
ప్రసాద్‌రెడ్డి ఇంటి వద్ద బైఠాయించిన రాధ, కుటుంబసభ్యులు
ప్రకాశం, బుచ్చిరెడ్డిపాళెం: ఇంటి ముందు బైఠాయిస్తే చంపేస్తానని, వెళ్లిపోవాలని తన భర్త ప్రసాద్‌రెడ్డి, అత్తమామలు బెదిరిస్తున్నారని భార్య రాధ వాపోయింది. మూడో రోజు బుధవారం నిరసనలో ఆమె మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది. తన జీవితాన్ని ప్రసాద్‌రెడ్డి నాశనం చేశాడని, ఎలా బతకాలని కన్నీరుమున్నీరుగా విలపించింది. మూడు రోజులుగా నిరసన చేపడుతున్నానని, తనకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది. రాధకు మద్దతుగా సంగం మండలం జెండాదిబ్బ నేతలు నిరసనలో కూర్చున్నారు. రాధకు న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment