మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ కెఆర్ నాగరాజు
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపి, తర్వాత ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారమ్ సదానంద్‌కు కవితతో 2007లో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సదానంద్ బతుకు దెరువుకు కోసం కువైట్‌కు వెళ్లేవారన్నారు. 2008లో కవితకు అదే గ్రామానికి చెందిన మైలారం శేఖర్‌తో పరిచయమై తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది.
మే 5న కువైట్ నుంచి వచ్చిన సదానంద్‌కు భార్య మధ్య డబ్బుల విషయంలో తగాదా రావడంతో పాటు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. సదానంద్‌కు నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామానికి చెందిన తోకల విజయతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సదానంద్‌ను చంపేందుకు విజయతో కలిసి కవిత పథకం రచించింది.
పథకం ప్రకారం సదానందంను విజయ నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులోకి వెళ్లేవరకు మద్యం తాగించింది. అనంతరం కవితకు ఫోన్ చేసింది. కవితతో పాటు శేఖర్, మరో వ్యక్తి రాజశేఖర్ వచ్చారు. తర్వాత అందరూ కలిసి సందానందం గొంతుకు స్కార్ఫ్ బిగించి చంపివేశారని సీపీ వివ రించారు. హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించి కవిత, వి జయ, శేఖర్, రాజశేఖర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, బంగారు చైన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో అదనపు డీసీపీ నరేందర్, సీఐ జగడం నరేష్, ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment