చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు | Wife Protest In Front Of Husband House In Kamareddy | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు

Published Wed, Jan 27 2021 5:01 PM | Last Updated on Wed, Jan 27 2021 7:35 PM

Wife Protest In Front Of Husband House In Kamareddy - Sakshi

కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన ఓ అమ్మాయి ఆశలు ఆవిరయ్యాయి. ప్రేమగా చూసుకుంటాడనుకున్న భర్త మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుండటంతో లబోదిబోమంటోంది. అత్తామామలు తనకు అండగా నిలబడతారనుకుంటే ఆమెను వదిలించుకునేందుకే మొగ్గు చూపుతుండటంతో తనకు దిక్కెవరంటూ బోరుమని ఏడుస్తోంది. 

సాక్షి, కామారెడ్డి: కట్టుకున్న వాడు మరో పెళ్లికి రెడీ అవుతుండటంతో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన పైడి నవీన్ కుమార్‌తో వేములవాడకు చెందిన అరుణకు 2017 అక్టోబర్ 6న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబ సభ్యులు పెళ్లికొడుక్కు రూ.14 లక్షల నగదు, 23 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. దీనికి తోడు ఆడపడుచు కట్నం కింద మరో రూ. 50 వేలు సమర్పించుకున్నారు. (చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై)

కానీ పెళ్ళైన పదిరోజుల నుంచే అరుణ పట్ల ఆమె మామ సురేందర్ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఆరు నెలలు ఈ ఇబ్బందులను ఎలాగోలా నెట్టుకొచ్చిన అరుణ ఆరోగ్యం బాగోలేక ఇంటికి వెళ్లింది. కానీ తిరిగి వచ్చేసరికి భర్తకు వేరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరడంతో గతేడాది భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. అయినా ఆమె సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో నేడు మరోసారి ఇంటిముందు బైఠాయించింది. ప్రాణం పోయినా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఘంటాపథంగా చెప్తోంది. (చదవండి: నా భర్త నాకు కావాలి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement