
న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న లాస్య, ఆమె తల్లిదండ్రులు
సాక్షి, మంచిర్యాలక్రైం: జీవితాంతం నీ తోడు వీడనం టూ వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్త ఆమె ను మోసం చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకొని మొదటిì భార్యను ఇంట్లోంచి వెళ్లగొట్టిన ఓ ప్రబుద్ధుడి నిర్వాకం జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. భర్త మోసాన్ని భరించలేని సదరు మహిళ పెద్దలను ఆశ్రయించింది. అయినా న్యాయం జరగలేదు. మొక్కవోని దైర్యంతో కోర్టు మెట్లెక్కిది. ఏడాది పాటు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూనే ఉంది. కోర్టులో జాప్యం అవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో భర్త ఇంటి ఎదుట తల్లిదండ్రులు, కూతురుతో కలిసి న్యాయపోరాటానికి దిగింది. బాధితురాలు లాస్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
జమ్మికుంటకు చెందిన కట్కోజుల రాజమౌళి కూతురు లాస్యకు మంచిర్యాలకు చెందిన గజ్జెల శివశంకర్‌తో 2014 డిసెంబర్12న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4లక్షల కట్నం ముట్టజెప్పారు. ఏడాదిన్నరపాటు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కూతు రు పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు అదనంగా రూ.2లక్షల కట్నం తేవాలంటూ ఆమెను వేదింపులకు గురి చే శారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూ డా నిర్వహించారు.
అయినా ఆమెకు న్యాయం జరుగలేదు. ఈ క్రమంలో అతడు మరో యువతిని రెండో పెళ్లి చేసుకోవడంతో తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ లాస్య జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో 2017 జూన్ 6న ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో భర్తతో పాటు అత్తామామ, ఆడబిడ్డలతో కలిపి 9మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాదిన్నరగా లాస్య కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. నేటికి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఎట్టకేలకు శుక్రవారం శివశంకర్ ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు న్యాయపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రమౌళి, ఎస్సై ఓంకార్‌యాదవ్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రెండోపెళ్లి చేసుకున్న శివశంకర్..
భార్యను, కన్న కూతురిని కాదని శివశంకర్ 2016లో హన్మకొండకు చెందిన బెజ్జాల నాగలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, లాస్యతో వివాహానికి ముందు నుంచే నాగలక్ష్మితో అక్రమ సంబంధం ఉన్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో విడాకులకైనా సిద్ధమే కాని నాగలక్ష్మిని మాత్రం వదిలి పెట్టనని శివశంకర్ చెప్పడంతో, దిక్కుతోచక న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు బాధితురాలు రోదిస్తూ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment