
నిరసన వ్యక్తం చేస్తున్న విజయ
కొండమల్లేపల్లి (దేవరకొండ) : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను.. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన మాచర్ల విజయ అదే గ్రామానికి చెందిన పిరాటి శంకర్‌లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ 27న నల్లగొండలోని ఛాయాసోమేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజల పాటు హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో స్వగ్రామానికి శంకర్ తిరిగొచ్చాడు.
అప్పటి నుంచి తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఇదేంటని ప్రశ్నిస్తే తమ కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని శంకర్ విజయకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన విజయ దేవరకొండ పోలీసులను ఆశ్రయించగా శంకర్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ శంకర్ కాపురానికి తీసుకెళ్లేందుకు ససేమిరా అనడంతో విజయ సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్తను తనను కలపి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజయ కోరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment