తండ్రితో కలిసి భర్త ఇంటి వద్ద ధర్నా చేస్తున్న షేక్‌సల్మా
నంద్యాల: పిల్లలు పుట్టలేదని వేధించడమే కాకుండా తలాక్ చెప్పి అన్యాయం చేసిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాయిబాబానగర్‌కు చెందిన సయ్యద్‌హుసేన్, బిజాన్‌బీ కుమారుడు అలీ మిర్జాన్‌తో ఇదే కాలనీకి చెందిన షేక్‌జలీల్, తస్మీన్‌ల కూతురు షేక్ సల్మాతో 2014లో వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా రూ.5లక్షలు నగదు, 20తులాల బంగారు, 4లక్షల ఇంటి సామగ్రి, కట్నం కింద ఇచ్చారు. పెళ్లి అయిన 4సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని అత్తామామ, భర్త, ఆడపడుచులు వేధిస్తూ వచ్చారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆరునెలల క్రితం సల్మా పుట్టింటికి వెళ్లింది.
ఈ విషయంపై ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఫిర్యాదు చేసినా భర్త బంధువులు ఎవరూ హాజరు కాలేదు. అంతేగాకుండా ఆలీమిర్జాను భార్య షేక్‌సల్మాకు లాయర్ ద్వారా తలాక్ చెబుతూ నోటీసు పంపారు. తన అనుమతి లేకుండా తలాక్ ఎలా ఇస్తారని భార్య వాపోయినా భర్త పట్టించుకోలేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, బాధితురాలు ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా షేక్‌సల్మా విలేకరులతో మాట్లాడుతూ తన భర్త, ఆడపడుచు అనునిత్యం వేధిస్తూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. అధికారులుస్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
సల్మాపై అత్త, అడపడచుల దాడి...
సోమవారం ఉదయం నుంచి భర్త ఇంటి వద్ద ధర్నా చేస్తున్న షేక్‌సల్మాపై అత్త, ఆడపడచు దాడి చేశారు. ఈ దాడిలో సల్మాకు తీవ్రగాయాలయ్యా లు కాగా స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్త బీజాన్‌బీ, ఆడపడచు యాస్మిన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌ఐ హరినాథరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment