
భర్త ప్రియురాలి ఎంటి ఎదుట బైఠాయించిన వాసంతి
కుషాయిగూడ: తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా అతని భార్యకు రెండ్ హ్యాడెండ్‌గా దొరికిపోయిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె రాకను గమనించిన వారు అక్కడ నుంచి పారిపోగా తనకు న్యాయం చేయాలని భర్త ప్రియురాలి ఇంటి ఎదుటే ఆందోళనకు పూనుకుంది. వివరాల్లోకి వెలితే.. కీసరకు చెందిన వాసంతి, లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు సంతానం. సోనీయాగాంధీనగర్‌కు చెందిన చేపలు అమ్మే మహిళతో లక్ష్మన్‌కు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
కొంత కాలంగా అతడి వైఖరిని గమనిస్తున్న భార్య వాసంతి మంగళవారం సోనీయాగాంధీనగర్‌లో సదరు మహిళ ఇంట్లో ఇద్దరు కలిసి ఉండగా పట్టుకుంది. భార్య రాకను పసిగట్టిన లక్ష్మన్, ప్రియురాలితో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వాసంతి తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళ ఇంటి ఎదుట బైఠాయించింది. దీంతోపోలీసులు అక్కడకు చేరుకొని ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లారు.