
భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న లలిత, బంధువులు
నల్లబెల్లి(నర్సంపేట): నవమాసాలు మోసి కన్న కొడుకులను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట బంధువులు, మహిళలతో కలిసి మండుటెండలో బైఠాయించి భార్య ఆందోళన కొనసాగిస్తున్న సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకొంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని నందిగామ గ్రామానికి గోరంటాల వెంకటేశ్వర్లుకు ఆత్మకూర్ మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన కందకట్ల లక్ష్మణమూర్తి దంపతులకు చెందిన కుమార్తె లలితను ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు.
వీరి దాంపత్య జీవితంలో రుషీ, రుకేష్ అనే కవల పిల్లలు జన్మించారు. ఇన్నాళ్లు వారి దాం పత్య జీవితం సజావుగానే సాగిన రెండేళ్ల క్రితం కుటుం బంలో గొడవలు తలెత్తాయి. దీంతో లలితను భర్త వెంకటేశ్వర్లు పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా పిల్లల కోసం భర్త ఇంటికి వచ్చిన లలితను ఇంట్లోకి రానివ్వకుండా తాళాలు వేసుకొని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో ఆమెతో పాటు బంధువులు, మహిళా సం ఘాల సభ్యులు, గ్రామస్తులు వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట బైఠాయించి రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పిల్ల లను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తా్తమని ఆమె తె లిపింది. కాగా ఎస్సై హరికృష్ణ పిల్లలను అప్పగించే బాధ్య తమాదని చెప్పిన అలాగే దీక్ష కొనసాగిస్తామంది.
Comments
Please login to add a commentAdd a comment