
సాక్షి, నిజామాబాద్: స్టెరాయిడ్స్ ఇచ్చి చంపే ప్రయత్నం చేసిన తన భర్త గంగాసాగర్‌ను శిక్షించి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆర్మూర్‌కు చెందిన బాధితురాలు స్రవంతి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. 2018లో ఆర్మూర్‌కు చెందిన గంగాసాగర్‌తో వివాహాం జరిగిందని, మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెట్టారని తెలిపింది. భర్త బాసరలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడని, అయితే ఇటీవల తనకు స్కిన్ ఎలర్జీ రావడంతో తగ్గిస్తానని చెప్పి ఇంజక్షన్లు ఇచ్చాడని తెలిపింది.
అయితే శరీరంలో మార్పులు రావడంతో వేరే ఆస్పత్రికి వెళ్లగా, అవి స్టెరాయిడ్స్ అని డాక్టర్లు చెప్పారని, తనను చంపే ప్రయత్నం చేశాడని వాపో యింది. భర్తను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కొడుకును కూడా చంపేస్తానని ఇంటికి కత్తితో వచ్చాడని తెలిపింది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ సఖి కేంద్రం అధికారులను ఆదేశించారు.
చదవండి: మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు!
Comments
Please login to add a commentAdd a comment