
తమిళనాడు ,అన్నానగర్: సిరువలూర్ సమీపంలో భార్యకు అబార్షన్ చేసి రెండో పెళ్లికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోడ్ జిల్లా, సిరువలూర్ సమీపం కుల్లనాయక్కనూర్ కాలనీకి చెందిన కృష్ణన్ గోపాల్ (29) పట్టభద్రుడు. కామరాజ్ నగర్‌కి చెందిన నిత్యా (28)తో కళాశాలలో బీఎడ్ చదివేటప్పుడు ప్రేమలో పడ్డాడు. 2015 అక్టోబర్ 19న రిజిస్టర్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా వారివారి ఇళ్లల్లో ఉంటున్నారు.
నిత్యా బంధువులు ఒప్పుకోకపోవడం వల్ల ఆరు నెలలముందు కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. పెరుందురై, కందమ్‌పాలైయమ్ విభాగ ప్రాంతంలో రెండు నెలలు జీవించారు. నిత్యా ఆరు నెలల గర్భవతి. గత 16వ తేదీ వ్యాపార విషయంగా కృష్ణన్‌గోపాల్ బయటకి వెళ్లాడు. అప్పుడు నిత్యాని ఆమె తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. ఆమెకి అబార్షన్ చేసి కరూర్‌లో మరో పెళ్లికి పురమాయించారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యని రక్షించి, కలపాలని, అబార్షన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఈరోడ్ అదనపు ఎస్పీ పొన్ కార్తికుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment