పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ
కర్నూలు, డోన్ టౌన్: కట్టుకున్న భర్త నుంచి తనకు, కుమారునికి న్యాయం చేయడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట లక్ష్మిదేవి అనే మహిళ బుధవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. వివరాలు.. పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన లక్ష్మిదేవి రంగన్న కుమార్తె అయిన అక్ష్మిదేవిని ఆనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు ఇచ్చి 12ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడున్నాడు. అయితే కొంత కాలంగా అదనపు కట్నం తేవాలంటూ వేధించడమే గాకుండా భార్య వదిలి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వెతికి తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పంచాయితీలో రాజీ చేసుకొని భార్య లక్ష్మిదేవికి రూ.3లక్షలు చెల్లించేలా ఒప్పందం చేశారు. అయితే కుంటుంబంతో ఉండకుండా, ఒప్పందం చేసుకున్న మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే పోలీసులు స్పందించకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ విషయంపై పట్టణ పోలీసులను వివరణ కోరగా ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచా రం తమ వద్ద లేదని చెప్పారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పకుందం చేసుకున్నదానికి తమకు సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment