
టీ.నగర్: భార్యాభర్తల గొడవను ఆపేందుకు యత్నించిన వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒరత్తనాడు పుదూరుకు చెందిన రాజేంద్రన్ (60) ప్రైవేట్ మిల్లులో పనిచేస్తున్నారు. అతనితోపాటు అమ్మాపేటకు చెందిన సూసైరాజ్ పనిచేస్తున్నారు. ఇలావుండగా సోమవారం రాత్రి మిల్లులో సూసైరాజ్, అతని భార్య మధ్య గొడవ జరిగింది. వారికి సర్దిచెప్పేందుకు రాజేంద్రన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో రాజేంద్రన్, సూసైరాజ్ గొడవ పడ్డారు. ఆగ్రహించిన సూసైరాజ్ కత్తితో రాజేంద్రన్‌పై దాడి చేశాడు. సంఘటనా స్థలంలోనే రాజేంద్రన్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఒరత్తనాడు పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సూసైరాజ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
చదవండి: కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment