కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట బైఠాయించిన మాధవి
మిర్యాలగూడ టౌన్ (నల్గొండ జిల్లా): భర్త ఇంటి ఎదుట భార్య నిరసన వ్యక్తం చేసిన సంఘటన మంగళవారం పట్టణంలోని నందిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన మారోజు రామాచారి, కలమ్మ దంపతుల కుమార్తె మాధవిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు గ్రామానికి చెందిన బసవోజు రామ్మూర్తి, తిరుపతమ్మల కుమారుడు సురేష్‌కి ఇచ్చి 2015లో వివాహం చేశారు.
వీరి కాపురం కొంతకాలం సాఫీగానే సాగింది. కాగా మాధవి మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా ప్లేట్లేట్స్ తగ్గడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని తన తల్లిగారింటికి వెళ్లిన మాధవిని అప్పటి నుంచి భర్త తీసుకెళ్లలేదు.
ఈ విషయంపై అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, చివరికి మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాకపోవడంతో తన ఏడేళ్ల కుమార్తె డింపుల్‌రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. కాగా సురేష్ తల్లి తిరుపతమ్మ దీనిపై స్పందిస్తూ.. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మాధవి తన తల్లిగారింటికి వెళ్లి తిరిగి రాలేదని, అనేక సార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగిందని అననారు. విడాకుల కోసం ఐదేళ్ల క్రితమే కోర్టులో కేసు వేశామని, ఈ విషయం కోర్టుపరిధిలో ఉన్నందున కోర్టులోనే తెల్చుకుంటామని పేర్కొంది.
చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
Comments
Please login to add a commentAdd a comment