
సంతబొమ్మాళి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పెద్దలకు తెలియకుండా కాపురం కూడా పెట్టాడు.. పాపపుట్టిందని ముఖం చాటేశాడొక ఘనుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని నర్సాపురం పంచాయతీ పరిధి యర్నాగులపేట గ్రామానికి చెందిన యర్నాగుల అరవింద్, విశాఖపట్నానికి చెందిన వానపల్లి శ్రావణికి రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. విశాఖపట్నంలో కాపురం కూడా పెట్టాడు. రెండు వారాల క్రితం వీరికి పాప పుట్టింది.
ఆడపిల్ల పుట్టిందని తన ఇంట్లో అంగీకరించని చెప్పి అరవింద్ భార్య శ్రావణితో గొడవపడి వెళ్లిపోయాడు. ఎప్పటికీ రాకపోవటంతో అరవింద్ ఇంటి వద్దకు చేరుకున్న శ్రావణికి అక్కడ కూడా చుక్కెదురైంది. నీవెవరో తెలిదని, తమకు సంబంధం లేదని అరవింద్ తల్లి తేల్చిచెప్పింది. దీంతో చేసేదిలేక అక్కడే దీక్షకు దిగింది బాధితురాలు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ కామేశ్వరరావు శ్రావణిని స్టేషన్‌కు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామపెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని అరవింద్ కుటుంబ సభ్యుల హామీతో ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment