
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురంలోని సాహెబ్‌నగర్‌లో ఓ భార్య భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఫరూక్ అలీ అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఏడాదిన్నర క్రితం తనను మతాంతర వివాహం చేసుకున్నాడని బాధితురాలు దుర్గ ఆరోపిస్తోంది. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ప్రేమ పేరుతో మోసం చేసి బంగారం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ విషయమై మొదటి భార్యకు చెబితే ఫరూక్‌ను ఇంట్లో బంధించి.. తనను తీవ్రంగా కొట్టినట్లు చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగానని బాధితురాలు తెలిపింది. అయితే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని తన భర్త ఫరూక్ అలీతో ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
చదవండి: ('48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్ షేర్ చేస్తా')
Comments
Please login to add a commentAdd a comment