
భద్రాద్రి కొత్తగూడెం: ఆడపిల్ల పుట్టిందని ఆలిని వదిలేసి విదేశాలకు వెళ్లిన భర్త ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది. తన కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు దీక్ష చేస్తోంది. బూర్గంపాడు మండలం సారపాక తాళ్ల గొమ్మూరు గ్రామానికి చెందిన కర్రి ఫణికుమార్‌కు మనివితతో వివాహమైంది. ఏడాది పాటు హాయిగా సాగిన వారి కాపురంలో కూతురు పుట్టడంతో కలహాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు పెరిగాయి. ఫణికుమార్ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నుంచి కూడా గెంటేశారు.
తనను వదిలేసి ఫణికుమార్ అమెరికా వెళ్లినట్లు తెలుసుకున్న బాధితురాలు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తల్లిదండ్రులు, కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు నిరసన చేస్తోంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలనని.. తన భర్తను ఎలాగైన తిరిగి ఇండియాకు రప్పించాలని ఉన్నతాధికారులను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment