మహిళకు రెండేళ్ల జైలు శిక్ష
హొసపేటె: మొదటి భర్త ఉండగానే అతనిని వదిలేసి మరో పెళ్లి చేసుకున్న కేసులో మహిళకు జేఎంఎఫ్‌సీ కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. దేవిక అనే మహిళకు 2008 మార్చి 21న సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014 ఫిబ్రవరి 25న బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఆలహళ్లి గ్రామానికి చెందిన అంబరీష్ ను రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో పెళ్లి చేసుకుంది. దీంతో తనను మోసం చేసిందని మొదటి భర్త టీబీ డ్యాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైం ఎస్‌ఐ స్వామి కేసు దర్యాప్తు చేసి నిందితురాలిపై విచారణ జరిపి చార్జిషిటును దాఖలు చేశారు. హొసపేటెలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ సాగుతోంది. మంగళవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అశోక్.. నిందితురాలు దేవికకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. పీపీ రేవణ్ణ సిద్దప్ప వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment