హుజూరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం తప్పించుకు తిరుగుతున్న భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్‌లో సోమవారం వెలుగుచూసింది.
వివరాలు..మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన తోట వైశాలి(23) హైదరాబాద్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్‌కు చెందిన క్రాంతికుమార్ కూడా నగరంలో ఉంటూ అగ్రికల్చర్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో.. ఎనిమిది నెలల క్రితం ఇద్దరు కుటుంబసభ్యులకు చెప్పకుండా జగద్గిరిగుట్టలో రహస్య వివాహం చేసుకున్నారు.
కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు రేగాయి. దీంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్రాంతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేయాలని యత్నించిన స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అనుమానించిన వైశాలి సోమవారం అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగింది. విషయం గుర్తించిన క్రాంతి తల్లిదండ్రులు రూ. 10 లక్షలు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని బెదిరించారు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది.
ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం.. భార్య ధర్నా
Published Mon, Dec 5 2016 2:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
Advertisement
Advertisement