 AM | Last Updated on Sun, Jan 27 2019 10:58 AM

Wife Protest At Husband House Against Divorce Proposal In Parkal District - Sakshi

బాధిత మహిళను తీసుకెళ్తున్న పోలీసులు .. ఇన్‌సెట్లో హసీనాతో నితీష్‌ 

పరకాల: భర్త నుంచి విడాకులు తీసుకున్న తనకు తోడుంటానని వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకొని..కూతురు పుట్టాక మరోపెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ ఓ మహిళ తనను మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన పరకాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని బాధితురాలిని పరకాల పోలీసుస్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం...  పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లె కాలనీకి చెందిన రాయబారపు నితీష్‌ సికింద్రాబాద్‌లో ప్రైవేటు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ గొడవలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన  హసీనాతో పరిచయం ఏర్పడింది.  

అప్పటి నుంచి  తనకు  తన వెంటపడుతుండగా మొదట నిరాకరించిన హసీనా నాలుగేళ్ల క్రితం ఒప్పుకుంది. పిల్లలు వద్దంటూ పుట్టిన కూతురును విక్రయించే ప్రయత్నం నితీష్‌ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2018 నవంబర్‌ 23న హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత కోపం పెంచుకున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో మరోపెళ్లికి సిద్ధపడుతూ తనకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ శనివారం మధ్యాహ్నం నితీష్‌ ఇంటి ఎదుట బైఠాయించింది.

బాధితురాలి ఆందోళనపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా వెళితే న్యాయం జరుగుతుంది తప్పా ఆందోళనతో సమస్య పరిష్కారం కాదంటూ నచ్చజెప్పి పంపారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బాధితురాలు హసీనా తెలిపింది. యువకుడి తల్లిదండ్రులు రూ.2లక్షల ఇస్తాం తమ కొడుకు నుంచి  దూరంగానే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కోంది. పెళ్లి చేసుకున్న ఆధారాలను మాయం చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని..నితీష్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement