
హత్యకు గురైన వర్ష , పక్కన ఆమె భర్త
చెన్నై: తమిళనాడులోని మధురైలో పట్టపగలు నడురోడ్డుపై యువతి హత్యకు గురైంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తే హెల్మెట్ ధరించి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు.. మధురైలోని సౌత్‌గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన మీనాక్షి సుందరం చిన్న కుమార్తె వర్ష (19) కీరైత్తురైకు చెందిన పళని(25)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.
కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలన్నర క్రితం వర్ష పుట్టింటికి వచ్చింది. పళని రావాలని కోరినా నిరాకరించింది. శుక్రవారం మధ్యాహ్నం వర్ష సప్పాని కోవిల్ వీధిలో ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి వెళుతోంది. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన పళని ఆమెతో మాట్లాడేందుకు యతి్నంచాడు. ఆమె వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు.
వర్షను చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సౌత్ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పళనిగా గుర్తించారు. ఈ క్రమంలో పళని కీరైత్తురై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.
చదవండి: అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి!
Comments
Please login to add a commentAdd a comment